సుకన్య సమృద్ధి యోజనతో పాప భవిష్యత్తు బంగారం చేద్దామా!

సుకన్య సమృద్ధి యోజన ప‌థ‌కంలో పెట్టుబడి సురక్షితం, వడ్డీపై పన్ను మినహాయింపు, కచ్చితమైన రాబడి ఉంటుంది

సుకన్య సమృద్ధి యోజనతో పాప  భవిష్యత్తు  బంగారం చేద్దామా!

దేశ జనాభా తోపాటు వారి జీవన ప్రమాణాలు , అవసరాలు కూడా పెరిగాయి . విదేశాలనుంచి దిగుమతులను తగ్గించి స్వదేశంలోనే ఉత్పత్తి పెంచేందు ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా ’ అనే నినాదంతో విదేశీ పెట్టుబడి దారులను ఆహ్వానిస్తోంది . ఈ ఉద్యమంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే . ముఖ్యంగా యువత ఈ ఉద్యమాన్ని ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకువెళుతున్నారు.

ప్రస్తుతం ఆడపిల్లలు అన్ని రంగాలలోని ఉద్యోగాల్లో ముందంజ వేస్తున్నారు. స్వంతంగా సంస్థలను నడుపుతున్నారు. అంకుర సంస్థలను స్థాపించి నలుగురికి ఉపాధితోపాటు కల్పించడంతో పాటు ఆదర్శంగా నిలుస్తున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్లు ఆడపిల్లలు చదువులో ముందుంటున్నారు. అయితే నాణ్యమైన ఉన్నత చదువులు కొంచెం ఖరీదైనవి. అయితే ఒక పద్దతి ప్రకారం మదుపు చేసినట్లయితే నాణ్యమైన ఉన్నత చదువులు సాధించవచ్చు.

ఉదా : కరుణ , కరుణాకరరావు లకు ఒక ఏడాది కుమార్తె కిరణ్మయి. భవిష్యత్తులో మంచి చదువు చెప్పించాలని వారి కోరిక. అందుకోసం వారు కొనుగొన్న వివరాలు ఈ కింది పట్టికలు చూపించడమైనది.

SSY 1.jpg

పాప బంగారు భవిష్యత్తు కోసం వారు సుకన్య సమృద్ధి యోజన పధకాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల కోసం ప్రవేశ పెట్టిన మదుపు పధకం ’ సుకన్య సమృద్ధి యోజన '. ఇందులో పెట్టుబడి సురక్షితం, వడ్డీపై పన్ను మినహాయింపు, కచ్చితమైన రాబడి ఉంటుంది . దీని ద్వారా 10 ఏళ్ల లోపు ఉన్న ఆడపిల్లల పేరుమీద ఖాతా తెరిచి, వార్షికంగా రూ 1.50 లక్షల వరకు జమ చేసినట్లయితే , పాపకు 18 సంవత్సరాల వయసుకు తగిన మొత్తం జమ అవుతుంది.
వారు మొదటి ఐదు సంవత్సరాలు ప్రతి నెల రూ 12,500 (వార్షికంగా రూ 1.50 లక్షలు ) జమ చేస్తారు. తరువాతి ఐదు సంవత్సరాలు నెలకు రూ 16,667 (వార్షికంగా రూ 2 లక్షలతో), అలాగే చివరి నాలుగు సంవత్సరాలు ప్రతి నెల రూ 20,833 (వార్షికంగా రూ 2.50 లక్షలు ) జమ చేస్తారు.
ఈ కింది పట్టిక ద్వారా ఎంత జమ అవుతుందో చూద్దాం:

SSY 2.jpg

సుకన్య సమృద్ధి యోజన పూర్తి వివరాలు ఈ కధనం ద్వారా తెలుసుకోండి :
http://eenadusiri.net/Detailed-explanation-of-sukanya-samruddhi-yojana-aD35mGN

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద వార్షికంగా రూ 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రతి 5 సంవత్సరాలకు ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతుందని , మొత్తం కాలానికి వార్షిక వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంటుందని అంచనా వేయడమైనది.

ముగింపు:
ఇప్పటికి ఈ మొత్తం ఎక్కువగా అనిపించ వచ్చు. అయితే పెరుగుతున్న విద్యా ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే , 18 సంవత్సరాలకు ఈ మొత్తం సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఉన్నత విద్యా ఖర్చులు వార్షికంగా 8-10 శాతం పెరుగుతుంటాయి.

ప్రభుత్వ నియమ నిబంధలను అనుసరించి ఖాతాను నిర్వహించాలి. ఇంతకంటే అధిక మొత్తంలో మదుపు చేయాలనుకుంటే ఈ పధకంతోపాటు పీ పీ ఎఫ్ , ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో కూడా మదుపు చేసి పన్ను మినహాయింపు పొందవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly