ఈ వారం మార్కెట్లు ఎగ‌రావచ్చా?

ప్ర‌ధాన ట్రెండ్ లైన్ బ‌లంగానే ఉండ‌టంతో మార్కెట్లు సానుకూల ధృక్ప‌థంతో ముందుకెళ్లొచ్చా?

ఈ వారం మార్కెట్లు ఎగ‌రావచ్చా?

గ‌త వారం తొలి రోజు 10,160పాయింట్ల వ‌ద్ద ప్రారంభ‌మైన నిఫ్టీ శుక్ర‌వారం 10,331 వ‌ద్ద ముగిసింది. వారంలో నిఫ్టీ 171 పాయింట్లు లాభ‌ప‌డింది.

ఈ వారం స‌మీక్ష‌

గ‌త వారం మార్కెట్లో ఆధ్యంతం అస్థిర‌త కొన‌సాగింది. మొత్తంగా చూస్తే మార్కెట్లు కొంత పుంజుకున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. అంత‌ర్జాతీయంగా ఏర్ప‌డిన ప‌రిణామాలు దీనికి బ‌లాన్ని చేకూర్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం మార్కెట్లో కొంత జాగ్ర‌త్త‌గా ఉంటూనే ట్రెండ్లైన్ అనుస‌రిస్తూ ముందుకెళ్లే వ్యూహాన్ని కొన‌సాగించ‌డం మంచిది. దీనికి కొంత స‌మ‌న్వ‌యం పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. ట్రేడింగ్ చేయాలా ?మ‌దుపు చేయాలా? అనేవిష‌యం పై మ‌దుప‌ర్ల‌కు స్ప‌ష్ట‌త ఉండాలి. మార్కెట్లో అస్థిత‌రత ఉన్నా ప్ర‌ధాన ట్రెండ్ లైన్ ఇప్ప‌టికీ బ‌లంగానే ఉండ‌టంతో మార్కెట్లలో సానుకూల ధృక్ప‌థంతోనే ముందుకెళ్ల‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నాం. కొన్ని షేర్ల‌ను ఎంపిక చేసుకుని వాటిని కొన‌సాగించ‌డం మంచిది.

వారంత‌ నిఫ్టీ చార్టు

ap07ta.png

ప్ర‌స్తుతం త‌గ్గిన మిడ్ స్మాల్ క్యాప్ షేర్లు ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. గ‌తంలో అవ‌కాశాన్ని కోల్పోయిన వారు ఈ త‌రుణంలో మిడ్ స్మాల్ క్యాప్ షేర్ల‌లో పెట్టుబ‌డి చేసేందుకు మంచి అవ‌కాశం. మార్చి నెల మ్యూచువ‌ల్ ఫండ్ల నివేదిక ప్ర‌కారం చూస్తే కొంత మార్కెట్ సెంటిమెంట్ దెబ్బ‌తినింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు, ప్ర‌స్తుత త్రైమాసికంలో ఫండ్ పెట్టుబ‌డులు దేశీయంగా ఉన్న సంస్థ‌ల‌నుంచి నేరుగా మార్కెట్లోకి పెట్టుబ‌డులుగా వెళ్ల‌డం కూడా దీనికి కార‌ణం అయిండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. నిధులు ప్ర‌వాహాం చాలా కీల‌క‌మైన‌ది. ఇందులో ఎలాంటి త‌గ్గుద‌ల క‌నిపించినా బుల్ అంచ‌నాలు అట‌కెక్కే అవ‌కాశ‌మూ ఉంది.

వారం కాల‌వ్య‌వ‌ధి చార్టుల‌ను గ‌మ‌నిస్తే నిఫ్టీ,బ్యాంకు నిఫ్టీ రెండూ బ‌లంగానే క‌నిపిస్తున్నాయి.బ్యాంక్ నిష్టీ వారంత చార్టుల‌ను ప‌రిశీలిస్తే క్యాండిల్ స్టిక్ బ‌లంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు రిక‌వ‌రీ అవ‌టం మ‌నం చూడొచ్చు. వీటి క్యాండిల్ స్టిక్ కూడా పాజిటివ్ గా ఉండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు. రానున్న వారంలో నిఫ్టీ 10,450-10,475 స్థాయిల వద్ద ట్రేడ‌య్యేందుకు అవ‌కాశాలు ఉన్నాయి.

రోజువారీ బ్యాంకు నిఫ్టీ చార్టు

ap07ta01.png

బ్యాంక్ నిఫ్టీ సూచీని గ‌మ‌నించిన‌ట్ట‌యితే గ‌త రెండు నెల‌లు గా సూచీ క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డి కొంత సానుకూలంగా ఉండే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. గ‌త ఫిబ్ర‌వ‌రి నెల నుంచి ఈ రంగ షేర్లు ధ‌ర‌లు త‌గ్గుతూ అయితే ఈ షేర్లు పైకి రావాలంటే ఇంకా కొన్ని స‌వాళ్ల‌ను అధిగ‌మించాల్సి ఉంది. రిజ‌ర్వు బ్యాంకు పాల‌సీ నిర్ణ‌యంతో ఈ రంగం కొంత మేర‌కు తేరుకుంద‌ని చెప్పాలి.బ్యాంకు నిఫ్టీ గ్రాఫులో చాన‌ల్ ను గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ చాన‌ల్ స్థా యిని మించి వెళ్తే మ‌రో 1,000 పాయింట్లు పైకి వెళ్లే అవ‌కాశాలు లేక‌పోలేదు. అప్పుడు బ్యాంకు నిఫ్టీ టార్గెట్ వ‌చ్చే వారానికి 25,500 గా ఉంటుంది. ఈ రంగం పుంజుకుంటే దీనికి అనుబంధంగా ఉన్న ఆటో, రియాల్టీ, ఫైనాన్స్ సెక్టార్ల‌కు చెందిన షేర్లు లాభ‌ప‌డేందుకు అవ‌కాశాలు ఉన్నాయి.

మార్కెట్లో ప్ర‌స్తుతం వెలువ‌డే వార్త‌లు ఆధారంగానే ట్రెండ్ క‌ద‌లిక‌లు ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఏప్రిల్ సిరీస్ కాంట్రాక్టులు ప్రారంభం, దేశీయ ప‌రిణామాలు, స్థూల ఆర్థిక గ‌ణాంకాలు త్వ‌ర‌లో విడుద‌ల కానుండ‌టం త‌దిత‌ర అంశాలు ముందు ఉన్నాయి. ప్ర‌స్తుతం మార్కెట్లో నెల‌కొన్న అస్థిత‌ర‌త . అంచ‌నా వేసుకునే మ‌దుప‌ర్లు, ట్రేడ‌ర్లు నిర్ణ‌యాలు తీసుకోవాలి. రిస్క్ నిర్వ‌హాణ క‌చ్చితంగా చేసుకోవాలి. మార్కెట్లో లాభాలు తీసుకునే ఉద్దేశంతో మ‌దుప‌ర్లు పాల్గొనాలి.

డిస్‌క్లెయిమ‌ర్‌

ఈ మార్కెట్ స‌మీక్ష కేవ‌లం ఈనాడు సిరి పాఠకుల స‌మాచారానికి ఉద్దేశించింది. ఎలాంటి పెట్టుబ‌డి స‌ల‌హాను దీని ద్వారా ఇవ్వ‌డం లేదన్న సంగ‌తి గుర్తించాలి. ఈ స‌మాచారాన్ని ఆధారం చేసుకొని ఎలాంటి చ‌ర్య తీసుకున్నా పూర్తి బాధ్య‌త మీదే. ఈనాడు సిరి లేదా దానికి సంబంధిత సంస్థ‌లు లేదా ఉద్యోగులు ఏ ర‌కంగాను దీనికి బాధ్యులు కార‌ని మ‌నవిచేస్తున్నాం.

మార్కెట్ స‌మీక్ష అందించిన‌వారు

చీఫ్ టెక్నిక‌ల్ అన‌లిస్ట్‌, ట్రైన‌ర్‌
రాజా వెంక‌ట‌రామ‌న్‌

ADVISE.png

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly