హైబ్రిడ్ వాహ‌నాల గురించి విన్నారా?

హైబ్రిడ్ వాహ‌నాలు వాటిలో ఉండే ర‌కాల గురించి ఇప్పుడు తెలుస‌కుందాం.

హైబ్రిడ్ వాహ‌నాల గురించి విన్నారా?

ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు… ఒక‌ప్పుడు వీటి గురించి మాట్లాడితే వాటికి వేగం త‌క్కువండీ… పిక‌ప్ ఉండ‌దు! ధ‌ర కూడా ఎక్కువ‌నే అనేవారు కానీ ప్ర‌స్తుతం సాంకేతిక‌త పెరిగింది. ఇందులో కూడా మంచి పిక‌ప్ తో ఉన్న వాహ‌నాలు వ‌స్తున్నాయి మ‌న దేశంలో అయితే వీటి సంఖ్య‌ను పెంచేందుకు ప్ర‌ణాళికల‌ను సిద్ధంచేశారు. పూర్తిస్థాయిలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మ‌న దేశంలో తిరిగేందుకు ఇంకా కొంత స‌మ‌యం ప‌డుతుంద‌నే చెప్పాలి. అయితే ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న హైబ్రిడ్ వాహ‌నాల గురించి విన్నారా?

హైబ్రిడ్ వాహ‌నాలు

ఇవి మ‌ధ్యే మార్గంగా రూపొందించిన వాహ‌నాలు. అటు పెట్రోల్ లేదా డీజిల్ తో న‌డిచే విధంగానూ, ఇటు విద్యుత్ బ్యాట‌రీ ఆధారంగా న‌డిచేవి. హైబ్రిడ్ కారులో రెండు విధాలుగా న‌డిచేందుకు ఇంజ‌న్లు ఉంటాయి. ఒక‌టి సాధార‌ణ ఇంథ‌నంతో న‌డిచేది. రెండోది ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌న్. రెండు విధాలుగా కారు న‌డిచే అవ‌కాశం ఉంటుంది.

ఇందులో ర‌కాలు

1. సిరీస్ హైబ్రిడ్ కార్లు

ఇవి చాలా పాత సాంకేతిక‌త ద్వారానే ప‌నిచేస్తున్నాయ‌ని చెప్పాలి. ఈ ర‌క‌మైన కార్ల‌లో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్ ఒక‌టి, విద్యుత్ బ్యాట‌రీ ద్వారా న‌డిచే ఎల‌క్ట్రిక్ ఇంజ‌న్ ఒక‌టి ఉంటుంది. ఈ రెండు ఒక దాని ద్వారా ఒక‌టి ప‌నిచేస్తుంటాయి. అంటే డీజిల్ ఇంజ‌న్ ప‌నిచేయ‌డం ద్వారా బ్యాట‌రీ సామ‌ర్థ్యం పొంది త‌ద్వారా కారు న‌డుస్తుంది.

2. పార్లెల్ హైబ్రిడ్ కార్లు

ఇవి ఇంథ‌న ప‌రంగా క‌లిసొచ్చే ర‌క‌మైన కార్లు. ఇందులో సాధార‌ణ ఇంథ‌నంతో న‌డిచే ఇంజ‌న్, విద్యుత్ బ్యాట‌రీ తో న‌డిచే ఇంజ‌న్ రెండూ ఒకే క్ర‌మంలో స్వ‌త‌హాగా ప‌నిచేస్తాయి.కాబ‌ట్టి దీనిమూలంగా ఇంథ‌నం వినియోగం త‌గ్గుతుంది. త‌క్కువ మొత్తంలో కార్బ‌న్ ఉత్ప్రేర‌కాలు విడుద‌ల చేయ‌డం ద్వారా ప‌ర్యావ‌ర‌ణానికి కూడా మేలు చేస్తుంటాయి.

3. ప్ల‌గ్ ఇన్ హైబ్రిడ్ కార్లు

ఇత‌ర హైబ్రిడ్ కార్ల‌లా కాకుండా ఇవి పూర్తి స్థాయి విద్యుత్ తో న‌డిచే ఏర్పాటు క‌లిగి ఉంటాయి. నేరు కారు ఛార్జింగ్ పాయింట్ ద‌గ్గ‌ర బ్యాట‌రీ ఛార్జింగ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

వాహ‌నం వినియోగించే విద్యుత్ బ్యాట‌రీ సామ‌ర్థ్యాల‌ను బ‌ట్టి వీటిని మైల్డ్ హైబ్రిడ్ ,ఫుల్ హైబ్రిడ్ కార్లుగా పిలుస్తారు.

మైల్డ్ హైబ్రిడ్ కార్లు: ఇవి త‌క్కువ సంద‌ర్భాల్లో విద్యుత్ వినియోగించి ప్ర‌యాణిస్తుంటాయి. ఎక్కువ శాతం ఇంథ‌నం ద్వారానే ఇంజ‌న్ న‌డుస్తుంది.

ఫుల్ హైబ్రిడ్ కార్లు: ఇవి ఎక్క‌వ సంద‌ర్భాల్లో విద్యుత్ వినియోగించి ప్ర‌యాణిస్తుంటాయి. వీటికి బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఎక్కువ‌గా ఉంటుంది. వీటి ధ‌ర కూడా కాస్త ఎక్కువ‌నే ఉంటుంది.

హైబ్రిడ్ కార్లు విద్యుత్ వినియోగించి న‌డిస్తే ఆ మేర‌కు ఇంథ‌నం మిగులుతుంది. ఆర్థికంగా చూస్తే సంప్ర‌దాయ వాహ‌నాల కంటే హైబ్రిడ్ వాహ‌నాల్లోఇంథ‌నం ద్వారా కొంత మిగులుతుంది. కారు ధ‌ర విష‌యంలో మామూలు కార్ల కంటే హైబ్రిడ్ కార్లు ఎక్కువ‌గా ఉంటాయి. ప్ర‌స్తుతం మ‌న దేశంలో మారుతీ సుజుకీ వంటి సంస్థ‌లు హైబ్రిడ్ కార్ల‌ను అందుబాటులోకి తెచ్చాయి.

పెరుగుతున్నముడిచ‌మురు ధ‌ర‌లు , అంత‌ర్జాతీయంగా దేశాల‌న్నీ కాలుష్యాన్నినియంత్రించాల‌ని పారిస్ ప్రోటోకాల్ నిర్ణ‌యం త‌దిత‌ర‌ అంశాల‌న్నీ విద్యుత్, హైబ్రిడ్ వాహ‌నాల సంఖ్య పెరిగేందుకు తోడ్ప‌డేవే. రానున్న రోజుల్లో హైబ్రిడ్, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు డిమాండు పెరిగే అవ‌కాశం ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly