ఎన్‌.ఆర్‌.ఐల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కొన్నే..

ప్ర‌వాస భార‌తీయుల‌కు చాలా ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వ‌ర్తించ‌వు. వ‌ర్తించినా కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్‌.ఆర్‌.ఐల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కొన్నే..

ఆదాయ‌పు ప‌న్ను చట్టం ప్రకారం స్థానికులు, ప్ర‌వాస భార‌తీయులు వేర్వేరుగా పరిగణించ బడతారు. ప‌న్ను చెల్లింపుదార్ల‌లో రెసిడెంట్లుగా ఉంటే ఎటువంటి ప‌న్ను ప్ర‌యోజ‌నాలు అందుకుంటారో, నాన్ రెసిడెంట్ల‌కు ఏ ప‌న్ను ప్ర‌యోజ‌నాలు అంద‌వో చూద్దాం.

భార‌త్‌తో బ్యాంకింగ్‌, పెట్టుబ‌డులు చేసే ఎన్‌.ఆర్‌.ఐల‌ను ప‌న్ను చెల్లింపుల నిమిత్తం వేరుగా ప‌రిగ‌ణిస్తారు. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎంత కాలంపాటు స్థానికంగా నివాసులై ఉన్నార‌న్న దాన్ని బ‌ట్టే ఆ వ్య‌క్తి ఎన్‌.ఆర్‌.ఐ అవునో కాదా ఆదాయ‌పు ప‌న్ను శాఖవారు తేలుస్తారు.

ప్రాథ‌మిక మిన‌హాయింపు ప‌రిమితిః

 • మ‌న‌దేశంలో ఆర్జించేవారు ఎవ‌రైనా స‌రే వారి ఆదాయం… ప‌న్ను ప‌రిమితికి మించి ఉంటే వారు ట్యాక్స్ క‌ట్టాల్సిందే.
 • ప్ర‌స్తుతం ఏడాదికి ఈ క‌నీస ప‌రిమితి రూ.2.5ల‌క్ష‌లుగా నిర్ణ‌యించారు. మార్చి 31తో 60ఏళ్లు నిండిన స్థానికుల‌కు క‌నీస ప‌న్ను ప‌రిమితి రూ.3ల‌క్ష‌లు. అదే 80 ఏళ్లు దాటిన‌వారికి రూ.5ల‌క్ష‌ల ప్రాథ‌మిక ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిని ఉంచారు.
 • ఈ క‌నీస ఆదాయాన్ని దాటితే సంబంధిత శ్లాబ్‌లను వ‌ర్తింప‌జేసి దాని ప్ర‌కారం ప‌న్ను వ‌సూలు చేస్తారు.
 • 60 ఏళ్లు లేదా 80ఏళ్లు దాటిన భార‌తీయ రెసిడెంట్ల‌కు మాత్ర‌మే ప్రాథ‌మిక ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిలో స‌డ‌లింపు ఉంది.
 • నాన్ రెసిడెంట్లు వారి వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రికీ ప్రాథ‌మిక ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధి రూ.2.5ల‌క్ష‌లే కావ‌డం గ‌మ‌నార్హం.
 • భార‌త పౌర‌స‌త్వం క‌లిగి ఉన్నా స‌రే … గ‌డ‌చిన ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ దేశంలో ఎంత కాలం ఉన్నారో అన్న దానిపైనే స్థానిక‌త ఆధార‌ప‌డి ఉంటుంది. అదే వ్యక్తి ప్రాథ‌మిక ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిని నిర్ణ‌యిస్తుంది.
 • భార‌త పౌర‌స‌త్వం క‌లిగి 80ఏళ్లు దాటిన వారైనా … ఆదాయ‌పు ప‌న్ను శాఖ చ‌ట్టాల ప్ర‌కారం నాన్ రెసిడెంట్లుగా గుర్తింపు పొందితే… వారికి వ‌ర్తించేది రూ.2.5ల‌క్షల‌ ప్రాథ‌మిక ప‌న్ను మిన‌హాయింపు మాత్ర‌మే అని గుర్తుంచుకోవాలి.

సెక్ష‌న్ 87 ఏ రిబేట్‌

 • భార‌తీయ ప‌న్ను చ‌ట్టాలు రూ.3.5ల‌క్ష‌ల‌కు మించి ఆదాయం అందుకోని వారికి నిక‌ర ప‌న్ను చెల్లింపులో రూ.2,500 రిబేటు రూపంలో వాప‌సు ఇస్తుంది.
 • ఎన్‌.ఆర్‌.ఐ గా ఉన్న‌వారు త‌మ ఆదాయం రూ.3.5ల‌క్ష‌ల లోపు ఉండి రిబేటు అందుకునే అర్హ‌త ఉన్నా… నాన్ రెసిడెంట్ అన్న ఒక్క‌కార‌ణంతో వారికి ఈ రిబేట్ వ‌ర్తించ‌దు.

స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న లాభాల‌పై

 • ఈక్విటీ షేర్ల అమ్మ‌కం ద్వారా, లేదా భార‌త్‌కు చెందిన మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల్లో ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్ల‌ను విక్ర‌యించినా లేదా ఏదైనా వ్యాపార ట్ర‌స్టుకు సంబంధించిన యూనిట్ల‌ను అమ్మినా ఫ్లాట్ 15 % ప‌న్ను చెల్లించాల్సిందే. ఈక్విటీ షేర్ల‌ను భార‌తీయ స్టాక్ ఎక్స్ఛేంజీల వేదిక‌గా విక్ర‌యించాలి. ఈ లావాదేవీల‌న్నింటిపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్ (ఎస్‌టీటీ)ని విధిస్తారు.

 • రెసిడెంట్ ప‌న్ను చెల్లింపుదార్ల‌కు ఓ మంచి అవ‌కాశం ఉంది. ఆర్జించేవారు త‌మ ఆదాయం ప్రాథ‌మిక ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితికి (రూ.2.5ల‌క్ష‌లు) త‌గినంత లేకుండా ఉన్న‌ట్ట‌యితే ఈ లోటును వారు స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న లాభాల ద్వారా భ‌ర్తీ చేసుకోవ‌చ్చు.

 • అదెలాగో ఉదాహ‌ర‌ణ ద్వారా చూద్దాం… మీరు రెసిడెంట్ అయి ఉండి ఈక్విటీ షేర్ల‌ను అమ్మ‌డం ద్వారా స్వ‌ల్ప కాల మూల‌ధ‌న లాభం రూ.10ల‌క్ష‌లు పొందార‌నుకుందాం. ఇత‌ర ఆదాయ మార్గాలు సైతం మీకు ఉన్నాయ‌నుకుందాం. దీంట్లో భాగంగా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై రూ.50వేల వ‌డ్డీ జ‌మ అవుతోంది. మీరు ప‌న్ను చెల్లించేట‌ప్పుడు మొద‌ట రూ.50వేల‌ను ప్రాథ‌మిక మిన‌హాయింపు ప‌రిమితి(రూ.2.5ల‌క్ష‌లు) కిందికి తీసుకుంటారు. లెక్క‌ల ప్ర‌కారం రూ.2ల‌క్ష‌లు ఉంటాయి. స్వ‌ల్ప‌కాల లాభాల్లో వ‌చ్చిన రూ.10 ల‌క్ష‌ల్లో … రూ.2ల‌క్ష‌ల‌ను ఈ ప్రాథ‌మిక ప‌న్ను మిన‌హాయింపు కిందికి వ‌ర్తింప‌జేయ‌వ‌చ్చు. దీన్నే ట్యాక్సేష‌న్ ప‌రిభాష‌లో సెట్టింగ్ ఆఫ్ ద గ్యాప్ అని అంటారు. ఇప్పుడు మీరు మిగ‌తా రూ.8ల‌క్ష‌ల‌కు మాత్ర‌మే ప‌న్ను చెల్లిస్తే స‌రిపోతుంది.

 • అసంతృప్తి క‌లిగించే విష‌య‌మేమిటంటే ఎన్‌.ఆర్‌.ఐల‌కు పైన పేర్కొన్న‌ ప్ర‌యోజ‌నం వ‌ర్తించ‌దు. సెక్ష‌న్ 11ఏ ఈ నిబంధ‌న‌ను ఎన్‌.ఆర్‌.ఐల‌కు వ‌ర్తించ‌నీయ‌కుండా చేస్తోంది.

మీరు ప్ర‌వాస భార‌తీయులైనా, లేదా త్వ‌ర‌లో ఎన్‌.ఆర్‌.ఐగా మార‌నున్న నేప‌థ్యంలో ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వ‌ర్తించ‌ని అంశాల‌పై కొంత అవ‌గాహ‌న కలిగి ఉండడం ఉపయోగకరం.

Author:

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS of Bombay Oxygen Corporation Limited.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly