ఎస్‌బీఐ ప‌సిడి రుణాలు-వ‌డ్డీరేట్లు

18 సంవ‌త్స‌రాల వ‌య‌సు నిండిన వారు ఎస్‌బీఐ వ్య‌క్తిగ‌త గోల్డ్‌లోన్ తీసుకునేందుకు అర్హులు.

ఎస్‌బీఐ ప‌సిడి రుణాలు-వ‌డ్డీరేట్లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బంగారంపై వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తుంది. ఒక ఖాతాదారుడు గ‌రిష్టంగా రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు బంగారంపై వ్య‌క్తిగ‌త రుణాల‌ను పొంద‌వ‌చ్చు. ఎస్‌బీఐ నియ‌మాల ప్ర‌కారం, బంగారు ఆభ‌ర‌ణాలు, బ్యాంకులు వ‌ద్ద నుంచి కొనుగోలు చేసిన బంగారు నాణాల‌తో స‌హా త‌న‌ఖా పెట్టుకుని రుణాల‌ను మంజూరు చేస్తారు. బంగారంపై ఇచ్చే రుణాల‌కు వ‌డ్డీ రేటు త‌క్కువ‌, పేప‌ర్ వ‌ర్క్ కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. అందువ‌ల్ల వ్యాపార, వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు త‌క్ష‌ణ‌మే రుణం పొందేందుకు ఈ రుణాలు స‌హాయ‌ప‌డ‌తాయి.

అర్హ‌త‌:
18 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన వ్య‌క్తులు ఎస్‌బీఐ నుంచి బంగారు రుణం పొందేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వ్య‌క్తిగ‌తంగా గానీ ఉమ్మ‌డి(జాయింట్‌)గా గానీ రుణం తీసుకోవ‌చ్చు. ఇందుకు స్థిర‌మైన ఆదాయ మార్గం ఉండాలి. రుణం పొందేందుకు ఆదాయ ప్రూఫ్‌ను ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు.

వ‌డ్డీరేటు:
ఎమ్‌సీఎల్ఆర్ (మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌-బేసెడ్ లెండింగ్ రేటు)కు 1.25 శాతం ఎక్కువ వ‌డ్డీకి ఎస్‌బీఐ బంగారు రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తుంది. ఒక సంవ‌త్స‌రం కాల‌ప‌రిమితి ఉంటుంది. ఏప్రిల్ 10,2019 నుంచి బ్యాంకులు ఒక సంవ‌త్స‌ర ఎమ్‌సీఎల్ఆర్ రేటు 8.5 శాతం వ‌ద్ద స్థిరంగా ఉంచాయి. దీని అర్ధం ఎస్‌బీఐ వ్య‌క్తిగ‌త బంగారు రుణ ఫ‌థ‌కంలో వ‌డ్డీ రేటు 9.75 శాతంగా ఉంటుంది.

ప్రాసిసింగ్ ఫీజు:
తీసుకున్న రుణం మొత్తంపై 0.50 శాతం+జీఎస్‌టీ, క‌నీసం రూ.500+ జీఎస్‌టీ ప్రాసెసింగ్ చార్జీలు వ‌ర్తిస్తాయి.

రుణం మొత్తం:
గ‌రిష్టంగా రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం తీసుకోవ‌చ్చు. క‌నీస రూ.20 వేలు రుణం తీసుకోవాలి.
మీరు ఎంచుకునే ప‌థ‌కంపై ఆధార‌ప‌డి కాల‌ప‌రిమితి ఉంటుంది.
గోల్డ్ లోన్ - రుణం ఇచ్చిన నెల కాకుండా త‌రువాత నెల నుంచి అస‌లు, వ‌డ్డీల‌ను తిరిగి చెల్లించ‌వ‌చ్చు.
లిక్వీడ్ గోల్డ్ లోన్‌- లావాదేవీల స‌దుపాయంతో ఓవ‌ర్ డ్రాప్ట్ ఖాతాను అందిస్తారు. వ‌డ్డీ నెల‌వారీగా చెల్లించాలి.
బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్‌లోన్‌ - రుణ‌కాల‌ప‌రిమితి కంటే ముందు లేదా ఖాతా మూసివేత ముందు చెల్లించ‌వ‌చ్చు.

ఎస్‌బీఐ గోల్డ్‌, ఎస్‌బీఐ లిక్వీడ్ గోల్డ్ లోన్‌ల గ‌రిష్ట కాల వ్య‌వ‌ధి 36 నెల‌లు. ఎస్‌బీఐ బులెట్ రీపేమెంట్ గోల్డ్‌లోన్‌ను తీసుకున్న తేదీ నుంచి 12 మాస‌ముల లోపుగా తిరిగి చెల్లించాలి.

రుణ మాంజూరు ప్ర‌క్రియ‌, రుణం మొత్తం పంపిణీ చేయడం రెండూ చాలా సుల‌భం. రుణం కోసం ద‌రఖాస్తు చేసుకునే వారు ఈ కింది ప‌త్రాలు అందించాలి.

  • గోల్డ్‌లోన్‌ ద‌ర‌ఖాస్తు ఫారం,
  • రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటులు
  • గుర్తింపు, చిరునామా ప్రూఫ్‌లు
  • నిరక్షరాస్యులైన రుణగ్రహీతలు సాక్షి లెట‌ర్ ఇవ్వాలి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly