ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌

క‌నీస న‌గ‌దు నిల్వ‌ల‌ రుసుముల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది.

ఎస్‌బీఐ  ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌

పొదుపు ఖాతాల‌లో క‌నీస న‌గ‌దు నిల్వ‌ను నిర్వ‌హించ‌ని వారిపై విధించే ఛార్జీల‌ను దాదాపు 75 శాతం త‌గ్గిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ ఈ రోజు ప్ర‌క‌టించింది. ఈ నిబంధ‌న‌లు ఏప్రిల్ 1, 2018 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణ‌యం 25 కోట్ల మందికి ఊర‌ట క‌లిగించ‌నుంది. మెట్రో ఇత‌ర పట్ట‌ణాల‌లో ప్ర‌స్తుతం గ‌రిష్టంగా రూ.50 వ‌ర‌కు ఛార్జీలు విధిస్తుండ‌గా తాజాగా దీనిని రూ.15 కి త‌గ్గించింది. అలాగే సెబీ అర్బ‌న్, గ్రామీణ ప్రాంతాల‌లోని ఛార్జీల‌ను సైతం రూ.40 నుంచి రూ.12 కి త‌గ్గిస్తున్న‌ట్లు బ్యాంక్ తెలిపింది. వీటిపై జీఎస్‌టీ అద‌నం.

ఖాతాల‌లో క‌నీస న‌గ‌దు నిల్వ‌లు కొనసాగించ‌నివారి నుంచి వ‌సూలు చేసిన రుసుముల రూపేణా కేవ‌లం ఎనిమిది నెల‌ల్లో ఎస్‌బీఐ రూ.1771 కోట్ల‌ను ఆర్జించింది. ఇది జులై-సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో బ్యాంక్ ఆర్జించిన రూ.1581.55 కోట్ల నిక‌ర లాభం కంటే అధికం కావ‌డంతో ఎస్‌బీఐ పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో గ‌త అక్టోబ‌ర్‌లో బ్యాంక్ ఈ ఛార్జీల‌ను 20 నుంచి 50 శాతం మేర త‌గ్గించింది.

ఎస్‌బీఐ భారీగా ఛార్జీల‌ను విధిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోబ్యాంకు ఛార్జీల త‌గ్గింపు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. భ‌విష్య‌త్తులో ఇత‌ర బ్యాంకులు కూడా ఎస్‌బీఐని అనుస‌రించే అవ‌కాశ‌ముంది. ఇదే జ‌రిగితే సామాన్య ప్ర‌జ‌ల‌కు భారీగా ఊర‌ట ల‌భిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly