రెపో రేటుతో ఎస్‌బీఐ గృహ రుణాల అనుసంధానం

రూ.లక్ష పైబడిన సేవింగ్స్‌ డిపాజిట్‌ రేట్లను రెపో రేటు నుంచి 2.75 శాతం తీసివేస్తే ఎంత వస్తే అంత (రెపో రేటు-2.75%)గా నిర్ణయించింది

రెపో రేటుతో   ఎస్‌బీఐ గృహ రుణాల అనుసంధానం

గృహ రుణాలను జులై నుంచి రెపో రేటుతో అనుసంధానం చేయనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పేర్కొంది. ఇప్పటికే ఈ బ్యాంకు తన స్వల్పకాల రుణాలు, భారీ సేవింగ్స్‌ డిపాజిట్లను రెపోతో అనుసంధానం చేసిన విషయం విదితమే. అదే సమయంలో రూ.లక్ష పైబడి పరిమితి ఉన్న క్యాష్‌ క్రెడిట్‌ అకౌంట్‌(సీసీ), ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ) వినియోగదార్లకు వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ ప్రయోజనాలు కూడా జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి.

సీసీ/ఓడీ వినియోగదార్లకు రెపో అనుసంధానిత రుణ రేటు(ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) 8 శాతంగా మారనుందని; ఇక రూ.లక్షకు పైబడిన సేవింగ్స్‌ డిపాజిట్లకు కొత్త రేటు 3 శాతంగా ఉంటుందని వివరించింది. రూ.లక్ష పైడిన అన్ని సీసీ ఖాతాలు, ఓడీలను రెపో రేటుతో 2.25 శాతాన్ని కలిపితే ఎంత వస్తే అంతగా(రెపో రేటు+2.25%) మార్చిలో ఎస్‌బీఐ అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రూ.లక్ష పైబడిన సేవింగ్స్‌ డిపాజిట్‌ రేట్లను రెపో రేటు నుంచి 2.75 శాతం తీసివేస్తే ఎంత వస్తే అంత(రెపో రేటు-2.75%)గా నిర్ణయించింది. గురువారం ఆర్‌బీఐ తన పరపతి విధానంలో భాగంగా రెపో రేటును పావు శాతం తగ్గించి 5.75 శాతానికి పరిమితం చేసిన నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly