ప్ర‌భుత్వ బాండ్లలో నేరుగా మ‌దుపుచేయోచ్చా?

సాధారణంగా మూడు వేర్వ‌రు కాల‌ప‌రిమితిల్లో టీ-బిల్లులు, ఐదు మెచ్యూరిటీలలో ప్ర‌భుత్వ బాండ్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 70% పెట్టుబడులు స్వల్పకాలిక వర్గంలోకే వెళ్తున్నాయి.

ప్ర‌భుత్వ బాండ్లలో నేరుగా మ‌దుపుచేయోచ్చా?

ఎంత‌కాలంపాటు మ‌దుపు చేస్తే, ఎంత మొత్తం రాబ‌డి వ‌స్తుందో ముందుగానే తెలిస్తూ, స్థిర‌మైన ఆదాయాన్ని ఇచ్చే (ఫిక్సిడ్ ఇన్‌క‌మ్) ప‌థ‌కాల్లో మ‌దుపు చేయాల‌నుకుంటున్నారా? గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ప్ర‌భుత్వ బాండ్ల‌లో పెట్టుబ‌డి చేయ‌డం చాలా సుల‌భం అని చెప్పాలి. సాధార‌ణంగా ఫిక్సిడ్ డిపాజిట్ల‌లో మ‌దుప‌ర్లు త‌మ మొత్తాన్ని బ్యాంకుల్లో ఉంచ‌డం ద్వారా రాబ‌డి వ‌స్తుంది. ఈఏడాది నుంచి రెండు ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్ లు జీరోదా, నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజీ అందుబాటులోకి వ‌చ్చాయి.

ఏంటీ జీ-సెక్యూరిటీలు:

ఫిక్స్డ్ డిపాజిట్లలో, బ్యాంకులు మీ డబ్బు తీసుకుని మీకు మెచ్యూరిటీపై అస‌లు, వడ్డీని ఇస్తాయి. జీ-సెక్ ల విషయంలో, ప్రభుత్వం బాండ్లను జారీచేస్తుంది. జీ-సెక్ లో పెట్టుబడి చేసేందుకుదు స్వల్పకాలిక దీర్ఘ-కాలిక పెట్టుబ‌డి సాధానాలు అందుబాటులో ఉంటాయి. అస‌లు, వ‌డ్డీ మొత్తం క‌లిపిన‌ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వ బాండ్లు ప్ర‌భుత్వ‌ మద్దతు ఉండే సార్వభౌమ సెక్యూరిటీలు. గతంలో, రిటైల్ పెట్టుబడిదారులకు ఇవి త‌క్కువ‌గా అందుబాటులో ఉండేవి. ఆర్‌బీఐ నిబంధనలను సడలించిన తరువాత, ఇవి ఎక్స్ఛేంజ్లలో లభిస్తున్నాయి. ప్ర‌తీసోమవారం , మంగళవారం, బుధవారం రిజ‌ర్వు బ్యాంకు వేలం నిర్వహిస్తున్నప్పుడు, పెట్టుబడిదారులు దీన్ని కొనుగోలు చేసుకోవ‌చ్చు. వీటి కేటాయింపు శుక్రవారం ఉంటుంది. ఇప్పుడు, బ్రోకింగ్ సంస్థ‌లు, ఆన్లైన్ బ్రోకింగ్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా లభ్యమవుతున్నాయి.

ఎన్ఎస్ఇ లేదా జెరోదా ద్వారా పెట్టుబడి పెట్టడానికి మీరు అప్లికేష‌న్ ల‌ను డౌన్లోడ్ చేయ‌డం లేదా వెబ్సైట్ల ద్వారా చేయ‌వ‌చ్చు. జీ-సెక్యూరిటీలు ఆఫ‌ర్ స‌మ‌యంలో బిడ్ ల‌ను వేయాలి. బిడ్డింగ్ ద్వారా మ‌దుప‌ర్లు త‌మ‌కు కావాల్సిన ప్ర‌భుత్వ సెక్యురిటీల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ విధానాన్ని మ‌దుప‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకువెళ్లేందుకు స్టాక్ ఎక్స్ఛేంజీలు బ్రోకర్లు ప్రోత్సహిస్తున్నాయి.

ఈ విధానంలో పెట్టుబడి చేసేందుకు మ‌దుప‌ర్లు డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. ప్ర‌భుత్వ సెక్యురిటీల‌ను కొనుగోలు చేసిన త‌రువాత డీమ్యాట్ ఖాతాలోకి జ‌మ‌వుతాయి. ఈ సంవత్సరం నుంచే జీ- సెక్యూరిటీల్లో నేరుగా పెట్టుబడులు సులభతరంగా మారింది. ఇంత‌కు ముందు నుంచి బ్యాంకులు స్వ‌చ్ఛందంగా త‌మ ఖాతాదారుల‌కు ప్ర‌భుత్వ సెక్యురిటీల‌ను విక్రయిస్తుండేవి. గత ఏడాది ఎక్స్ఛేంజీలు చిన్న మ‌దుప‌ర్లు కూడా త‌మ సెక్యురిటీల‌ను ఎక్స్ఛేంజీ ద్వారా విక్ర‌యించేందుకు వీలుక‌ల్పించాయి.

మ‌దుపు చేస్తారా?

దీర్ఘ-కాల బాండ్ల విషయంలో, సంవత్సరానికి రెండుసార్లు కూపన్లు లభిస్తాయి. సాధారణంగా మూడు వేర్వ‌రు కాల‌ప‌రిమితిల్లో టీ-బిల్లులు, ఐదు మెచ్యూరిటీలలో ప్ర‌భుత్వ బాండ్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 70% పెట్టుబడులు స్వల్పకాలిక వర్గంలోకే వెళ్తున్నాయి. ఇది స్థిర ఆదాయం ఉత్పత్తుల కోసం చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. స్వల్పకాలిక, దీర్ఘ-కాల బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాల‌ని అనుకునే వారికి ఇది ఒక ఎంపిక.

వీటి ద్వారా వ‌చ్చే రాబడిపై పన్ను చెల్లించాలి. వడ్డీ ఆదాయాన్ని ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా ఆదాయం పన్ను స్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాలి. బాండ్ ధరలోమూల‌ధ‌న వృద్ధి ఉంటే,దాన్ని మూలధనం రాబ‌డిగా పరిగణించాలి.దీర్ఘ‌కాల మూల ధ‌న ఆదాయంపై ప‌న్ను 10 శాతంలేదా ఇండెక్షేష‌న్ తో 20 శాతం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly