ప్రామాణిక త‌గ్గింపుతో ఎంత ప‌న్ను ఆదా?

2019-20 ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వం వేత‌న జీవుల‌కు ఊర‌ట క‌ల్పించింది.

ప్రామాణిక త‌గ్గింపుతో ఎంత ప‌న్ను ఆదా?

శుక్ర‌వారం ప్ర‌వేశ‌పెట్టిన 2019 బ‌డ్జెట్ వేత‌న జీవుల‌కు ప్రామాణిక త‌గ్గింపు (స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌) రూ.50 వేల‌కు పెంచింది. దీంతో ప‌న్ను చెల్లించాల్సిన ఆదాయం త‌గ్గుతుంది. గ‌తేడాది దీనిని తిరిగి తీసుకొచ్చి రూ.40 వేలుగా నిర్ణ‌యించారు.ఇది రవాణా భత్యం రూ.19,200; వైద్య భత్యం రూ.15,000 క‌లిపి మొత్తం రూ.34,200 ఉండేది. అయితే వేత‌న జీవులు కొంత మాత్ర‌మే ఊర‌ట ల‌భించింద‌ని చెప్పుకోవ‌చ్చు. 31.2 శాతం ప‌న్ను వ‌ర్తించే వారికి రూ.1,810 ఆదా అయ్యేది. గత బడ్జెట్‌లో ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపు రూ.40,000 ప్రతిపాదించారు. ఈ కొత్త బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ.50,000 చేశారు. దీనివల్ల 31.2 శాతం శ్లాబువారికి ఇత‌ర ఛార్జీలు కాకుండా రూ.3,120 పన్ను మినహాయింపు లభించనుంది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly