ఆన్‌లైన్ ద్వారా మొబైల్ నెంబ‌రు అప్‌డేట్ చేసుకోండిలా..

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? ఇప్ప‌టికే మొబైల్ నెంబ‌రును రిజిస్ట‌ర్ చేసుకున్నారా? అయితే మొబైల్ నెంబ‌రును ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవ‌చ్చు

ఆన్‌లైన్ ద్వారా మొబైల్ నెంబ‌రు అప్‌డేట్ చేసుకోండిలా..

ఎస్‌బీఐ ఖాతాదారులు ఆన్‌లైన్ ద్వారా మొబైల్ నెంబ‌రు అప్‌డేట్ చేసుకోండిలా…
మొబైల్ నెంబ‌రును అప్‌డేట్ చేసుకునేందుకు ఖాతాదారుడు, తాను ఖాతా తెరిచిన బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక‌వేళ మీరు ఎస్‌బీఐ ఖాతాదారుడు అయితే ఇక‌పై బ్యాంక్‌కు వెళ్ళాల్సిన ప‌నిలేదు. ఆన్‌లైన్ ద్వారా మీ మొబైల్ నెంబ‌రును అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం మీకు ఏటీఎమ్‌-క‌మ్‌-డెబిట్ కార్డుతో పాటు, యాక్టీవేట్‌లో ఉన్న మొబైల్ నెంబ‌రు అవ‌స‌రం.

ఆన్‌లైన్‌ ద్వారా మొబైల్ నెంబ‌రును అప్‌డేట్ చేసుకునేందుకు అనుస‌రించ‌వ‌ల‌సిన విధానం:

 • ముందుగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో మీ యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్ చేసి లాగిన్‌ అవ్వాలి.
 • ఎడ‌మ వైపున ఉన్న మై అక్కౌంట్స్ అండ్ ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి.
 • ఇక్క‌డ డ్రాప్‌డైన్ మెనూలో ప్రొఫైల్‌ ఆప్ష‌న్ ఉంటుది. దానిపై క్లిక్ చేయాలి.
 • వ్య‌క్తిగ‌త వివ‌రాలు/ మొబైల్ నెంబ‌రుపై క్లిక్ చేయాలి.
 • ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్‌ని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
 • ఛేంజ్ మొబైల్ నెంబ‌ర్‌- డొమెస్టిక్ ఓన్లీ(ఓటీపీ/ ఏటీఎమ్‌/ కాంటాక్ట్ సెంట‌ర్) అని ఉన్న‌ లింక్‌పై క్లిక్ చేయాలి
 • వ్య‌క్తిగ‌త వివ‌రాలు-మొబైల్ నెంబ‌రు అప్‌డేట్‌తో కొత్త స్క్రీన్ తెరుచుకుంటుంది.
 • మీ మొబైల్ నెంబ‌రును టైప్ చేసి, కింద ఉన్న బాక్సులో మ‌రొక‌సారి మొబైల్ నెంబ‌రును ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయాలి.
 • ఇప్పుడు కొత్త మొబైల్ నెంబ‌రు టైప్ చేయాలి. మ‌రొక సారి కొత్త మొబైల్ నెంబ‌రు టైప్ చేసి స‌బ్మిట్ చేయాలి.
 • మీ కొత్త మొబైల్ నెంబ‌రును వెరిఫై చేసుకునేందుకు స్క్రీన్‌పై ఒక పాప్అప్ విండో ఓపెన్ అవుతుంది. ఒకే బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.
 • ఇక్క‌డ మూడు ఆప్ష‌న్లు ఉంటాయి.
  1.ఓటీపీ ద్వారా
  2.ఐఆర్ఏటీఏ: ఇంట‌ర్‌నెట్ బ్యాంక్‌
  3.కాంటాక్ట్ సెంట‌ర్ ద్వారా
  ఈ మూడు విధానాల‌లో దేనినైనా ఉప‌యోగించి మొబైల్ నెంబ‌రు అప్‌డేట్ చేసుకోవ‌చ్చు.
 1. ఓటీపీ ద్వారా: మీ వ‌ద్ద కొత్త, పాత మొబైల్ నెంబ‌ర్లు రెండు అందుబాటులో ఉంటే ఓటీపీ ద్వారా ఆన్‌లైన్ మొబైల్ నెంబ‌రు మార్చుకోవ‌చ్చు.
 • 'By OTP on both the Mobile Number’కు ఎదురుగా ఉన్న రెడియో బ‌ట‌న్‌పై క్లిక్ చేసిన అనంత‌రం ‘ప్రొసీడ్’ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి
 • డెబిట్ కార్డు ఉన్న ఖాతాకు ఎదురుగా ఉన్న రెడియో బ‌ట‌న్‌ను క్లిక్ చేసి, ‘ప్రొసీడ్’ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి
 • మీరు ఎంచుకున్న ఎక్కౌంట్‌తో అనుసంధాన‌మైన ఏటీఎమ్‌ను కార్డు సూచిస్తుంది. ఏటీఎమ్ కార్డును ఎంచుకుని ‘ప్రొసీడ్’ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి
 • త‌రువాత స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ గేట్‌వే డిస్‌ప్లే అవుతుంది.
 • కార్డు వివ‌రాలు(కార్డు నెంబ‌రు, వాలీడ్‌/ ఎక్స్‌పైరీ తేదీ, కార్డుదారుని పేరు, పిన్‌) ఎంట‌ర్ చేసి, ‘స‌బ్మిట్’ చేయాలి. స‌మాచారాన్ని స‌రిచూచుకుని ‘పే’ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
 • ధృవీక‌ర‌ణ విజ‌య‌వంత‌మైన త‌రువాత ఐఎన్‌బీ సిస్ట‌మ్ మీ పాత‌, కొత్త మొబైల్ నెంబ‌రు రెండింటికీ ఓటీపీ, రిఫ‌రెన్స్ నెంబ‌రుతోపాటు పంపిస్తుంది.
 • ఈ కింది ఫార్మెట్‌లో మీ పాత‌, కొత్త మొబైల్ నెంబ‌ర్ల ద్వారా ఎస్ఎమ్‌స్‌ను పంపించాలి. ACTIVATE <8 digit OTP value> <13 digit reference number> to 567676 within 4 hrs.
 • ఓటీపీ నెంబ‌రు, రిప‌రెన్స్ నెంబ‌రు ధృవీక‌రించిన త‌రువాత మీరు పంపిన కొత్త మొబైల్ నెంబ‌రు ఐఎన్‌బీ, సీబీఎస్‌, ఏటీఎమ్‌ల‌కు కాపీ అవుతుంది. మొబైల్ నెంబ‌రు అప్‌డేట్ అయిన‌ట్లుగా మీ మొబైల్‌కి మెసేజ్‌ కూడా వ‌స్తుంది.
  ఇదే విధానంలో 2. ఐఆర్ఏటీఏ ద్వారా, 3. కాంటాక్ట్ సెంట‌ర్ ద్వారా ఆన్‌లైన్‌లో మొబైల్ నెంబ‌రు మార్చుకోవ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly