ఇక ప్ర‌తినెలా గోల్డ్ బాండ్లు

రానున్న నాలుగు నెల‌ల్లో నాలుగు సిరీస్ లుగా సార్వ‌భౌమ బంగారు బాండ్ల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేస్తోంది.

ఇక ప్ర‌తినెలా గోల్డ్ బాండ్లు

సార్వ‌భౌమ బంగారు బాండ్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశాన్ని ఇక నుంచి ప్ర‌తీనెల మ‌దుప‌ర్ల‌కు అందుబాటులోకి తేనుంది. రిజర్వు బ్యాంకు తో సంప్రదించిన‌ భారత ప్రభుత్వం 2019 జూన్ నుంచి సెప్టెంబర్ 2019 వరకు ప్రతి నెలలో సార్వభౌమ గోల్డ్ బాండ్లను జారీ చేయాలని నిర్ణయించింది.

సార్వ‌భౌమ బంగారు బాండ్ల‌ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో కొనుగోలు చేయ‌వ‌చ్చు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు, పేమెంట్ బ్యాంక్లు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , నియమించిన‌ పోస్టాఫీస్లు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రతి నెలలో మీరు బాండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. వ‌చ్చే నాలుగు నెల‌ల్లో ప్ర‌తీనెల ఈ బాండ్లు మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉంటాయి.

2019-20 సిరీస్ II, జులై8-12, 2019 మ‌ధ్య స‌బ్‌స్క్రిప్ష‌న్ కు అందుబాటులో ఉంటుంది. వీటి జారీ జులై 16, 2019 న ఉంటుంది.
2019-20 సిరీస్ III, ఆగ‌స్టు 5-9, 2019 మ‌ధ్య స‌బ్‌స్క్రిప్ష‌న్ కు అందుబాటులో ఉంటుంది. వీటి జారీ ఆగ‌స్టు 14, 2019 న ఉంటుంది.
2019-20 సిరీస్ IV, సెప్టెంబ‌రు 9-13, 2019 మ‌ధ్య స‌బ్‌స్క్రిప్ష‌న్ కు అందుబాటులో ఉంటుంది. వీటి జారీ సెప్టెంబ‌రు 17, 2019 న ఉంటుంది.

ఒక‌ గ్రాము యూనిట్ గా తీసుకుని బంగారు బాండ్ల‌లో పెట్టుబ‌డి చే్య‌వ‌చ్చు. రిటైల్ మ‌దుప‌ర్లు, హెచ్ఎన్ఐలు, ట్రాస్టులు,విశ్వ‌విద్యాల‌యాలు, చారిటీలు ఈ బాండ్ల‌లో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. రిటైల్ మ‌దుప‌ర్లు, హెచ్ఎన్ఐలు క‌నీసం ఒక గ్రాము, గ‌రిష్టంగా 4 కేజీల వ‌ర‌కూ పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. ట్రస్ట్లకు ఒక‌ ఆర్థిక సంవత్సరంలో గ‌రిష్టంగా 20 కేజీల వ‌ర‌కూ పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. మ‌దుప‌ర్లు వేర్వేరు ద‌ఫాల్లో కొనుగోలు చేసిన బాండ్ల‌కు క‌లిపి గ‌రిష్ట ప‌రిమితి వ‌ర్తిస్తుంది. ప్రభుత్వం, సెకండరీ మార్కెట్ నుంచి కొనుగోలు స‌మ‌యంలో మ‌దుప‌ర్లు సెల్ఫ్ డిక్లరేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. తొలి సారి గోల్డ్ బాండ్ల‌లో పెట్టుబ‌డి చేసేవారు కేవైసీ నిబంధ‌న‌ల‌కు మ‌దుప‌ర్లు ఓట‌ర్ గుర్తింపు కార్డు, ఆధార్, పాన్, టాన్ లేదా పాస్ పోర్టు మొద‌లైన డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ ప్రచురించిన ధ‌ర ఆధారంగా మ‌దుప‌ర్లు బాండ్ల‌లో పెట్టుబ‌డి చేయాలి. 999 స్వచ్ఛత బంగారు ధర సగటు ధర స‌బ్‌స్క్రిప్ష‌న్ ముందు వారం చివరి మూడు పని దినాలలో ఉన్న ధ‌ర‌కు స‌గ‌టు లెక్కించి ధ‌ర నిర్ణ‌యిస్తారు. పెట్టుబ‌డి చేసేందుకు గరిష్టంగా రూ .20,000 వరకు న‌గదు చెల్లింపు చేయోచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి, డిజిటల్ మోడ్ ద్వారా చెల్లించే పెట్టుబడిదారులకు 50 రూపాయల తగ్గింపు లభిస్తుంది.

ఈ బాండ్లు 8 సంవత్సరాల కాల‌ప‌రిమితి క‌లిగి ఉంటాయి. అయితే 5 వ సంవత్సరం తర్వాత నిష్క్రమించే ఎంపిక ఉంటుంది. పెట్టుబడిదారులకు విలువపై సంవత్సరానికి 2.50 శాతం స్థిర వడ్డీని ఆరు నెల‌ల‌కు ఒకసారి పొందుతారు. ఆదాయ పన్ను చట్టం, 1961 (1961 లో 43) ప్రకారం పన్ను ఉంటుంది. బాండ్లు ముందుగా ఉప‌సంహ‌రించుకుంటే గ‌త‌ 3 రోజుల బంగారం ధ‌ర స‌గ‌టు ఆధారంగా ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ ప్రచురించిన ధ‌ర ప్ర‌కారం చెల్లింపులు ఉంటాయి.

మెచ్యూరిటీ, నిష్క్రమణ ఎంపికలు కాకుండా, పెట్టుబడిదారులకు స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా లిక్విడిటీ ఉంటుంది. ఈ బాండ్ల ద్వారా ల‌భించే మూల‌ధ‌న‌ లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేష‌న్ ప్రయోజనాలను పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly