ఈ వారం మార్కెట్ల ప‌రుగు కొన‌సాగేనా?

ప్ర‌స్తుతం ఉన్న బుల్ ప‌రుగు ఈ వారం కూడా కొన‌సాగుతుందా? లేదా?

ఈ వారం మార్కెట్ల ప‌రుగు కొన‌సాగేనా?

గ‌త వారం నిఫ్టీ సూచీ 10,572 వ‌ద్ద ప్రారంభంమై శుక్ర‌వారం10,692 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ సూచీ 120 పాయింట్లు లాభ‌ప‌డింది.బుల్ ట్రేడ‌ర్లు ఊహించ‌ని రీతిలో పుంజుకున్నారు. మార్కెట్లో ఉన్న బేర్ ట్రేడ‌ర్ల‌కు అవ‌కాశం చాలా త‌క్కువ‌గానే ఇచ్చారు. పెరిగిన‌ ముడిచ‌మురు ధ‌ర‌ల ప్ర‌భావం, యూఎస్ బాండ్ల ఈల్డు, సిరియాలో ఉద్రిక్త‌త లాంటి ఇత‌ర అంత‌ర్జాతీయ ప‌రిణామాలు మ‌న మార్కెట్ పై అంత ప్ర‌భావం చూప‌లేద‌ని చెప్ప‌వ‌చ్చు.

ta28ap01.png

యాక్సిస్ బ్యాంకు సీఈఓ శిఖా శ‌ర్మ ప‌ద‌వీబాధ్య‌త‌ల‌ నుంచి త‌ప్పుకోవాల‌నే నిర్ణ‌యం, ఆ బ్యాంకు కు రూ.13,900 కోట్ల కార్పోరేట్ రుణాలు ఉండ‌టం త‌దిత‌ర ప‌రిణామాల కార‌ణంగా షేరు ధ‌ర ఆరోజు 8.5 శాతం కోల్పోవ‌డం. వార్త‌ల ఆధారంగా షేరు ధ‌ర కుప్ప‌కూలడానికి ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఇండియ‌న్ బ్యాంకుల ప‌నితీరు సూచీ పై ప్ర‌భావం చూపుతుంద‌ని అంచ‌నా వేస్తున్నాం. నిఫ్టీ సూచీ 10,645 స్థాయిని దాట‌డం మంచి ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. ఈ స్థాయిలోనే మార్కెట్ గ‌తంలో అధిగ‌మించేందుకు చాలా శ్ర‌మించింది. రోజువారీ నిఫ్టీ చార్టుల‌ను ప‌రిశీలిస్తే 10,529 -10,645 స్థాయిల మ‌ధ్య ట్రేడింగ్ జ‌రుతోంది. ఫిబ‌నోయిక్ కాన్ఫులియ‌న్స్ఎగువ‌-దిగువ స్థాయిల మ‌ధ్య ట్రేడింగ్ ప‌రిధి ఉండ‌టం మూలంగా మ‌రింత బ‌లం చేకూర్చే అంశంగా చెప్పాలి.

ఫిబ‌నోయిక్ కాన్ఫులియ‌న్స్ జోన్లు గ‌రిష్ట‌స్థాయిల‌ నుంచి రావ‌డం మార్కెట్లు మ‌రింత విస్తృతంగా ముందుకెళ్లే అవ‌కాశం ఉంటుంది. నిఫ్టీ సూచీ 9,960 నుంచి తిరుగులేని విధంగా పెరుగుతుండ‌టం మార్కెట్ల‌కు బ‌లంచేకూర్చేదే. శుక్రవారం మార్కెట్లు ప్రారంభ‌మైన స్థాయిని చూస్తే గ‌త ట్రేడింగ్ సెష‌న్ ముగింపు ధ‌ర‌ కంటే ఎక్కువ స్థాయిలో ఉండ‌టం మార్కెట్లు ఈ వారం జోరు కొన‌సాగిస్తాయ‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తుంది. త‌దుప‌రి నిరోధ స్థాయి 10,760 వ‌ద్ద‌, 10,930 వ‌ద్ద ఎదుర‌య్యే అవ‌కాశం ఉండొచ్చ‌ని అంచ‌నా.

ta28ap.png

బ్యాంక్ నిఫ్టీ ఫిబ‌నోయిక్ కాన్ఫులియ‌న్స్ జోన్ ఏప్రిల్ 18 నాటికి 25,409 గా ఉంది. అయితే త‌రువాత ఇది 24,745 పాయింట్ల‌కు చేరింది. ఈ స్థాయిలో త‌గ్గ‌డం మార్కెట్లో పెట్టుబ‌డులు చేసేందుకు స‌రైన స‌మ‌యంగా చెప్ప‌వ‌చ్చు. బ్యాంక్ నిష్టీ సూచీ 650 పాయింట్లు రెండు ట్రేడింగ్ దినాల్లో కోల్పోవ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే నిఫ్టీ సూచీ అత్యంత ప‌టిష్ట‌మైన నిరోధ‌స్థాయి 10,650 ని ఛేదించ‌డం క‌లిసొచ్చే అంశం. బ్యాంక్ నిఫ్టీ 25,800 పాయింట్ల‌కు చేరే అవ‌కాశం ఉంది. వారాంత‌ చార్టులోని కేఎస్ లైన్ ఇండికేట‌ర్ ప్ర‌కారం త‌దుప‌రి బ్యాంక్ నిఫ్టీ నిరోధ స్థాయి 25,680 గా అంచ‌నా వేస్తున్నాం.

మార్కెట్ స‌మీక్ష అందించిన‌వారు

చీఫ్ టెక్నిక‌ల్ అన‌లిస్ట్‌, ట్రైన‌ర్‌
రాజా వెంక‌ట‌రామ‌న్‌

ADVISE.png

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly