ఏడు కంపెనీలు.. రూ.87,966 కోట్లు

ముగిసిన గ‌త‌వారంలో టీసీఎస్, హెచ్‌డీఎప్‌సీ, ఇన్ఫోసిస్, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ల మార్కెట్ విలువ ఇంత‌మేర‌కు పెరిగింది.

ఏడు కంపెనీలు.. రూ.87,966 కోట్లు

మార్కెట్ విలువ‌లో అగ్ర స్థానంలో ఉన్న‌ కంపెనీల‌లో, గ‌త‌వారం ఏడు కంపెనీల మార్కెట్ విలువ మొత్తం క‌లిపి రూ.87,965.88 కోట్లు పెరిగింది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ ముందంజ‌లో ఉన్నాయి. ఆ త‌ర్వాత టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్‌), హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. మ‌రోవైపు రిల‌య‌న్స్ ఇండ‌స్ర్టీస్, ఐటీసీ, ఎస్‌బీఐ మార్కెట్ విలువ త‌గ్గింది.

పెరిగిన కంపెనీల మార్కెట్ విలువ వ‌రుస‌గా…

  • హిందుస్థాన్ యునిలివ‌ర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్‌) మార్కెట్ విలువ‌ రూ.22,145.92 కోట్లు పెరిగి రూ.3,98,290.92 కోట్లకు చేరింది.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ‌ రూ.18,264.93 కోట్లు పెరిగి రూ.6,23,892.08 కోట్లకు
  • హెచ్‌డీఎఫ్‌సీ రూ.15,148.15 కోట్లు పెరిగి రూ.3,81,619.34 కోట్లకు
  • టీసీఎస్ పెరిగిన మార్కెట్ విలువ రూ.14,840.68 కోట్ల‌తో ప్ర‌స్తుతం రూ.8,42,635.51 కోట్ల‌కు
  • ఇన్ఫోసిస్ రూ.6,335.19 కోట్లు పెరిగి రూ.3,39,372 కోట్ల‌కు
  • ఐసీఐసీఐ బ్యాంక్ రూ.6,237.72 కోట్ల‌తో రూ.2,71,360.08 కోట్లకు
  • కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ రూ.4,993.29 కోట్లు పెరిగి రూ.2,92,866.47 కోట్లకు చేరింది.

అయితే ఎస్‌బీఐ, ఐటీసీ, రిల‌య‌న్స్ కంపెనీల మార్కెట్ విలువ త‌గ్గింది…

  • ఎస్‌బీఐ మార్కెట్ విలువ రూ.15,261.1 కోట్లు త‌గ్గి రూ.2,60,018.56 కోట్లకు చేరింది
  • రిల‌య‌న్స్ ఇండ‌స్ర్టీస్ రూ.14,072.8 కోట్లు త‌గ్గ‌డంతో రూ.7,36,602.08 కోట్ల‌కు
  • ఐటీసీ రూ.12,606.9 కోట్లు త‌గ్గి రూ.3,12,146.38 కోట్లుగా న‌మోదైంది

అదేవిధంగా సెన్సెక్స్ గ‌త‌వారంలో 463.69 (1.24%) పాయింట్లు లాభ‌ప‌డింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly