ట్రాయ్ అప్లికేష‌న్‌తో సుల‌భంగా ఛాన‌ళ్ల ఎంపిక‌

ఛానళ్ల ఎంపికలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ఛానల్‌ ఎంపిక అప్లికేషన్‌ను ఏర్పాటు చేసింది

ట్రాయ్ అప్లికేష‌న్‌తో సుల‌భంగా ఛాన‌ళ్ల ఎంపిక‌

కేబుల్‌ ఆపరేటర్‌ ఇష్టానుసారం కాకుండా చూడదలచిన ఛానళ్లకు చెల్లింపులు చేసి ప్రసారాలు పొందవచ్చ‌ని ట్రాయ్ గతంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇందుకుగానూ తొలుత డిసెంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు గడువు ఇచ్చినా త‌రువాత మ‌రొక నెల జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు పొడిగించింది. ఈ గడువు కూడా ముగిసి కేబుల్‌ టీవీ ప్రసారాల నూతన నిబంధనలు శుక్రవారం నుంచి అమల్లోకి వ‌చ్చాయి. కొత్త నిబంధనలతో వినియోగదారులపై ఛార్జీల భారం భారీగా పెరగనుంది. కొత్త నిబంధనల మేరకు ప్రసార సంస్థలు, ఆపరేటర్లకు ప్రత్యేక విధివిధానాలు ఖరారు చేస్తూ టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) అవసరమైన ఏర్పాట్లు చేసింది. టీవీ ఛానల్‌ ప్యాకేజీ వివరాలను అందుబాటులో పెట్టింది. ఛానళ్ల ఎంపికలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఛానల్‌ ఎంపిక అప్లికేషన్‌ https://channel.trai.gov.in సిద్ధం చేసింది. ఈ ప్లాట్‌ఫారం ద్వారా వినియోగదారుడి కోరిక మేరకు ఎంపిక చేసిన ఛానళ్లకు అయ్యే ఖర్చు, తదితర వివరాలు తెలియనున్నాయి.

ట్రాయ్ వెబ్‌సైట్‌లో ఛాన‌ళ్ల‌ను ఎంపిక చేసుకునే విధానం:

ఛాన‌ళ్ళ ఎంపిక‌పై వినియోగ‌దారునికి ఇప్ప‌టికీ అనేక సందేహాలు ఉన్నాయి. ఛాన‌ళ్ళ ఎంపిక‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు ట్రాయ్ ఛాన‌ల్ సెలెక్ట‌ర్ అప్లికేష‌ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగ‌దారుడు అవ‌స‌ర‌మైన ఛాళ్ల‌ను ఎంపిక‌చేసుకోవ‌చ్చు.

  • మొద‌టిగా ట్రాయ్ ఛాన‌ల్ వెబ్‌సైట్ https://channel.trai.gov.in లోకి ఎంట‌ర్ అయితే ఈ కింది విధంగా పేజీ వ‌స్తుంది. పేజీ చివ‌రిలో ఉన్న “గెట్ స్టార్ట‌డ్” పై క్లిక్ చేయాలి.
trai home.jpg

గెట్ స్టార్ట‌డ్ పై క్లిక్ చేస్తే ఈ కింది పేజీ వ‌స్తుంది. ఇందులో ఉన్న 5 స్టెప్‌ల‌లో కొన్ని వివ‌రాల‌ను ఇవ్వాలి. వీటిని ఇష్ట‌ప్ర‌కారం ఇవ్వ‌వ‌చ్చు. త‌ప్ప‌నిస‌రి కాదు. వివ‌రాల‌ను ఎంట‌ర్ చేస్తే కంటిన్యూ క్లిక్ చేయాలి. లేదంటే స్కిప్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.

details page.jpg

మీపేరు, రాష్ట్రం, ఎలాంటి ఛాన‌ళ్లు కావాలి(వార్త‌లు, సంగీతం, క్రీడ‌లు మొద‌లైన‌వి), ఛాన‌ళ్ళ ర‌కం (ఎస్‌డీ లేదా హెచ్‌డీ) ఈ వివ‌రాలు ఇచ్చిన త‌రువాత పేజీ ఈ కింది విధంగా ఉంటుంది.

  • ఛాన‌ళ్ళ జాబితా కోసం పేజీ పైభాగంలో కుడివైపున “ఫ్రీ-టు-ఎయిర్‌” లేదా “పేయిడ్ ఛాన‌ళ్ళ‌” పై క్లిక్ చేస్తే ఆయా ఛాన‌ళ్ల జాబితా క‌నిపిస్తుంది. ఛాన‌ళ్ళ‌ను ఎంపిక చేసుకుని వ్యూ సెల‌క్ష‌న్ పై క్లిక్ చేస్తే, మీరు ఎంపిక చేసుకున్న చాన‌ళ్ల‌కు చెల్లించ‌వ‌ల‌సిన బిల్లు(జీఎస్‌టీతో స‌హా) వ‌స్తుంది.
    ETV1.jpg

నెట్‌వ‌ర్క్‌ ఛాన‌ళ్ళ ప్యాకేజీల‌ను ఎంపిక చేసుకోవాలంటే:

పేయిడ్ ఛాన‌ళ్ల‌ను అందించే నెట‌వ‌ర్క్‌లు, వారు అందించే ఛాన‌ళ్లు అన్నింటిని ఒక గ్రూప్‌గా చేసి ధ‌ర నిర్ణ‌యించారు. ఉదాహ‌ర‌ణ‌కి ఈనాడు గ్రూప్ వారి నెట్ వ‌ర్క్‌లో 7 తెలుగు ఛాళ్ల‌ను అందిస్తుంది. ఇందుకు గానూ వారు రూ.24 ఛార్జ్ చేస్తున్నారు. ఈనాడు లోని ఏడు ఛాన‌ళ్ల‌ను విడివిడిగా తీసుకుంటే రూ. 43 అవుతుంది. (ఈటీవీ హెచ్‌డీ రూ. 19, ఈటీవీ ప్ల‌స్ హెచ్‌డీ రూ. 9, ఈటీవీ సినీమా హెచ్‌డీ రూ.8, ఈటీవీ అభిరుచి హెచ్‌డీ రూ.3, ఈటీవీ లైఫ్ హెచ్‌డీ రూ. 2, ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రూ. 1, ఈటీవీ తెలంగాణా రూ.1 ఛాన‌ళ్లు ఉంటాయి.) అదేవిధంగా మిగిలిన ఛాన‌ళ్ల‌ను కూడా విడివిడిగా తీసుకుంటే ఎక్కువ చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది. అందువ‌ల్ల ఒకే నెట్ వ‌ర్క్‌లోని వివిధ ఛాన‌ళ్లు ఒకే ప్యాకేజీగా ఎంచుకునేందుకు పేజీ పైభాగంలో కుడివైపున ఛాన‌ళ్ల బొకే లిస్ట్‌పై క్లిక్ చేసి, మీకు న‌చ్చిన నెట్‌వ‌ర్క్‌ను ఎంచుకోవ‌చ్చు.

channels list.jpg

ఉదాహ‌ర‌ణ‌కి నాలుగు ప్ర‌ధాన తెలుగు ఛాన‌ళ్ల బేసిక్ ప్యాకేజీల‌ను ఎంచుకుంటే చెల్లించ‌వ‌ల‌సిన మొత్తం ఈ కింది విధంగా ఉంటుంది.

final bill.jpg

ఉచితంగా ఇచ్చే 100 ఛాన‌ళ్ల‌లో 25 దూరదర్శన్‌ ఛానళ్లు తప్పనిసరి. 100 కంటే ఎక్కువ ఉచిత ఛాన‌ళ్ళు తీసుకుంటే ప్రతి 25 ఛానళ్ల శ్లాబ్‌కు రూ.20 అద‌నంగా చెల్లించాలి. ఇప్పటి వరకు రూ.200లకు అటూఇటుగా స్థానిక ఎంఎస్‌వోలు కేబుల్‌ టీవీ ప్రసారాలు చేసేవారు. కొన్ని పేయిడ్ ఛాన‌ళ్లును ఎంచుకుంటునే దాదాపు రూ.300 వ‌ర‌కు చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది. ఇక అన్ని ఛానళ్లను పొందాలంటే ప్రజలు ఇంకా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కావ‌ల‌సిన త‌క్కువ ఛాన‌ళ్ళు ఎంచుకునే వారికి ఇది ప్ర‌యోజ‌న‌క‌రంగానే ఉన్న అన్ని ఛాన‌ళ్లు కావాల‌నుకునే వారు మాత్రం అద‌న‌పు భారం మోయ‌క త‌ప్ప‌దు.

డీటీహెచ్‌, కేబుల్ టీవీ వినియోగ‌దారులు కూడా పై విధాన‌ల‌ను అనుస‌రించి మీ ఛాన‌ళ్ల ఎంపిక ధ‌ర‌ల‌ను ప‌రిశీలించి మీ కేబుల్ టీవీ ఆప‌రేట‌ర్ను గానీ డీటీహెచ్ ఆప‌రేట‌ను గానీ సంప్ర‌దించి ఛాన‌ళ్ల‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly