శ్రేయ్ ఎన్‌సీడీ ఇష్యూ రూ.500 కోట్లు

శ్రేయ్ మార్పిడి ర‌హిత డిబెంచ‌ర్లు (ఎన్‌సీడీ) ఇష్యూ మొద‌టి ద‌శ మే 9 న ముగుస్తుంది.

శ్రేయ్ ఎన్‌సీడీ ఇష్యూ రూ.500 కోట్లు

శ్రేయ్ ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్ ఫైనాన్స్ ఎన్‌సీడీ ఇష్యూ రూ.500 కోట్లు స‌మీక‌రించే ఉద్దేశంతో ప్రారంభించారు. స‌మీక‌రించిన నిధుల‌ను రుణాలు, సాధార‌ణ కార్పొరేట్ అవ‌స‌రాల కోసం వినియోగించ‌నుంది. మొద‌టి ద‌శ ఇష్యూ మే 9 న ముగియ‌నుంది. ఈ ద‌శ‌లో రూ.500 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వ‌ర‌కు ప‌రిమితి విధించింది. ఐదేళ్ల కాల ప‌రిమితితో కూడిన ఈ బాండ్ల‌కు అత్య‌ధిక కూప‌న్ ధ‌ర 10.75 శాతంగా నిర్ణ‌యించారు. త‌మ కంపెనీలు శ్రేయ్‌, శ్రేయ్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ బాండ్‌హోల్డ‌ర్ల‌కు, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా కూప‌న్ 0.25 శాతం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. స‌మీక‌రించిన దానిలో 75 శాతం రుణాలను ఇచ్చేందుకు లేదా చెల్లించేందుకు, 25 శాతం సాధార‌ణ కార్పొరేట్ అవ‌స‌రాల కోసం వినియోగించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఆర్‌బీఐ తాజాగా రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు త‌గ్గించి 6 శాతంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో మంచి ధ‌ర ఉన్న ఎన్‌సీడీలు రిటైల్ మ‌దుప‌ర్ల‌కు మంచి చాయిస్ గా మారాయి. కార్పొరేట్ బాండ్ మార్కెట్‌ను కూడా విస్త‌రిస్తామ‌ని, ఎన్‌సీడీ ఇష్యూకి మంచి డిమాండ్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు కంపెనీ తెలిపింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly