ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై ఎంత ప‌న్ను చెల్లించాలి?

పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్ ఫండ్ల పెట్టుబ‌డులు కూడా ఉంటే రిస్క్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది

ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై ఎంత ప‌న్ను చెల్లించాలి?

పెట్టుబ‌డుల్లో వివిధ ర‌కాలు ఉన్న‌ప్ప‌టికీ ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై అధిక రాబ‌డి వ‌స్తుంద‌నేది నిజం. అందుకే పెట్టుబ‌డుదారుల పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగం ఈక్విటీల‌కు కేటాయిస్తారు. ఈక్విటీ పెట్టుబ‌డుల్లో రిస్క్ ఉన్న‌ప్ప‌టికీ, దీర్ఘ‌కాలంగా కొన‌సాగిస్తే రిస్క్‌ను అధిగ‌మించ‌వ‌చ్చు.

మార్కెట్‌లో చాలా ర‌కాల ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డి ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఒకే రకంగా ఉండ‌వు. కానీ అన్నింటిలో రిస్క్ మాత్రం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు బీమా హామీని అందించ‌వు. కానీ, యులిప్ ప్లాన్‌లో పెట్టుబ‌డుల‌తో పాటు బీమా హామీ ల‌భిస్తుంది. దీంతో పాటు ఈక్విటీల‌కు వ‌ర్తించే ప‌న్నులు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు క్యాపిట‌ల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత కాలం పెట్టుబ‌డులు కొన‌సాగించారో దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. స్టాక్స్‌, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఏడాది కంటే ఎక్కువ‌కాలం కొన‌సాగితే దీర్ఘ‌కాలికంగా ప‌రిగ‌ణిస్తారు, కానీ యులిప్స్‌కి ఇది వ‌ర్తించ‌దు.

ప‌థ‌కాల‌పై వ‌చ్చే రాబ‌డి ప‌న్నుల రూపంలో త‌గ్గుతుంది. వేర్వేరు ఈక్విటీ ప‌థ‌కాలకు వేర్వేరు ప‌న్నులు వ‌ర్తిస్తాయి. పెట్టుబ‌డులు పెట్టేముందు ప‌న్నుల‌ను గురించి తెలుసుకొని ఏది స‌రిపోతుందో దానిని ఎంచుకోవ‌డం మంచిది.

ఈక్విటీల‌పై వ‌ర్తించే ప‌న్నుల‌ను ప‌రిశీలిస్తే…

TAX.png

Source: Livemint

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly