ఆధార్ అనుసంధానంపై సుప్రీం కీల‌క తీర్పు

ఆధార్ అనుసంధానం గ‌డువు తేదీ మీద సుప్రీం కోర్ట్ తీర్పు వెలువ‌రించింది

ఆధార్ అనుసంధానంపై సుప్రీం కీల‌క తీర్పు

కోట్లాది ప్ర‌జ‌ల‌కు ఊర‌టనిస్తూ ఆధార్ అనుసంధానంపై సుప్రీం కోర్ట్ కీల‌క తీర్పును వెలువ‌రించింది. బ్యాంకు ఖాతాలు, మొబైల్ నెంబ‌ర్ల‌తో ఆధార్ అనుసంధానానికి గ‌డువు తేదీని పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం తీర్పిచ్చింది. వివిధ సేవ‌ల‌కు ఆధార్‌తో అనుసంధాన గ‌డువు తేదీ ఈ నెల 31 తో ముగియ‌నున్న విష‌యం తెలిసిందే.

ఆధార్ చ‌ట్ట‌బద్ధ‌త‌కి సంబంధించిన కేసులో తుది తీర్పు వెల్ల‌డి చేసేంత‌వ‌ర‌కు ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది. ఈ నెల చివ‌రి లోపు తుది తీర్పు వెలువ‌రించే అవ‌కాశం లేనందునా ధ‌ర్మాస‌నం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. పాస్‌పోర్ట్‌లు జారీ చేసేందుకు కూడా ఆధార్ అనుసంధానం అక్క‌ర్లేద‌నీ, అయితే ఆధార్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 7 క్రింద అందుతున్న సేవ‌ల‌కు, రాయితీల‌కు ఇది అవ‌సర‌మేన‌ని కోర్ట్ తెలిపింది.

ప్ర‌స్తుతం 35 మంత్రిత్వ శాఖ‌ల ప‌రిధిలో దాదాపు 135 ప‌థ‌కాలకు ఆధార్ అనుసంధానం ద్వారా సేవ‌లందుతున్నాయి. రానున్న కాలంలో ఆధార్ అనుసంధానం ఎన్నో విషయాల్లో కీలకం కానుంది. ముఖ్యమైన సేవలన్నింటిలో ఆధార్ ని అనుసంధానం చేస్తే భవిష్యత్తులో చాలా వరకు అవినీతి ని నిరోధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly