ఏటీఎమ్‌ల్లో లభించే సేవలు

ఏ సమయంలో అయినా, అందుబాటులో ఉన్నఏటీఎమ్‌ ద్వారా నగదు విత్ డ్రా తో బాటు వివిధ రకాల లావాదేవీలు జరపవచ్చు. వివరాలు తెలుసుకుందాం.

ఏటీఎమ్‌ల్లో లభించే సేవలు

ఏటీఎమ్‌లు నగదు డ్రా చేసుకోవడానికే కాదు, పలు రకాల సేవలను అందిస్తున్నాయి. మొబైల్‌ రీఛార్జీ మొదలుకొని రైలు ప్రయాణ టిక్కెట్లు కొనుక్కునే వరకూ ఎన్నో పనులను ఏటీఎమ్‌ ద్వారా చేయవచ్చు.

నగదు విత్ డ్రా :

 • ఏటీఎమ్‌ నుంచి ఏ సమయంలో అయినా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.
 • ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎమ్‌ నుంచే కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎమ్‌ నుంచి కూడా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకు చార్జీలు వర్తిస్తాయి.

బిల్లు చెల్లింపులు:

బయట చెల్లింపు కేంద్రాల్లో ఒక్కోసారి బిల్లు చెల్లింపులు చేయాలంటే చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది. సర్వర్‌ డౌన్‌, కరెంటు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అదే ఏటీఎమ్‌ల్లో అయితే వెంటనే బిల్లుచెల్లింపులు చేయవచ్చు. నీటి బిల్లులు, కరెంటు బిల్లులు, టెలిఫోన్‌ బిల్లులు, పన్ను చెల్లింపులు తదితరాలన్నింటినీ ప్రస్తుతం ఏటీఎమ్‌ కేంద్రాల్లోనే నిర్వహించవచ్చు. సేవా సంస్థలకు, దేవాలయాలకు విరాళాలను కూడా బ్యాంకు ఏటీఎమ్‌ నుంచే ఇచ్చే సదుపాయం ఉంది .

చెక్కు డిపాజిట్లు:

 • మనం చెల్లింపూలకు సంబంధించిన చెక్కులు లేదా మనకు వచ్చిన చెక్కులను నగదుగా మార్చుకోవడం కోసం బ్యాంకుకు వెళ్ళే అవసరం లేకుండా ఏటీఎమ్‌ కేంద్రంలోనే చెక్కులను డిపాజిట్ చెయ్య వచ్చు.

ఏటీఎమ్‌ నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ :

 • ఏటీఎమ్‌ యంత్రంలో ఏటీఎమ్‌ కార్డును స్వైప్‌ చేయాలి. భాషను ఎంచుకోవాలి. పిన్‌ నంబరును నమోదు చేయాలి.
 • సేవల్లో ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
 • ఇక్కడ పలు రకాల ట్రాన్స్‌ఫర్‌ సౌకర్యాలు ప్రత్యక్షమవుతాయి. కార్డు నుంచి కార్డుకు ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
 • రెండుసార్లు రిసీవర్‌ ఏటీఎమ్‌ కార్డు నంబరును నమోదు చేయాలి.
 • బదిలీ చేయాల్సిన నగదు విలువను నమోదు చేయాలి.
 • ఖాతా ఏ రకమైనదో తెలపాలి.
 • మొత్తం లావాదేవీ పూర్తయిన తర్వాత రసీదు తీసుకోవాలి.
 • బ్యాంకును, ఖాతా రకాన్ని బట్టి నగదు బదిలీకి పరిమితులు ఉండవచ్చు.

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపు:

 • ఏటీఎమ్‌ యంత్రంలో కార్డును స్వైప్‌ చేయాలి.
 • పిన్‌ నంబరు నమోదు చేసిన తర్వాత సేవలు ప్రత్యక్షమవుతాయి.
 • మోర్‌ ఆప్షన్స్‌ను ఎంపిక చేసుకోవాలి.
 • అందులో క్రెడిట్‌కార్డు పేమెంట్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
 • క్రెడిట్‌ కార్డు నంబరును నమోదు చేయాలి.
 • ఈ దశలో బిల్లు వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి.
 • మీరు చెల్లించాలనుకుంటున్న నగదు విలువను అక్కడ నమోదు చేయాలి.
 • బ్యాంకు ఖాతాలో నుంచి సొమ్ము మినహాయింపు జరిగి, క్రెడిట్‌ కార్డు ఖాతాకు నగదు బదిలీ అవుతుంది.
 • లావాదేవీకి సంబంధించిన రసీదు వస్తుంది.

ఆదాయపు పన్ను చెల్లింపు:

 • ఏటీఎమ్‌ నుంచే ఆదాయ పన్ను చెల్లింపులు జరపవచ్చు. ఇందుకు మొదట బ్యాంకు వెబ్సైటు ద్వారా డెబిట్ కార్డును రిజిస్టర్ చేసుకోవాలి.
 • దీని ద్వారా పాన్ (PAN), పన్ను చెల్లింపుల ఖాతా నెంబర్ (TAN) అనుసంధానం అవుతాయి.
 • ఒక సారి ఈ వివరాలు నమోదు పూర్తి చేసుకుంటే, ఏటీఎమ్‌ ద్వారా అంశాల వారీగా వివరాలు చూసుకుని చెల్లింపులు జరపవచ్చు.
 • చెల్లింపులు జరిపిన తర్వాత లావాదేవీకి సంబంధించిన స్పెషల్ నెంబర్ (SIN) వస్తుంది.
 • బ్యాంకు వెబ్సైటు ద్వారా ఈ నెంబర్ను నమోదు చేసి పన్ను చెల్లింపు చలానా పొందవచ్చు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ):

 • కొన్ని బ్యాంకులు ఏటీఎమ్‌ నుంచే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే సదుపాయం కల్పిస్తున్నాయి. ఏటీఎమ్‌లో రిక్వెస్ట్‌ చేసిన రోజు నుంచి 3 పని దినాల్లోగా ఎఫ్‌డీ లభిస్తుంది.
 • పొదుపు ఖాతా, శాలరీ అకౌంట్‌ ఉన్నవారికి ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి.
 • అయితే బ్యాంకులో ఉన్నట్లుగా అన్ని రకాల కాలపరిమితితో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉండకపోవచ్చు. అక్కడ ఉన్న వాటిలోనుంచి మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.
 • రూ. 10,000 నుంచి రూ. 49,999 వరకూ ఎఫ్‌డీ చేసే సదుపాయం ఉంది. ఇలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఎన్ని చేయాలనే విషయంలో పరిమితి లేదు.
 • ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ తెరవగానే బ్యాంకు రికార్డుల్లో ఉన్న చిరునామాకు డిపాజిట్‌ మొమోరాండాన్ని పంపుతారు.
 • ఏటీఎమ్‌ నుంచి చేసే ఎఫ్‌డీలకు నామినీగా పొదుపు ఖాతాలో ఉన్న వారినే ఉంచుతారు.

రీఛార్జ్ :

 • మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, టీవీ డీటీహెచ్ మొదలైన రీఛార్జీలు ఏటీఎమ్‌ నుంచే చేసుకోవచ్చు.

చెక్కు బుక్‌ కోసం అభ్యర్థించడం

 • బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి, ఎటువంటి పత్రాలు నింపకుండానే చెక్కుబుక్‌ కోసం అభ్యర్థించవచ్చు.

రైలు/ ఫ్లైట్ ప్రయాణ టికెట్‌ కొనుగోలు:

 • ఏటీఎమ్‌ నుంచే రైలు, ఫ్లైట్ టికెట్ల కొనుగోలు, రద్దు చేసుకోవచ్చు.

మొబైల్‌ నంబరు అప్‌డేట్‌:

 • ఏటీఎమ్‌ యంత్రంలో కార్డును స్వైప్‌ చేయాలి.
 • మోర్‌ ఆప్షన్స్‌లో ‘అప్‌డేట్‌ మొబైల్‌ నంబరు’ను ఎంచుకోవాలి.
 • పది అంకెల మొబైల్‌ నంబరును రెండుసార్లు నమోదు చేయాలి.
 • గరిష్టంగా రెండు రోజుల్లో మొబైల్‌ నంబరు అప్‌డేట్‌ అవుతుంది.
 • ఈ సదుపాయం పొదుపు ఖాతాదారులకు వర్తిస్తుంది.

ఏటీఎమ్‌లలో లభించే సేవలు, వాటిపై వర్తించే చార్జీలు బ్యాంకునుబట్టీ, ఖాతా రకాన్ని బట్టే మారుతుంటాయి. వివరాలు తెలుసుకుని ఏటీఎమ్‌ ద్వారా లభించే సేవలను ఉపయోగించుకోవడం వలన పనులు సులభంగా చేసుకొంటూ, సమయాన్ని అదా చేసుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly