చ‌మురు.. డాల‌రూ.. ఈ వారం మార్కెట్లు

ఈ వారం మార్కెట్లు ఏవిధంగా ఉండ‌బోతున్నాయి అనే అంశంపై టెక్నిక‌ల్ విశ్లేష‌ణ నివేదిక తెలిపిన కొన్ని విష‌యాలు

చ‌మురు.. డాల‌రూ.. ఈ వారం మార్కెట్లు

ఇటు దేశీయంగా అటు అంత‌ర్జాతీయంగా చెప్పుకోద‌గిన ప‌రిణామాలు ఏర్ప‌డ‌క‌పోవ‌డంతో మార్కెట్లు కొంత క‌రెక్ష‌న్ అవుతున్నాయి. కొంత వ‌ర‌కూ ఈ క‌రెక్ష‌న్ అవ‌స‌ర‌మ‌నే చెప్పాలి. ఈ వారం మార్కెట్లో ట్రెండ్ వెన‌క్కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు షేర్ల ధ‌ర‌లు త‌క్కువ‌కు చేరిన‌పుడు కొని పెట్టుకోవ‌డం మంచిది. అయితే రానున్న వారంలో చాలా సంస్థ‌ల‌కు చెందిన ఆర్థిక ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేకంగా షేర్లు ఆయా ఫ‌లితాల‌ ఆధారంగా క‌ద‌లాడే అవ‌కాశం ఉంటుంది. అస్థిర‌త కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

ఎఫ్ఎమ్‌సీజీ షేర్లు ఈ వారానికి రాణించే అవ‌కాశం క‌నిపిస్తోంది.మ‌రో వైపు ఫార్మా రంగానికి చెందిన షేర్లు గ‌త వారంలో త‌గ్గుతూ వ‌చ్చాయి. చ‌మురు ధ‌ర‌లు , రూపాయి డాల‌ర్ మ‌ధ్య విలువ‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది. గ‌త వారంలో మార్కెట్ కాస్త ఉత్సాహంగా ప్రారంభం అయింది కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే. మంగ‌ళ‌వారం నాడు జోరుగా సాగిన‌ మార్కెట్లు 11,000 పాయింట్ల స్థాయికి చేరుతాయ‌ని అనుకునే స‌మ‌యంలో మ‌దుప‌ర్లు క్ర‌మంగా షేర్ల విక్ర‌యాలు ప్రారంభించారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న క‌న్న‌డ రాజ‌కీయ‌ ప‌రిణామాల నేప‌థ్యంలో లాంగ్ పొజిష‌న్లు విక్ర‌యాలు చేశారు. దీంతో విక్ర‌యాల వ‌త్తిడి పెరిగి మార్కెట్ కింద‌కు రావ‌డం ప్రారంభించింది. షేర్ల విక్ర‌యాల ప‌రంగా ఈ మ‌ధ్య కాలంలో ఇదే అధిక‌మ‌ని చెప్పాలి. దీంతో రోజువారీ చార్టుల‌లో షూటింగ్ స్టార్ ప్యాట్ర‌న్ ఏర్ప‌డింద‌ని చెప్పాలి. మార్కెట్లు ప్రారంభమైన త‌రువాత త‌క్కువ స్థాయిలోకి వెళ్లడం జ‌రిగింది. గ‌త వారం ఇదే జ‌రిగింది. బేర్ లు ఆ వారం చివ‌రి రోజు వ‌ర‌కూ మంచి జోరును ప్ర‌ద‌ర్శించారు.నిఫ్టీ మునుప‌టి గ‌రిష్ట స్థాయి నుంచి దాదాపు 300 పాయింట్లు న‌ష్ట‌పోయింది. దీని ప్ర‌భావం 78.6 శాతం రీట్రేస్‌మెంట్ స్థాయిల‌ను వారాంత‌పు చార్టుల్లో ప్ర‌ద‌ర్శించింది. ఈ వారం కూడా మార్కెట్లు కింద‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.
tama19.png

బ్యాంక్ నిఫ్టీ

గ‌త‌వారం బ్యాంక్ నిఫ్టీ సూచీ కూడా దాదాపు 1000 పాయింట్ల‌ను న‌ష్ట‌పోయింది. 27000 పాయింట్ల స్థాయికి చేరి కింద‌కు ప‌డింది. నిఫ్టీ సూచీ లానే ఇది కూడా కింద‌కు చేరింది. ఇక్క‌డ కూడా బేర్ ల‌కు అనుకూలించే క్యాండిల్ ప్యాట్ర‌న్ ఏర్ప‌డింది. కాక‌పోతే నిఫ్టీ 50 సూచీ కంటే కొంత మెరుగ్గా బ్యాంక్ నిఫ్టీ ఏర్ప‌డింది. ప్రైవేట్ బ్యాంకుల షేర్లు కొంత అనుకూలంగానే ట్రేడ్ అవుతుండ‌టం ఈ సూచీకి క‌లిసొచ్చే అంశం. అయితే లాంగ్ పొజిష‌న్లు తీసుకోవాల‌నుకునే వారు కొంచెం జాగ్ర‌త్త‌గా షేర్ల‌ను ఎంపిక‌చేసుకోవాలి.

నిఫ్టీ ఐటీ

నిఫ్టీ ఐటీ సూచీ క్ర‌మంగా బ్రేక్ అవుట్ స్థాయిని స‌పోర్టుగా చేసుకునేందుకు వీలుంటుంది. బుల్లిష్ క్యాండిల్ త‌క్కువ స్థాయిలో ఉంది. అయితే మొమెంట‌మ్ ఇండికేట‌ర్ల అంత‌గా బ‌లంగా లేవ‌నే చెప్పాలి. షేర్ల ధ‌ర‌లు త‌గ్గే విష‌యంలో మొమెంట‌మ్ ఇండికేట‌ర్లు అంత ప్ర‌భావం చూపవ‌నే చెప్ప‌వ‌చ్చు. దీని ప్ర‌కారం చూస్తే ప్రారంభంలో సూచీ కొంత మెరుగ్గా రాణించేందుకు అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి

tama02.png

ముడిచ‌మురు బ్యారెల్ $ 80

స్థూల ఆర్థిక ప‌రిస్థితి అంత అనుకూలంగా లేదు. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు బ్యారెల్ 80 డాల‌ర్ల‌కు చేర‌డం, రూపాయి మార‌క విలువ‌ బ‌ల‌హీన‌ప‌డ‌టం చూస్తే అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌వ‌నాలు వీచే అవ‌కాశం లేదు. షేర్ల‌ను ఎంపిక చేసుకోవ‌డంలో మ‌దుప‌ర్ల‌కు కాస్త ఇబ్బంది వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో షేర్ల ఎంపిక‌ సుల‌భం కాదు దీనికి తోడుగా లాభాల స్థాయి కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. కాబ‌ట్టి ఈ వారం మ‌దుప‌ర్లు మార్కెట్లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

మార్కెట్ స‌మీక్ష అందించిన‌వారు

చీఫ్ టెక్నిక‌ల్ అన‌లిస్ట్‌, ట్రైన‌ర్‌
రాజా వెంక‌ట‌రామ‌న్‌

ADVISE.png

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly