జీఎస్‌టీ ప‌రిధిలోకి పెట్రోల్‌, విద్యుత్

పెట్రోలియం ఉత్ప‌త్తులు, విద్యుత్ ల‌ను కూడా జీఎస్‌టీ లోకి తెచ్చే అవ‌కాశం ఉంద‌ని బీహార్ ఆర్థిక మంత్రి సుశీల్ కుమార్ మోదీ అన్నారు.

జీఎస్‌టీ ప‌రిధిలోకి పెట్రోల్‌, విద్యుత్

భ‌విష్య‌త్‌లో విద్యుత్‌, పెట్రోలియం స‌హా మ‌రికొన్ని ఉత్ప‌త్తుల‌ను కూడా జీఎస్‌టీ ప‌రిధిలోకి తెచ్చే అవ‌కాశం ఉంద‌ని బీహార్ ఆర్థిక మంత్రి సుశీల్ కుమార్ మోదీ అన్నారు. అయితే దీనికి గ‌డువేమి లేద‌ని, జీఎస్‌టీ మండ‌లి దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుందని ఆయ‌న అన్నారు. వీటితో పాటు స్థిరాస్తి, స్టాంప్ డ్యూటీల‌ను కూడా జీఎస్‌టీలోకి తీసుకువ‌స్తామ‌ని నిన్న జ‌రిగిన ఫిక్కీ వార్షిక స‌మావేశాలలో ఆయ‌న ప్ర‌సంగించారు. జీఎస్‌టీ మండ‌లిలో ఆయ‌న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల‌కు నేతృత్వం వ‌హిస్తున్నారు.

ప్ర‌స్తుతం కేంద్ర, రాష్ట్రాల‌కు వ‌చ్చే ఆదాయంలో 40 శాతం పెట్రోలియం ఉత్ప‌త్తుల నుంచే వ‌స్తోంద‌న్నారు. వీటిని జీఎస్‌టీ ప‌రిధిలోకి తెచ్చిన‌ప్ప‌టికీ ఇవి గ‌రిష్ట స్థాయి ప‌న్ను రేటులోనే ఉంటాయ‌న్నారు. దీంతో పాటు వీటిపై రాష్ట్రాలు సెస్‌ విధించే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా వాటి ఆదాయానికి పెద్ద‌గా ఇబ్బందులు ఉండ‌బోవ‌న్నారు. ప‌న్నుల వ‌సూళ్లు మెరుగ‌యితే శ్లాబ్‌ల కుదింపు కూడా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly