వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

ఎస్‌బీఐ జూలై 10 నుంచి ఎమ్‌సీఎల్ఆర్ ను 5 బేసిస్ పాయింట్లు లేదా 0.05శాతం తగ్గించినందున వినియోగ‌దారుల‌కు రుణాలు చౌక‌గా ల‌భిస్తాయి.

వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

ఒక సంవత్సరం ఎమ్‌సీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) 8.45% నుంచి 8.40% కి తగ్గింది. ఏప్రిల్ 1 నుండి ఎస్‌బీఐ రుణ రేట్లలో ఇది మూడవ తగ్గింపు.ఎస్‌బీఐ జూలై 10 నుంచి ఎమ్‌సీఎల్ఆర్ ను 5 బేసిస్ పాయింట్లు లేదా 0.05శాతం తగ్గించినందున వినియోగ‌దారుల‌కు రుణాలు చౌక‌గా ల‌భిస్తాయి.

దేశ అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఎమ్‌సీఎల్ఆర్ ను అన్ని కాల‌ప‌రిమితిల‌లో 5 బిపిఎస్‌ల(0.05శాతం) తగ్గించింది. ఒక సంవత్సరం ఎమ్‌సీఎల్ఆర్ 8.45% నుంచి 8.40% కి తగ్గింది. దీనివల్ల ఇల్లు, కారు ఇతర రిటైల్ రుణాలు చౌకగా లభిస్తాయి.

ఫలితంగా, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ తో అనుసంధానించబడిన అన్ని రుణాలపై వడ్డీ రేట్లు 10 జూలై 2019 నుండి 5 బిపిఎస్ లేదా 0.05శాతం తగ్గాయి. ఏప్రిల్ 1 నుంచి ఎస్‌బీఐ రుణ రేట్లలో ఇది మూడవ తగ్గింపు. ఎంసిఎల్ఆర్ కోతతో, 2019 ఏప్రిల్ 10 నుంచి గృహ రుణ రేట్ల తగ్గింపు 20 బేసిస్ పాయింట్లు అని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly