జీఎస్‌టీ వార్షిక రిట‌ర్నుల ఫైలింగ్‌ గడువు పెంపు

స‌వ‌రించిన గ‌డువు తేదీల‌కు అనుగుణంగా రీకాన్షిలేష‌న్ స్టేట్‌మెంట్‌(జీఎస్‌టీఆర్‌-9సీ) స‌మ‌ర్ప‌ణ గ‌డువు తేదీని కూడా ప్ర‌భుత్వం మార్చింది

జీఎస్‌టీ వార్షిక రిట‌ర్నుల ఫైలింగ్‌ గడువు పెంపు

వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) వార్షిక రిట‌ర్నులు, ఆడిట్ నివేదిక‌ల‌ను దాఖ‌లు చేసేందుకు గ‌డువు తేదీని ప్ర‌భుత్వం పొడిగించింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రానికి రిట‌ర్నుల దాఖ‌లు గ‌డువును డిసెంబ‌రు 31 వ‌ర‌కు పెంచింది. ఇంత‌కు ముందు ఇది న‌వంబ‌రు 30 వ‌ర‌కు మాత్ర‌మే ఉండేది. అదేవిధంగా 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం రిటర్నులు ఫైల్ చేసేందుకు మార్చి 31,2020 వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించింది. ఇంత‌కు ముందు ఇది డిసెంబ‌రు 31,2019 వ‌ర‌కు మాత్ర‌మే ఉండేది. అంతేకాకుండా రిట‌ర్నుల‌ను ఫైల్లింగ్‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు ఫార‌మ్‌ల‌ను స‌ర‌ళీకృతం చేస్తున్న‌ట్లు తెలిపింది.

స‌వ‌రించిన గ‌డువు తేదీల‌కు అనుగుణంగా రీకాన్షిలేష‌న్ స్టేట్‌మెంట్‌(జీఎస్‌టీఆర్‌-9సీ) స‌మ‌ర్ప‌ణ గ‌డువు తేదీని కూడా ప్ర‌భుత్వం మార్చింది. అదేవిధంగా వార్షిక రిట‌ర్నులు, రీకాన్షిలేష‌న్ స్టేట్‌మెంట్ ఫార‌మ్‌ల స‌ర‌ళీక‌ర‌ణ‌కు కూడా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీబీఐసీ వెల్ల‌డించింది.

జీఎస్‌టీ ఫైల్లింగ్ తీసుకొచ్చిన మార్పులు గ‌డువు పొడిగింపుతో జీఎస్‌టీ ప‌న్ను చెల్లింపుదారులంద‌రూ 2017-18, 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు సంబందించి, త‌మ వార్షిక రిట‌ర్నుల‌తో పాటు రీకాన్షిలేష‌న్ స్టేట్‌మెంట్ ఫార‌మ్‌లను కూడా స‌రైన స‌మ‌యంలో దాఖ‌లు చేస్తార‌ని సీబీఐసీ ఆశిస్తోంది. రిట‌ర్నుల ఫైల్లింగ్‌లో ప‌న్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను దృష్టిలో ఉంచుకుని గ‌డువు తేదీని పొడిగించిన‌ట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly