మీ ప‌న్ను స్లాబ్ ప్ర‌కారం ఎంత రీబేట్ వ‌స్తుందో తెలుసా..

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారు ఎటువంటి ప‌న్ను చెల్లించ‌న‌వ‌సరం లేదు.

మీ ప‌న్ను స్లాబ్ ప్ర‌కారం ఎంత రీబేట్ వ‌స్తుందో తెలుసా..

ఈ నెల (ఏప్రిల్‌) నుంచి 2019-20 కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మైంది. ప‌న్ను ఆదా చేసేందుకు ఆర్థిక ప్ర‌ణాళిక‌ను ప్రారంభించేందుకు ఇదే స‌రైన స‌మ‌యం. ఈ కొత్త సంవ‌త్స‌రానికి ప‌న్ను స్లాబులో ఎటువంటి మార్పు ఉండ‌ద‌ని ఆర్థిక మంత్రి పీయూష్ గోయ‌ల్ బ‌డ్జెట్ స‌మావేశంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌భుత్వం ప‌న్ను రిబేట్ ప్ర‌క‌టించ‌డం, స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప‌రిమితి పెంచ‌డం వ‌ల్ల మీ ప‌న్ను లెక్కింపులో మార్పులు ఉండే అవ‌కాశం ఉంది.

60 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న వ్య‌క్తులకు రూ. 2.5 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ప‌న్ను వ‌ర్తించ‌దు. ప్ర‌స్తుతం రూ.2.5 ల‌క్ష‌ల నుంచి రూ. 5 ల‌క్ష‌ల మ‌ధ్య‌ ఆదాయం ఉన్న వారు 5 శాతం స్లాబ్‌లోకి, రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల మ‌ధ్య ఆదాయం ఉన్న వారు 20 శాతం స్లాబ్‌లోకి, రూ.10 ల‌క్ష‌ల పైన ఆదాయం ఉన్న వారు 30 శాతం స్లాబ్‌లోకి వ‌స్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవ‌త్స‌రం రూ. 5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 87ఏ ప్ర‌కారం రూ.12,500 వ‌ర‌కు ప‌న్ను రిబేట్ పొంద‌వ‌చ్చు. అంటే రూ.5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారు ఎటువంటి ప‌న్ను చెల్లించ‌న‌వ‌సరం లేదు.

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌(60 సంవ‌త్స‌రాల నుంచి 80 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్కులు)కు రూ. 3 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధి ఉంటుంది. సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్లు(80 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ వ‌య‌సు గ‌ల వారు)కు రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధి ఉంటుంది.

ఉద్యోగ‌స్తుల‌కు ప్ర‌స్తుతం స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను రూ. 40 వేల నుంచి 50 వేల‌కు పెంచారు. దీని వ‌ల్ల దాదాపు 3 కోట్ల ఉద్యోగస్తులు, పెన్షన‌ర్లు అద‌నంగా దాదాపు రూ.4,700 కోట్ల వ‌ర‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొందుతారు.
మీ ఆదాయం రూ.50 లక్షలు దాటినట్లయితే మొత్తం ప‌న్ను చెల్లింపుల‌పై ఆరోగ్య‌, విద్య సెస్ కింద అదనంగా 4 శాతం చేరుస్తారు.

60 ఏళ్ళ లోపు వ‌య‌సు వారికి ఆదాయ‌పు ప‌న్ను రేట్లు:
it1.jpg

2018-19 ఆర్థిక సంత్స‌రానికి సీనియ‌ర్ సిట‌జ‌న్స్‌కు ఆదాయ‌పు ప‌న్ను రేట్లు:
it2.jpg

2019-20 ఆర్థిక సంత్స‌రానికి సీనియ‌ర్ సిట‌జ‌న్స్‌కు ఆదాయ‌పు ప‌న్ను రేట్లు:
it3.jpg

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly