పన్ను రాయితీతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు

దీర్ఘకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు భద్రతతోబాటు, పన్ను రాయితీ పొందే అవకాశాన్నీ కల్పిస్తాయి.

పన్ను రాయితీతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు

పన్ను రాయితీని కల్పించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్థిర ఆదాయంతోబాటు, పన్ను మినహాయింపు పొందాలనుకునే వారికి అనుకూలమైనవి.  ఈ పథకంలో పెట్టుబడులు పూర్తి సురక్షితం.  ఈ ర‌క‌మైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన‌వారికి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్షన్ 80సీ కింద రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌న్ను మినహాయింపు వ‌ర్తిస్తుంది.

ముఖ్యమైన లక్షణాలు:

  • పాన్‌కార్డు కలిగి ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు  పన్ను రాయితీతో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేందుకు అర్హులు .
  • పెట్టుబడులను ఒకరిపేరు మీద లేదా ఉమ్మడిగా చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలో మొదటి వ్యక్తి ఆదాయానికి మాత్రమే పన్ను రాయితీ ఉంటుంది.
  • ఈ డిపాజిట్ల కాలపరిమితి 5 ఏళ్లు.
  • కనీస డిపాజిట్‌ విలువ రూ.100 ఆ పై గుణాంకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు.
  • గరిష్ఠ డిపాజిట్‌ విలువ రూ.1.5లక్షలు .
  • పెట్టుబడి పెట్టే తేదీకి ఉన్న వడ్డీరేటును 5 ఏళ్ల కాలానికి అమలుచేస్తారు.
  • వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ లేదు.
  • ఈ పెట్టుబడులపై రుణసౌకర్యం ఉండదు.
  • ఈ డిపాజిట్‌ ఖాతాలను కాలపరిమితికి ముందుగా మూసివేసే అవకాసం లేదు.

పెట్టుబడిపై మినహాయింపు ఉన్నప్పటికీ మెచ్యూరీటి సమయానికి వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. మెచ్యూరిటీ నాటికి పెట్టుబడిదారు ఆదాయపు పన్ను శ్లాబు ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ నికర రాబడి (పన్ను తర్వాత రాబడి) ఉంటుంది.

ఉదాహరణ :  ఒక వ్యక్తి 8.5 శాతం వడ్డీ చెల్లించే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టి, అతని ఆదాయపు పన్ను 30.9 శాతం అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా అతని నికర రాబడి 5.87 శాతం మాత్రమే ఉంటుంది.

రాబడి నుంచి ద్రవ్యోల్బణం, ఆదాయ పన్నుపోగా నికరంగా వచ్చే ఆదాయం తెలుసుకోండి

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly