ఉబెర్‌ ఈట్స్‌ను సొంతం చేసుకున్న జొమాటో

ఉబెర్‌కు జొమాటోలో 9.9శాతం వాటా లభించింది. అంతేకాకుండా ఉబెర్‌ ఈట్స్‌ వినియోగదారులందరినీ జొమాటోకు బ‌దిలీ చేశారు

ఉబెర్‌ ఈట్స్‌ను సొంతం చేసుకున్న జొమాటో

భారతీయ ఆహార సరఫరా దిగ్గజం జొమాటో, అమెరికన్‌ ఆన్‌లైన్‌ ఆహార సంస్థ ఉబెర్‌ ఈట్స్‌ను చేజిక్కించుకుంది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు దాదాపు రూ.2500 కోట్ల విలువైన వ్యాపార ఒప్పందం చేసుకొన్నాయి. దీనిప్రకారం ఉబెర్‌ ఈట్స్‌ జొమాటోతో విలీనంమైంది. అందుకు ప్రతిగా ఉబెర్‌కు జొమాటోలో 9.9శాతం వాటా లభించింది. అంతేకాకుండా ఉబెర్‌ ఈట్స్‌ వినియోగదారులందరినీ జొమాటోకు బదలాయించారు. ‘‘భారత్‌లో మా ఆహార సామ్రాజ్యాన్ని స్థాపించి దానిని 500 పైగా నగరాలకు విస్తరించినందుకు గర్విస్తున్నాం. మా తాజా కొనుగోలుతో ఆహార సరఫరా రంగంలో మా స్థానం మరింత బలోపేతం కానుంది’’ అని జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ప్రకటించారు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly