త‌క్ష‌ణ వ్య‌క్తిగ‌త రుణం అందించే 10 యాప్‌లు

కాగిత ర‌హితంగా సుల‌భంగా వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందించే యాప్‌లు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

త‌క్ష‌ణ వ్య‌క్తిగ‌త రుణం అందించే 10 యాప్‌లు

మీకు అత్య‌వ‌స‌రంగా రుణం అవ‌స‌ర‌మైతే మొద‌టిగా మీ స్నేహితుల‌ను, బంధువుల ద‌గ్గ‌ర నుంచి రుణం తీసుకునేందుకు చూస్తుంటారు. ఒక‌వేళ పెద్ద మొత్తంలో రుణం కావాల్సి వ‌స్తే వ్య‌క్తిగ‌త రుణం కోసం బ్యాంకును ఆశ్ర‌యిస్తారు. అయితే బ్యాంకులు వ్య‌క్తిగ‌త రుణం మంజూరు చేసేందుకు 2 నుంచి 3 రోజ‌ల స‌మ‌యం తీసుకుంటాయి. అంతేకాకుండా అందుకు కావ‌ల‌సిన ప‌త్రాల‌ను కూడా బ్యాంకుకు స‌మ‌ర్పించ‌వ‌ల‌సి ఉంటుంది. వ్య‌క్తిగ‌త రుణాల‌ను మంజూరు చేసే యాప్‌లు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కాగిత ర‌హిత వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఏలాంటి అవాంత‌రాలు లేకుండా సుల‌భంగా పొంద‌వ‌చ్చు.

త‌క్ష‌ణ వ్య‌క్తిగ‌త రుణ‌స‌దుపాయాలు అందిస్తున్న 10 ముఖ్య యాప్‌లు:

 1. పేసెన్స్‌:

పేసెన్స్ అనేది ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్య‌క్తిగ‌త రుణాల‌ను త్వరిత గ‌తిన అందిస్తుంది. రుణాల పంపిణీ కోసం ఇది ఐఐఎఫ్ఎల్, ఫుల్ల‌ర్‌ట‌న్ సంస్థ‌లతో భాగ‌స్వామ్యం క‌లిగి ఉంది. పేసెన్స్ యాప్ గూగ‌ల్ ప్లేలో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని అత్య‌వ‌స‌ర వైద్య ఖ‌ర్చులు, వివాహం ఖ‌ర్చులు, ద్విచ‌క్ర వాహ‌నం కొనుగోలు చేయ‌డం, వంటి వాటితో పాటు ఇత‌ర అవ‌స‌రాల‌కు వ్య‌క్తిగ‌త రుణాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ యాప్ ద్వారా గ‌రిష్టంగా రూ.2 ల‌క్ష‌ల రుణం ఇస్తారు. వార్షికంగా 16.8 శాతం ప్రారంభ వ‌డ్డీ ఉంటుంది. న‌ష్ట‌శాతం(రిస్క్‌) ఆధారంగా రుణం మొత్తాన్ని, కాల‌వ్య‌వ‌ధిని నిర్ణ‌యిస్తారు. రుణం పొందేందుకు బ్యాంకు స్టేట్‌మెంటుతో పాటు కేవైసీ ప‌త్రాల‌ను ఇవ్వాలి.

 1. ఎర్లీశాల‌రీ:

ఈ యాప్ ద్వారా శాల‌రీ అడ్వాన్స్‌, త‌క్ష‌ణ వ్య‌క్తిగ‌త రుణాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ యాప్‌ను ఉప‌యోగించి రూ.15 వేల నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ యాప్ ద్వారా రుణం పొందేందుకు రుణ చ‌రిత్ర అవ‌స‌రం లేదు. అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌, బిగ్‌బ‌జార్ ల‌లో ఈ యాప్‌ను ఉప‌యోగించి సుల‌భంగా కొనుగోలు చేయ‌వ‌చ్చు. రుణం మొత్తంపై నెల‌కు 2 నుంచి 2.5 శాతం వ‌డ్డీ ఉంటుంది. ఈ యాప్, నిర్థిష్ట న‌గ‌రాల‌లో మాత్ర‌మే రుణ స‌దుపాయాల‌ను అందిస్తుంది. 2 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

 1. ఇండియాబుల్స్ ధానీ:

ఇది ఒక మంచి వ్య‌క్తిగ‌త రుణ యాప్‌. ఈయాప్ ద్వారా త‌క్ష‌ణమే సెక్యూరిటీ లేని వ్య‌క్తిగ‌త రుణాల‌ను పొంద‌వ‌చ్చు. ఇందుకోసం భౌతికంగా ప‌త్రాల‌ను అందించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. వ‌డ్డీ రేట్లు కూడాత‌క్కువే వార్షికంగా 11.99 శాతం. ఈ యాప్ ద్వారా గ‌రిష్టంగా రూ.15 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త రుణాన్ని పొంద‌వ‌చ్చు. ప్రాసెసింగ్ రుస‌ములు 5 శాతం ఉంటాయి. రుణం పొందేందుకు యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వెరిఫికేష‌న్ కోసం, మీ పాన్‌, చిరునామా వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. రుణం మొత్తాన్ని ఎంట‌ర్ చేసిన త‌రువాత‌, మీ బ్యాంక్ ఖాతాలో రుణం మొత్తం కొన్ని నిమిషాల‌లోనే జ‌మ అవుతుంది.

 1. మ‌నీ ట్యాప్‌:

యాప్ ద్వారా రుణాల‌ను అందించే వాటిలో ఇది కూడా ఒక మంచి యాప్‌. మీరు విత్‌డ్రా చేసుకున్న మొత్తంపై మాత్ర‌మే వ‌డ్డీ చెల్లించాలి. మ‌నీట్యాప్‌, భార‌త‌దేశంలోని ప్ర‌ముఖ ఎన్‌బీఎఫ్‌సీల‌తో భాగ‌స్వామ్యం క‌లిగి ఉంది. 2 నుంచి 36 నెల‌ల కాల‌వ్య‌వ‌ధికి వ‌డ్డీ రేటు వార్షికంగా 13 నుంచి 24.3 శాతం ఉంటుంది. ఈ యాప్ ద్వారా గ‌రిష్టంగా రూ.5 ల‌క్ష‌లు రుణం పొంద‌వ‌చ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రోఫైల్ క్రియేట్ చేసుకుని డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేసి రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

 1. క్యాష్ఈ:

యువ నిపుణుల‌కు వారి నైపుణ్య‌త‌, సంపాద‌నా సామ‌ర్ధ్యం, సామాజిక ప్రొపైల్ ఆధారంగా స్వ‌ల్ప కాలిక వ్య‌క్తిగ‌త రుణాల‌ను త్వ‌రిత గ‌తిన అందిస్తారు. ఇది పూర్తిగా స్వ‌యం చాల‌కంగా ప‌నిచేస్తుంది. ఇందులో వ్య‌క్తిగ‌త రుణం పొందేందుకు డాక్యుమెంట్‌ల‌ను కాగిత రూపంలో అందించ‌న‌వ‌స‌రం లేదు. రూ. 5 వేల నుంచి గ‌రిష్టంగా రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను ఇస్తుంది. నెల‌వారీ వ‌డ్డీరేటు 1.5శాతం.

 1. మ‌నీ వ్యూ:

ఇది కూడా కాగిత ర‌హిత త‌క్ష‌ణ వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందిస్తుంది. గ‌రిష్టంగా రూ.5 ల‌క్ష‌ల వ‌రకు రుణం ఇస్తుంది. వార్షిక వ‌డ్డీరేటు 16 నుంచి 24 శాతం వ‌ర‌కు ఉంటుంది. ప్రాసెసింగ్ రుసుములు 2.5 నుంచి 4 శాతం వ‌ర‌కు ఉంటాయి.

 1. ఫ్లెక్స్‌శాల‌రీ:
  శాల‌రీ అడ్వాన్స్‌, త‌క్ష‌ణ రుణాల‌ను అందించే యాప్ ఫ్లెక్స్ శాల‌రీ. ఈ యాప్ ద్వారా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసే ఉద్యోగ‌స్తులు గ‌రిష్టంగా రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొంద‌చ్చు. సామాజిక ఖాతా ద్వారా లాగిన్ అయ్యి, బేసిక్ వివ‌రాలు, పాన్ కార్డు వివ‌రాలు పూర్తి చేసిన అనంత‌రం మీ ద‌ర‌ఖాస్తు రుణం ఆమోదానికి పంపుతారు. ఆమోదం పొందిన అనంత‌రం రుణం మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలో జ‌మ చేస్తారు.

 2. పేమీఇండియా:

పేమీఇండియా ఒక వినూత్న ఫిన్‌టెక్ యాప్‌. ఇది కార్పొరేట్ ఉద్యోగుల‌కు స్వ‌ల్ప‌కాలిక రుణాల‌ను అందిస్తుంది. ఉద్యోగుల‌కు అత్య‌వ‌స‌ర న‌గ‌దు అవ‌స‌రాల‌ను అందించ‌డంలో ప్ర‌ధానంగా ఈ యాప్ ప‌నిచేస్తుంది. గ‌రిష్ట రుణం రూ. 1ల‌క్ష, నెల‌వారీ వ‌డ్డీ రేటు 2 నుంచి 6 శాతం వ‌ర‌కు ఉంటుంది.

 1. క్రీడీ:

పేప‌ర్ ర‌హితంగా, వేగంగా, అవాంత‌రాలు లేకుండా వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందిస్తుంది. గ‌రిష్టంగా రూ. 1 ల‌క్ష వ‌ర‌కు రుణం ఇస్తుంది. బెంగుళూరు, చెన్నై, పూణె, ముంబాయి వంటి నిర్థిష్ట న‌గ‌రాల‌లో మాత్ర‌మే రుణాలు ఇస్తుంది. నెల‌వారీ వ‌డ్డీ రేటు 1శాతం నుంచి 1.5 శాతం వ‌ర‌కు ఉంటుంది.

 1. ఎనీటైమ్‌లోన్‌:

గో ప్లాట్‌ఫామ్‌పై పీ2పీ రుణాల‌నుతో పాటు వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందిస్తుంది. ఉద్యోగులు, స్వ‌యం ఉపాధి గ‌ల వ్య‌క్తుల‌కు ఈ యాప్ రుణాల‌ను అందిస్తుంది. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు సెక్యూరిటీ లేకుండా రుణాల‌ను ఇస్తుంది. గ‌రిష్టంగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. వార్షిక వ‌డ్డీ రేటు 18శాతం నుంచి 54 శాతం వ‌ర‌కు ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly