చిన్నమ‌దుప‌రి తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు

న‌ష్ట‌భ‌యాన్ని అంచ‌నా వేసేందుకు వివిధ సంస్థ‌లు రిస్క్ ప్రొఫైల‌ర్ ల‌ను త‌మ మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉంచుతాయి.

చిన్నమ‌దుప‌రి తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు
  1. మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి ఎప్పుడూ ల‌క్ష్యం ఆధారంగా చేయాలి. దీర్ఘకాల‌మైతే ఒక ఇల్లు కొనుగోలు చేయ‌డం, స్వ‌ల్ప‌కాల‌మైతే ఏవైనా గృహోప‌క‌ర‌ణాలు కొనుగోలు లాంటి వాటిని పెట్టుకోవాలి.
  1. మ‌దుప‌ర్లు ల‌క్ష్యాల‌కు అనువుగా ఉండే పెట్టుబ‌డి సాధ‌నాలు ఎంపిక చేసుకోవ‌డం చాలా ముఖ్యం. పెట్టుబ‌డి సాధ‌నాల ఎంపిక‌లో నష్టపరిమితి విషయంలో కచ్చితమైన అవగాహన ఉండాలి. స్థిరాదాయం వ‌చ్చే వాటిలో ఎంత పెట్టాలి. న‌ష్ట‌భ‌యం ఉండే ఈక్విటీ పెట్టుబ‌డులు ఎంత శాతం ఉండాలి అనేది నిర్ణ‌యించుకోవాలి. దీనిని అంచ‌నా వేసేందుకు వివిధ సంస్థ‌లు రిస్క్ ప్రొఫైల‌ర్ ల‌ను త‌మ మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉంచుతాయి. వీటి ద్వారా మీరు రిస్క్ తీసుకునే త‌త్వాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చు.

  2. పెట్టుబ‌డుల‌పై ఉండే నష్ట‌భ‌యాన్ని త‌గ్గించుకునేందుకు వైవిధ్యం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈక్విటీలు, డెట్‌, స్థిరాస్తి, బంగారం తదితర వాటిల్లో సమతౌల్యంగా మదుపు చేయాలి. మీరు ఎంత రిస్క్ తీసుకోగ‌ల‌రు? ల‌క్ష్యం చేరేందుకు వ్యవధి ఎంత? మీ లక్ష్యాల ఆధారంగా ఏయే పథకాల్లో ఎంత శాతం చొప్పున పెట్టుబడి పెట్టాలనేది నిర్ణయించుకోవాలి.

  1. పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డిని ద్రవ్యోల్బ‌ణం తీసివేస్తే వ‌చ్చే రాబ‌డిని వాస్త‌వ‌రాబ‌డి అంటారు. నికర రాబడి ఎంత వస్తోంది? పన్ను భారం ఎంత ఉంటోంది? పన్నులు పోను 10-12% రాబ‌డి పొందామంటే మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచిన‌ట్టుగా ప‌రిగ‌ణించాలి. అధిక రాబడి ఉన్న చోట అధిక నష్టభయమూ ఉంటుంది. ఎక్కువ శాతం రాబడి ఆశిస్తే చేసే పెట్టుబ‌డులున‌ష్ట‌భ‌యంఎక్కువ‌గా ఉన్న వాటిలో చేయాలి. ముందుగానే ఎంత నష్టం సంభావ్య‌త‌ విషయంలో ఒక అంచనా వేసుకొని, ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి ఎక్కడ వస్తుందో చూసుకొని, ఆ తర్వాతే మదుపు చేయాలి.
  1. మ‌దుప‌ర్లలో కొంద‌రు డబ్బును ఒకే సారి మొత్తంగా మ్యూచువల్‌ ఫండ్లలోకి మళ్లించేవారుంటారు. ఇలా చేసినప్పుడు మార్కెట్‌లో దిద్దుబాటు వస్తే… పెట్టుబడి విలువ హరించుకుపోవచ్చు. ఈక్విటీ ఫండ్లలో ఉన్న డబ్బంతా ఒకేసారి మదుపు చేసే బదులు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఆమొత్తాన్నిలిక్విడ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేసి క్రమానుగత బదిలీ విధానం (ఎస్‌టీపీ) మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి మ‌దుపు చేయాలి. నెల‌వారీ ఆదాయం పొందే వారు సిప్ విధానంలో క్ర‌మంగా మ‌దుపు చేయ‌డం చాలా ఉత్త‌మం.
  1. చాలామంది మదుపు చేస్తుంటారు. కానీ, పెట్టుబడులను ఎప్పుడు వెనక్కి తీసుకోవాలనే విషయంలో మాత్రం అంత అవగాహన ఉండదు. వ్యూహాత్మకంగా అడుగు వేసి, సరైన సమయంలో పెట్టుబడుల నుంచి బయటపడ్డప్పుడే మంచి లాభాలు స్వీకరించగలం.

  2. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం కొన్నేళ్లపాటు మదుపు చేశారనుకుందాం… ఆ లక్ష్యాన్ని చేరేందుకు 2, 3 ఏళ్ల సమయం ఉందనగానే… పెట్టుబడి మొత్తంలో నుంచి నెలకు 2-3శాతం వరకూ వెనక్కి తీసుకొని, సురక్షిత పథకాల్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అనుకోని పరిస్థితుల్లో ఏదైనా దిద్దుబాట్లు వచ్చినా… పెట్టుబడికి, లాభాలకూ అంతగా నష్టం వాటిల్లదు.

  1. చరిత్రను గమనిస్తే మార్కెట్‌ వృద్ధి పథంలో కొనసాగింది. కొన్నిసార్లు పతనం అయ్యింది. ఇవన్నీ మార్కెట్లో సహజమే. పెరుగుతున్నప్పుడు పెట్టుబడులు పెడితే… తగ్గినప్పుడు సహజంగానే వాటి విలువలో క్షీణత కనిపిస్తుంది. దీర్ఘకాలిక మదుపరులు వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆందోళనలను తగ్గించుకునేందుకు క్రమశిక్షణతో… క్రమం తప్పకుండా మదుపు చేస్తూ వెళ్లడమే మార్గం. వారెన్‌ బఫెట్‌ చెప్పినట్లు… మార్కెట్‌లో ప్రవేశించేందుకు సమయం కోసం వేచి చూడకూడదు. అన్ని వేళలా మార్కెట్లో ఉన్నామా లేదా అనేదే ముఖ్యం.

  2. దేశంలో ఏర్ప‌డే ప‌రిణామాల‌ నుంచి అంత‌ర్జాతీయంగా చోటుచేసుకునే ప‌రిణామాల వ‌ర‌కూ దేని ప్ర‌భావ‌మైనా మార్కెట్ల‌పై ప‌డే అవ‌కాశం ఉంటుంది. కాబట్టి, మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులను సమీక్షించుకునే సమయం, అవగాహన లేకపోతే ఆర్థిక సలహాదార్ల సలహాలు స్వీకరించాలి.

10.ఎవరో మదుపు చేశారని చెప్పి, మీరూ ఆయా పథకాలను ఎంచుకోవడం సరికాదు. ముఖ్యంగా ఫోన్‌కు వచ్చే సందేశాలను నమ్మొద్దు. ఒక్కో పెట్టుబడి ఒక్కొక్కరికి నప్పుతుంది. మీకు ఏది సరైనదో అంచావేసుకున్నాకే ఒక నిర్ణ‌యం తీసుకోండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly