సైడ్ పాకెటింగ్ ప్ర‌వేశ‌పెట్టిన టాటా మ్యూచువల్ ఫండ్

డీహెచ్ఎఫ్ఎల్ చెల్లింపులు ఆల‌స్యం కావ‌డంతో టాటా మ్యూచువల్ ఫండ్ తొలిసారిగా సైడ్ పాకెటింగ్ ప్రొవిజ‌న్ ఉప‌యోగించింది

సైడ్ పాకెటింగ్  ప్ర‌వేశ‌పెట్టిన టాటా మ్యూచువల్ ఫండ్

ఇటీవ‌లె డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రావాల్సిన మొత్తం ఆల‌స్యం కావ‌డంతో టాటా మ్యూచువల్ ఫండ్ సైడ్ పాకెటింగ్ ప్రొవిజ‌న్ ఉప‌యోగించింది. డిసెంబరు 2018 లో సెబీ ప్రవేశపెట్టిన సైడ్ పాకెటింగ్ నిబంధనలను ప్రేవ‌శ‌పెట్టింది. సైడ్ పాకెటింగ్ ప్ర‌కారం మ్యూచువ‌ల్ ఫండ్లు పెట్టుబ‌డి చేసిన వాటిల్లో ఏవైనా చెల్లింపులు ఆల‌స్యం చేసినా లేదా ముంద‌నుకున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం వాటి నుంచి అందాల్సిన మొత్తం ఫండ్ నిర్వాహ‌కుల‌కు అంద‌క‌పోయినా ఈ ప్రొవిజ‌న్‌ను మ్యూచువ‌ల్ ఫండ్లు ఉప‌యోగించుకోవ‌చ్చు.

సైడ్ పాకెటింగ్ ప్ర‌కారం నిర్వ‌హిస్తున్న ఆస్తుల్లో చెల్లింపులు ఆగిన లేదా ఆల‌స్యం అయిన పెట్టుబ‌డుల‌ను వేరుచేసి యూనిట్లుగా విభ‌జిస్తారు. స‌క్ర‌మంగా ఉన్న మిగిలిన ఆస్తుల‌ను య‌థాత‌థంగా కొన‌సాగిస్తారు. వీటిని కూడా యూనిట్లుగా విభ‌జిస్తారు. ఈ యూనిట్ల‌ను మ‌దుప‌ర్లు ఎప్పుడైనా స‌రే ఉప‌సంహ‌రించుకునేందుకు వీలుంటుంది. సైడ్ పాకెటింగ్ ప్ర‌కారం వేరుచేసిన అనుమాస్ప‌దంగా లేదా ఆల‌స్యమైన మొత్తం అందాక సైడ్ పాకెటింగ్ ప్ర‌కారం విభ‌జించిన యూనిట్ల‌ను మ‌దుప‌ర్లు ఉస‌సంహ‌రించుకోవ‌చ్చు.

డీహెచ్ఎఫ్ఎల్ చెల్లింపులు ఆల‌స్యం చేయ‌డంతో టాటా మ్యూచువల్ ఫండ్ సంస్థ‌కు చెందిన‌టాటా కార్పోరేట్ బాండ్ ఫండ్, టాటా మీడియం టర్మ్ ఫండ్, టాటా ట్రెజరీ అడ్వాంటేజ్ ఫండ్ మూడు పథకాలలో (సైడ్ పాకెట్స్) ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు ప్రకటించింది. ఈ పథకాలకు కొత్త‌గా నిధుల ప్ర‌వాహాన్ని కూడా నిలిపివేసింది.
ఏప్రిల్ 30, 2019 నాటికి, డిహెచ్ఎఫ్ఎల్ లో టాటా కార్పోరేట్ బాండ్ ఫండ్ 28.21% , టాటా మీడియం టర్మ్ ఫండ్ 14.60% ఎక్స్పోజర్, టాటా ట్రెషరీ అడ్వాంటేజ్ ఫండ్ 3.77% పెట్టుబ‌డుల‌ను క‌లిగి ఉన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ వ‌డ్డీ చెల్లింపులను ఆల‌స్యం చేసిన‌ తరువాత, మూడు పథకాల ఎన్ఏవీలు 29.69 శాతం, 12.31 శాతం, 4.06 పడిపోయాయి. సైడ్ పాకెటింగ్ నిబంధ‌న వ‌ర్తింప‌చేసేంద‌కు స్వీమ్ ఇన్ఫ‌ర్మేష‌న్ డాక్యుమెంటును సవరించాలి. ఈ సవరణ ప‌థ‌కం మౌలిక స్వ‌రూపంటో మార్పు చేస్తుంది కాబ‌ట్టి మ‌దుప‌ర్ల‌కు ఫండ్ నుంచి నిధుల‌ను ఉప‌సంహరించుకునేందుకు 30 రోజులు నిష్క్రమణ లోడ్ లేకుండా అవ‌కాశం ఇవ్వాలి. ఈ కాలం ముగిసిన తర్వాత సైడ్ పాకెట్ లో వేరుచేసిన నిధులు మిన‌హా మిగిలిన మొత్తంతో రూపొందించిన యూనిట్ల‌ను మాత్ర‌మే తీసుకునేందుకు అవ‌కాశ‌ముంటుంది.

టాటా మ్యూచువల్ ఫండ్ మే 11, 2019 న సైడ్ పాకెటింగ్‌ను ప్రవేశపెట్టడానికి 11 డెట్ పథకాల స్వీమ్ ఇన్ఫ‌ర్మేష‌న్ డాక్యుమెంటులను సవరించింది. 30 రోజుల నిష్క్రమణ లోడ్ లేని విండో జూన్ 14 న ముగుస్తుంది. ఈ స‌మ‌యం త‌రువాత ఏఎమ్‌సీ సైడ్ పాకెట్ అమలు చేయడానికి ప్రతిపాదించింది.

అనేక సందర్భాల్లో ఏఎంసీలు వారి పెట్టుబడులలో 75% వ‌ర‌కూ ప‌క్క‌న పెట్ట‌డం జ‌రిగింది. ఉదాహరణకు, రూ. 100 కోట్ల విలువున్న‌ పెట్టుబ‌డ ఇప్పుడు కేవలం 25 కోట్ల రూపాయలకు మాత్రమే విలువైనది. అన్ లిస్టెడ్ సెక్యురిటీలైతే, 100% నిర‌ర్థ‌క‌మైన వాటిగా గుర్తించినవి కూడా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్ప‌టికే న‌ష్టం జ‌రిగిపోయింది. ఇప్పుడు నిష్క్రమించడం వలన పన్నులు పరంగా ఖర్చులు రావచ్చు. ఈ వ్యయాలు సుమారు 0-25% వ‌ర‌కూ ఉండొచ్చు. కాబ‌ట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని మ‌దుప‌ర్లు నిర్ణ‌యం తీసుకోవాలి. డీహెచ్ఎఫ్ఎల్ వివిధ ఆస్తులను విక్రయించడానికి చర్చలు జరుపుతున్నందున కొంత రికవరీ కూడా ఉండొచ్చు.ఇప్పుడు నిష్క్రమించిన‌ వారు ఈ పథకాలలో ఎలాంటి రుణాలనూ రికవరీ చేసుకునే అవ‌కాశం ఉండ‌దు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly