టీసీఎస్ ఖాతాలో మ‌రో భారీ ఆర్డ‌ర్‌

ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ ఖాతాలో మ‌రో భారీ ఆర్డ‌ర్ చేరింది.

టీసీఎస్ ఖాతాలో మ‌రో భారీ ఆర్డ‌ర్‌

వ‌రుస‌గా కాంట్రాక్ట్‌ల‌ను సాధిస్తున్న ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ తాజాగా మ‌రో భారీ ఆర్డ‌ర్‌ను ద‌క్కించుకుంది. బ్రిట‌న్, ఐరోపాల్లో బీమా వ్యాపారం నిర్వ‌హించే ప్రుడెన్షియ‌ల్ అనుబంధ సంస్థ ఎమ్‌జీ ప్రుడెన్షియ‌ల్ నుంచి 690 మిలియ‌న్ డాల‌ర్ల(సుమారు 4500 కోట్లు) డీల్‌ని టీసీఎస్ ద‌క్కించుకుంది. గ‌డిచిన నెల కాలంలో టీసీఎస్ చేజిక్కించుకున్న మూడో భారీ కాంట్రాక్ట్ ఇది కావ‌డం విశేషం.

ఈ డీల్‌లో భాగంగా ఎమ్‌జీ ప్రుడెన్షియ‌ల్‌కి చెందిన బీమా వ్యాపారానికి, కంపెనీ ప‌దేళ్ల పాటు డిజిట‌ల్ సేవ‌లు అందించాల్సి ఉంటుంది. అంత‌కుముందు ఈ సేవ‌ల‌ను అందించిన క్యాపిటా పీఎల్‌సీ నుంచి ఈ భారీ ఆర్డర్‌ని టీసీఎస్ ద‌క్కించుకోవ‌డం విశేషం.

ఇటీవ‌లి కాలంలో టీసీఎస్ వ‌రుస బెట్టి భారీ కాంట్రాక్ట్‌ల‌ను ద‌క్కించుకుంటోంది. గ‌త నెల‌లో అమెరికా టెలివిజ‌న్ రేటింగ్‌ల సంస్థ నీల్స‌న్ నుంచి 2 బిలియ‌ర్ డాల‌ర్లు, ట్రాన్స్అమెరికా కంపెనీ నుంచి మ‌రో 2 బిలియ‌న్ డాల‌ర్ల ఆర్డర్‌ను ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly