ఎస్‌బీఐ ఈ-వాలెట్ న‌గ‌దు ఏటీఎం ద్వారా విత్‌డ్రా

ఎస్‌బీఐ ఈ-వాలెట్ న‌గ‌దును ఏటీఎం ద్వారా తీసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించనుంది.

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మొబైల్‌ వాలెట్ (ఈ-వాలెట్‌) లోని నగదునూ ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే స‌దుపాయాన్ని క‌ల్పించ‌న‌నుంది. ఖాతాదారుకు ఎస్‌బీఐ ఈ-వాలెట్‌లో న‌గ‌దు ఉంటే దానిని ఏటీఎం ద్వారా ఉపసంహరించుకోవచ్చు. అయితే లావాదేవీకి రూ.25 చొప్పున ఛార్జి పడుతుందని బ్యాంక్‌ వెల్లడించింది.

అదేవిధంగా బ్యాంక్‌ వ్యాపార ప్రతినిధుల (బిజినెస్ క‌రెస్పాండెట్స్) ద్వారా కూడా ఎస్‌బీఐ వాలెట్‌లో నిధులు జమచేసుకోవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. ప్ర‌తినిధుల‌ ద్వారా రూ.1,000 వరకు నగదును వాలెట్‌లో జమ చేసుకోవాలంటే 0.25 శాతం సేవారుసుము (కనీసం రూ.2 నుంచి రూ.8 వరకు) చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. దీనికి అదనంగా సేవాపన్ను కూడా చెల్లించాలి. జూన్‌ 1 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయి.

ఎస్‌బీఐ షేర్లు ప్ర‌స్తుతం బీఎస్ఈలో రూ.2.20 లాభంతో రూ.300 వ‌ద్ద కొన‌సాగుతున్నాయి

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly