పెట్టుబ‌డుల‌పై 4 రెట్ల అధిక లాభం పొందండి

ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబ‌డులు కొన‌సాగించాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్‌, కేవీపీ ఎంచుకోవ‌చ్చు.

పెట్టుబ‌డుల‌పై 4 రెట్ల అధిక లాభం పొందండి

ఈ దీపావ‌ళికి మీరు తీసుకునే పెట్టుబ‌డుల‌ నిర్ణ‌యం మీ జీవితంలో వెలుగులు నింపవ‌చ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా కిసాన్ వికాస్ ప‌త్ర‌(కేవీపీ) లో పెట్టుబ‌డులు చేస్తే మార్కెట్ రిస్క్‌కు సంబంధం లేకుండా మీరు పెట్టిన డ‌బ్బు నాలుగు రెట్లు పెరగడంతో పాటు ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. మార్కెట్‌లో ఇప్పుడు చాలా ర‌కాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. అయితే అంద‌రూ పెట్టుబ‌డుదారులు రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్లు లేదా స్టాక్‌లతో పోలిస్తే కిసాన్ వికాస్ ప‌త్రా (కేవీపీ), ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఎలాంటి రిస్క్ ఉండ‌దు. ఫిక్స్డ్ డిపాజిట్ల‌పై 6-8.5 శాతం వ‌ర‌కు, కేవీపీపై 7.7 శాతం వ‌డ్డీ రేటు ల‌భిస్తుంది. దీనిని వార్షికంగా లెక్కిస్తారు. మ‌రి రిస్క్ లేకుండా ఎఫ్‌డీ లేదా కేవీపీ పెట్టుబ‌డుల ద్వారా 4 రెట్లు లాభాన్ని ఎలా పొంద‌వ‌చ్చో చూద్దాం.

పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు:

పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఈ దీపావ‌ళికి మీరు ల‌క్ష రూపాయ‌లు జ‌మ చేసార‌నుకోండి. కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీల‌పై ఇప్పుడు 7-8 శాతం వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి. ఐదేళ్ల పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ట‌ర్మ్ డిపాజిట్ (టీడీ)పై 7.8 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం, ఐదేళ్ల ట‌ర్మ్ డిపాజిట్‌పై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ల‌క్ష రూపాయ‌లు డిపాజిట్ చేస్తే ప‌న్ను మిన‌హాయింపుతోపాటు ఐదేళ్ల‌కు మీ డ‌బ్బు రూ.147144 కి చేరుతుంది. ఐదేళ్ల త‌ర్వాత తిరిగి పెట్టుబ‌డులు పెడితే అది మొత్తం రూ.216,514 కి పెరుగుతుంది. అదేవిధంగా 15 ఏళ్ల‌కి మీ పెట్టుబ‌డులు రూ.318,588, 20 ఏళ్ల‌కు రూ.4,68,785 కి పెరుగుతాయి. అయితే రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కే పెట్టుబ‌డుల‌పై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంద‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి. పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్‌లు ప్ర‌జ‌ల్లో పొదుపు అల‌వాటును ప్రోత్స‌హించేందుకు ప్రారంభించారు.

కిసాన్ వికాస్ ప‌త్ర‌:

కిసాన్ వికాస్ ప‌త్రాల‌ను పోస్టాఫీసులో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ప్ర‌భుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో కేవీపీ ముఖ్య‌మైన‌ది. ఈ ప‌థ‌కంలో మీరు చేసిన పెట్టుబ‌డులు 119 నెల‌లకు అంటే 9 సంవ‌త్స‌రాల నాలుగు నెల‌ల‌కు రెట్టింపు అవుతుంది. ఈ దీపావ‌ళికి ల‌క్ష రూపాయ‌లు డిపాజిట్ చేస్తే ప‌దేళ్ల కంటే ముందుగానే రూ.2 లక్ష‌లు జ‌మ‌వుతాయి. మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత కూడా మీ డ‌బ్బును తిరిగి పెట్టుబ‌డిగా పెట్ట‌వ‌చ్చు. అయితే ఆదాయ పన్ను నిబంధ‌న‌ల ప్ర‌కారం కేవీపీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly