నిర్మాణంలో ఉన్న ఇల్లా, సిద్దంగా ఉన్న ఇల్లా – ఏది కొనుగోలు చేయ‌డం మంచిది?

ఇల్లు నిర్మాణంలో ఉన్నా, సిద్ధంగా ఉన్నా, దానికి సంబంధించిన అన్ని ప‌త్రాల‌ను నిశితంగా ప‌రిశీలించిన తరువాత మాత్ర‌మే కొనుగోలు చేయాలి.

నిర్మాణంలో ఉన్న ఇల్లా, సిద్దంగా ఉన్న ఇల్లా – ఏది కొనుగోలు చేయ‌డం మంచిది?

ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ‌కు ఒక సొంత ఇల్లు ఉండాల‌ని కోరుకుంటారు అందులో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి ఇల్లు కొనుగోలు చేయాలి? నివ‌సించేందుకు సిద్దంగా ఉన్న ఇల్లా? లేదా నిర్మాణంలో ఉన్న ఇల్లా? అనేది చాలా మంది మ‌దిలో గంద‌ర‌గోళాన్ని సృష్టిస్తుంది. అయితే రెండింటిలోనూ కొన్ని అనుకూల‌త‌లు, అలాగే కొన్ని ప్ర‌తికూల‌తలు కూడా ఉన్నాయి. వాటిని గురించి పూర్తిగా తెలుసుకుని ఇంటిని కొనుగోలు చేయ‌డం మంచిది.

నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయ‌డంలో ప్ర‌తికూల‌త‌లు:

నిర్మించ‌డంలో ఆల‌స్యం, స్థ‌లం అనుమ‌తులు, వివాదాలు - అనుకున్న రోజుకు ప్రాజెక్ట్ ప‌నులు పూర్తి చేసి కొనుగోలుదారునికి అప్ప‌గించ‌డం అనేది మ‌నం అరుదుగా చూస్తుంటాం. నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయ‌డంలో ఉన్న అతి పెద్ద స‌మ‌స్య అనుకున్న స‌మ‌యానికి నిర్మాణం పూర్తికాక పోవ‌డం. వివిధ కార‌ణాల‌తో నిర్మాణం ప‌నులు ఆల‌స్యం అవుతుంటాయి. ఆస్తిని నిర్మించి ఇచ్చేందుకు స‌గ‌టున బిల్డ‌ర్ ఇచ్చే గ‌డువు తేది 2 సంవ‌త్స‌రాలైతే నిర్మాణం పూర్త‌య్యేందుకు 4 నుంచి 5 సంవ‌త్స‌రాలు ప‌ట్ట‌చ్చు. అంత ఎక్కువ కాలం వేచి ఉండ‌డం వ‌ల్ల కొనుగోలు దారులు నిరాశ‌కు గుర‌వుతారు.

ప్ర‌ధానంగా భూ వివాదం, స‌రిప‌డినంత న‌గ‌దు లేక‌పోవ‌డం, అధికారుల నుంచి అనుమ‌తులు తీసుకోవ‌డం వంటి విష‌యాల‌లో జాప్యం జ‌రుగుతుంది. అధికారుల వ‌ద్ద నుంచి అన్ని ముఖ్య‌మైన, అవ‌స‌ర‌మైన అనుమ‌తులు ల‌భించిన త‌రువాత మాత్ర‌మే బిల్డ‌ర్లు నిర్మాణ‌పు ప‌నులు మొద‌లు పెట్టాలి. కానీ కొంత‌ మంది బిల్డ‌ర్లు నిర్మాణ‌పు ప‌న్నులు జ‌రుగుతున్న‌ప్పుడు కూడా కొన్ని అనుమ‌తుల తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అందువ‌ల్ల నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసే ముందు భూముల య‌జ‌మాన్య వివ‌రాలు, అవ‌స‌ర‌మైన అనుమ‌తులు ఉన్నాయా లేదా అనే వివ‌రాలు తెలుసుకోవాలి. మ‌రీ ముఖ్యంగా చిన్న బిల్డ‌ర్‌ల వ‌ద్ద ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా త‌నీఖీ చేసుకోవాలి. ఇల్లు నిర్మించ‌డం 1 నుంచి 2 సంవ‌త్స‌రాలు ఆల‌స్యం అయిన చివ‌ర‌కు మీ చేతికి గృహం వ‌స్తుంది. కానీ 5 నుంచి 10 సంవ‌త్స‌రాలు వేచియున్న త‌రువాత కూడా గృహం త‌మ చేతికి రాని కొనుగోలు దారులు చాలా మంది ఉన్నారు.

మీరు చూసింది పొంద‌లేక‌పోవ‌చ్చు:

నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసేప్పుడు ఎదుర‌య్యే మ‌రొక పెద్ద స‌మ‌స్య మీకు వాగ్దానం చేసిన లేదా న‌మూనా ప్లాట్‌లో చూపించిన‌ విధంగా ఇంటిని పొంద‌లేక‌పోవ‌డం. న‌మూనా ప్లాట్ల‌ను కొనుగోలుదారుల‌కు న‌చ్చే విధంగా అందంగా అలంక‌రిస్తారు. వాటిని చూసి నిర్మాణంలో ఉన్న గృహాల‌పై అంచ‌నాల‌ను పెంచుకుని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతారు. కానీ ఇంటిని స్వాధీన ప‌రిచిన‌ప్పుడు మీరు చూసిన న‌మూనా ఇంటికి, కొనుగోలు చేసిన ఇంటికి చాలా వ్య‌త్యాసం ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు లేఅవుట్‌లు మారే అవ‌కాశం కూడా ఉంటుంది. నిర్మాణం పూర్తి అయిన త‌రువాత మీరు కొనుగోలు చేసిన కొత్త ఇంటిని మీరే ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కి కొంత మంది బిల్డ‌ర్లు, నిర్మాణం పూర్త‌యిన 3 నుంచి 6 నెల‌ల త‌రువాత‌ మున్సిపాల్టీ నీటి స‌ర‌ఫారా అందుబాటులోకి వ‌స్తుంద‌ని త‌ప్పుడు వాగ్దానాలు చేస్తుంటారు. కానీ ఒక‌సారి సొసైటీలోని మొత్తం గృహాల‌ను విక్ర‌యించిన త‌రువాత ఆ స‌మ‌స్య‌ను గురించి ప‌ట్టించుకోరు. బిల్డ‌ర్, నిర్మించిన గృహాల‌ను విక్ర‌యించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ విధ‌మైన వాగ్ధానాల‌ను చేస్తారు. విక్ర‌యించ‌డం పూర్తైన‌ త‌రువాత కొనుగోలుదారుడు ఎదుర్కొనే క‌ష్ట‌నష్టాల‌పై అత‌నికి ఏవిధ‌మైన ఆస‌క్తి ఉండ‌దు. చాలాసార్లు పార్కింగ్, స్విమింగ్ పూల్‌, జిమ్ వంటి అద‌న‌పు సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్నామ‌ని నోటి మాట‌గా చెప్తుంటారు. నోటి మాట‌గా చెప్పే అలాంటి వాగ్దానాల ఆదారంగా ఇంటిని కొనుగోలు చేస్తే చివ‌రికి మీరు ఏమి చేయ‌లేని ప‌రిస్థితి రావ‌చ్చు. అందువ‌ల్ల ఒప్పందం వ్రాత పూర్వ‌కంగా ఉండేలా చూసుకోవాలి.

నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డ‌వ‌చ్చు: నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసేప్పుడు వ‌చ్చే మ‌రొక ముఖ్య‌మైన స‌మ‌స్య నాణ్య‌త‌. నిర్మాణానికి ఉప‌యోగించే ప‌దార్ధాలు, డోర్లు, కిటికీల పూరింపులు, విద్యుత్ సాకెట్లు, స్విచ్లు వంటి వాటిలో త‌క్కువ నాణ్య‌త వున్న వాటిని ఉప‌యోగించ‌వ‌చ్చు. ప్లంబింగ్‌, పార్కింగ్ స్థ‌లం, పిల్ల‌ల ఆట స్థ‌లం, ఇత‌ర స‌దుపాయాలు ఆశించిన విధంగా ఉండ‌క‌పోవ‌చ్చు. మీరు ఈ విష‌యాల గురించి ఫిర్యాదు చేస్తే న‌గ‌దు స‌రిపోలేదు, నిర్మాణ‌పు ఖ‌ర్చులు పెరిగాయి, తొంద‌ర‌లో చేస్తాం అని బిల్డ‌ర్లు ర‌క‌ర‌కాల సాకులు చెప్తుంటారు. స్వాధీన స‌ర్టిఫికేట్ తీసుకోక‌పోతే ఆదాయ‌పు ప‌న్ను: ఇంటిని స్వాధీనం చేసుకున్న అనంత‌రం ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.ముఖ్యంగా మీరు చెల్లించే ఈఎమ్ఐల‌ పై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఈఎమ్ఐపై ప‌న్ను మిన‌హాయింపు కోసం ఇంటిని కొనుగోలు చేసేవారు ఉన్నారు. కానీ వారికి ఈ విష‌యం గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు. నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే ఇంటి అద్దెతో పాటు ఈఎమ్ఐ చెల్లించాలి. అంతేకాకుండా స్వాధీన స‌ర్టిఫికేట్ తీసుకోక‌పోతే ప‌న్ను మిన‌హాయింపులు కోల్పోతారు. 1 నుంచి 2 సంవ‌త్స‌రాలు నిర్మాణం ఆల‌స్యం అయితే చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంది.

నిర్మాణంలో ఇంటిని కొనుగోలు చేయ‌డంలో అనుకూల‌త‌లు: నెమ్మ‌దిగా ప్రారంభించి, సౌక‌ర్య‌వంతంగా చెల్లింపులు చేయ‌వ‌చ్చు - గృహ‌రుణం తీసుకునే వారు నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయ‌డం ద్వారా సుల‌భంగా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. సాద‌ర‌ణంగా ఇంటి ధ‌ర‌లో 20 శాతం డౌన్ పేమెంట‌ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ప్ర‌తి నెల‌ ఈఎమ్ఐల‌ రూపంలో చెల్లించాలి. ఈ విధానం ద్వారా చాలా మందికి త‌మ సొంత ఇంటి క‌ల నెర‌వేరుతుంది. కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత కొనుగోలుదారుని జీతం పెరిగిన ఈఎమ్ఐ విలువ మాత్రం ముందు చెల్లించిన మొత్తానికి స‌మానంగానే ఉంటుంది. గృహరుణం ద్వారా మాత్ర‌మే కాకుండా క‌న్‌ష్ట్ర‌క్ష‌న్ లింక్‌డ్ చెల్లింపు ప‌ద్ద‌తి ద్వారా కూడా నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయ‌చ్చు. ఫ్లోర్‌, ప్ర‌దేశాల‌ను ఎంచుకునే అవ‌కాశం విస్తృతంగా ఉంటుంది - నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే నిర్మాణ ప్ర‌దేశాన్ని, ఫ్లోర్‌ను ఎంచుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఒకవేళ మీకు 12వ ఫ్లోర్‌లో ఇబ్బందిగా ఉంటే మ‌రికొంత మొత్తం అద‌నంగా చెల్లించి 3వ ఫ్లోర్‌లో ప్లాట్‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది. అదే నిర్మాణం పూర్తి అయిన త‌రువాత ప్లాట్లు అప్ప‌టికే విక్రియించేస్తారు కాబ‌ట్టి మ‌న‌కు కావ‌ల‌సిన ఫ్లోరోలో ప్లాట్ దొరికే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

ధ‌ర పెరిగే అవ‌కాశం ఉంటుంది:

సోసైటీల‌ను సాధార‌ణంగా న‌గ‌ర శివారుల‌లో నిర్మిస్తుంటారు. అందువ‌ల్ల నిర్మాణంలో ఉన్న ఇంటికి భ‌విష్య‌త్తులోధ‌ర పెర‌గ‌వ‌చ్చు, కొన్ని సంద‌ర్భాల‌లో పెర‌గ‌క‌పోవ‌చ్చు. అయిన‌ప్ప‌టికి నిర్మాణం ఉన్న ప్ర‌దేశాన్ని, భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను, చుట్టు ఉన్న ప్ర‌దేశాల‌ను, సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించాలి. సిద్దంగా ఉన్న అపార్ట‌మెంటు కంటే నిర్మాణంలో ఉన్న ఆస్తికి భ‌విష్య‌త్తులో ధ‌ర పెరిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

సిద్దంగా ఉన్నఆస్తి కొనుగోలు చేయ‌డంలో ప్ర‌తికూల‌త‌లు:

 1. చ‌ట్ట‌ప‌ర‌మైన డాక్యుమెంటేష‌న్‌, ప‌ని ఎక్కువ‌:
  సిద్దంగా ఉన్న ఇంటికి చాలా బ‌దిలీ ప‌త్రాలు ఉంటాయి. తాజా డాక్యుమెంటేష‌న్ ఉండ‌దు కాబ‌ట్టి డాక్యుమెంటేష‌న్ ప‌ని ఎక్కువ‌గా ఉంటుంది.

 2. ఒకేసారి డౌన్‌పేమెంట్ మొత్తం చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవాలి. అందువ‌ల్ల గృహ రుణం తీసుకున్న‌ప్ప‌టికీ డౌన్‌పేమెంట్‌, రిజిస్ట్రేష‌న్ రుసుములు, స్టాంప్ డ్యూటీ మొత్తం ఒకేసారి చెల్లించాలి.

 3. మోస‌పోయే అవ‌కాశం ఎక్కువ‌:
  సిద్దంగా ఉన్న ఇల్లు కొనుగోలు చేసేప్పుడు ఎదుర‌య్యే అతి పెద్ద స‌మ‌స్య న‌కిలీలు. ఒక ఆస్తిని న‌కిలీ ప‌త్రాల ద్వారా ఒక‌రి కంటే ఎక్కువ మందికి విక్ర‌యించే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల ఒక మంచి రియ‌ల్ఎస్టేట్ ఏజెంట్ లేదా లాయ‌ర్ ద్వారా ప‌త్రాల‌ను అద్య‌య‌నం చేయించి ప‌త్రాలు ఒరిజిన‌ల్ అని నిర్ధారించుకుని కొనుగోలు చేయాలి.

 4. అధిక ధ‌ర‌:
  నిర్మాణంలో ఉన్న ఆస్తితో పోలిస్తే సిద్దంగా ఉన్న ఆస్తి ధ‌ర త‌క్కువ‌గా ఉండాలి. అయితే సిద్దంగా ఉన్న ఆస్తి ఉన్న ప్రాంతంలో ఉన్న వృద్ది రేటు ఆధారంగా అవి నిర్మించి 5 సంవ‌త్స‌రాల కాలం పూర్తైన‌ప్ప‌టికీ కూడా ధ‌ర‌లో పెరుగుద‌ల ఉంటుంది.

సిద్దంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయ‌డంలో అనుకూల‌త‌లు:

 1. మీరు చూసిన దాన్ని కొనుగోలు చేస్తారు:
  నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసేప్పుడు ఇంటి న‌మూనా ఆదారంగా మాత్ర‌మే కొనుగోలు చేస్తారు. కానీ సిద్దంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేసేప్పుడు ప్ర‌తిదాన్ని మీరు స్వ‌యంగా చూసి కొనుగోలు చేయ‌వ‌చ్చు. చుట్టుప్ర‌క్క‌ల నివ‌సించే ప్ర‌జ‌ల ద్వారా క‌రెంటు, నీటి స‌ర‌ఫ‌రా వంటి విష‌యాల గురించి తెలుసుకోవ‌చ్చు.

 2. అద్దె, ప్ర‌యాణ ఖ‌ర్చుల నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం:
  చాలా మంది అద్దె ఇంటికి అధిక‌ అద్దెను చెల్లిస్తూ, ప‌నిచేసే ప్ర‌దేశానికి అద్దె ఇంటికి ప్ర‌యాణం చేస్తుంటారు. సిద్దంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయ‌డం వ‌ల‌న అద్దె, ప్ర‌యాణ‌పు ఖ‌ర్చుల నుంచి త‌క్ష‌ణమే విముక్తి పొంద‌వ‌చ్చు.

 3. చుట్టుప్ర‌క్క‌ల నివ‌సించే ప్ర‌జ‌ల గురించి తెలుసుకోవ‌చ్చు:
  చుట్ట‌ప్ర‌క్క‌ల నివ‌సించే ప్ర‌జ‌ల గురించి ముందుగానే తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే చుట్టుప్ర‌క్క‌ల వ్య‌క్తులు ఏవిధంగా న‌డుచుకుంటారో తెలియ‌దు.

పెట్టుబ‌డుల కోణం నుంచి కొనుగోలు చేయాలంటే నిర్మాణంలో ఉన్న ఇంటిని, నివాస, సొంత‌ ప్ర‌యోజ‌నం కోసం అయితే సిద్దంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయ‌డం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly