స‌మాచార బ‌దిలీ కోసం ఆదాయ ప‌న్ను శాఖ వెబ్ పోర్ట‌ల్‌

సిబిడిటి జారీ చేసిన పాలసీ, టెక్నికల్ సర్క్యులార్‌లు, మార్గదర్శకాలు, నోటిఫికేషన్లతో పాటు సంబంధిత స‌మాచారాన్ని ఈ పోర్ట‌ల్ అందిస్తుంది

స‌మాచార బ‌దిలీ కోసం ఆదాయ ప‌న్ను శాఖ వెబ్ పోర్ట‌ల్‌

సాధారణ విభాగం రిపోర్టింగ్ ప్రమాణం ప్రకారం స్వయంచాలకంగా సమాచార మార్పిడికి సంబంధించిన విధానాల గురించి సమాచారాన్ని అందించే ఒక పోర్టల్‌ను పన్ను శాఖ ప్రారంభించింది. కేంద్ర ప్ర‌త్యక్ష ప‌న్నుల బోర్డు (సీబీడీటి) ఛైర్మెన్ పి.సి మోడీ ఆదాయ ప‌న్ను వెబ్‌సైట్‌లో వెబ్ పోర్ట‌ల్‌ను ప్రారంభించారు.

AEOI పై కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (CRS) కింద 2017 నుంచి ఆర్థిక సమాచారాన్ని స్వయంచాలకంగా మార్పిడి చేయడానికి భారత్ కట్టుబడి ప‌నిచేస్తుంద‌ని సిబిడిటి ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి సంవత్సరం ఆర్థిక సంస్థల ద్వారా భార‌త‌ ప్రమాణాల ప్రకారం సమాచారం అందిస్తారు.

వెబ్ పోర్టల్ సిబిడిటి జారీ చేసిన పాలసీ, టెక్నికల్ సర్క్యులార్‌లు, మార్గదర్శకాలు, నోటిఫికేషన్లతో పాటు సంబంధిత అధికారులు, రెగ్యులేటరీ అధికారులు, ఇతర అంతర్జాతీయ సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు సంబంధిత స‌మాచారాన్ని వెబ్ పోర్ట‌ల్‌ అందిస్తుంది.

“ఈ పోర్టల్ దేశీయ ఆర్థిక సంస్థలకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా, విదేశీ పన్ను అధికారులు, ఆర్థిక సంస్థలకు సిఆర్ఎస్ క్రింద AEOI కి సంబంధించిన భారత చట్టాలు, నియమాలు, విధానాల గురించి సమాచారం పొందడానికి సహాయపడుతుంది” అని తెలిపింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly