మ్యూచువల్‌ ఫండ్‌ ఎన్‌ఏవీ అంటే!!

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేటప్పుడు ఎన్‌ఏవీని లెక్కించే పద్ధతి, ఎన్‌ఏవీ విలువను ప్రభావితం చేసే అంశాలను తెలుసుకుందాం...

మ్యూచువల్‌ ఫండ్‌ ఎన్‌ఏవీ అంటే!!

మ్యూచువల్‌ ఫండ్‌లోని మన పెట్టుబడుల లాభ నష్టాలు ఆ ఫండ్ ఎన్‌ఏవీ కదలికల మీద ఆధారపది ఉంటుంది. మరి ఎన్‌ఏవీ అంటే ఏమిటి అది లెక్కించే పద్దతి గురించి అవగాహన ఉండడం ఎంతైనా అవసరం.

ఎన్‌ఏవీ లెక్కించేందుకు సూత్రము:
పథకంలోని ఆస్తుల (అసెట్స్‌) మార్కెట్‌ విలువ − అప్పులు (లయబిలిటీస్‌) = ఎన్‌ఏవీ

NAV-WHITE.jpg

ప్రతి యూనిట్‌ ఎన్‌ఏవీ విలువ తెలుసుకోవాలంటే మొత్తం అసెట్‌ విలువను మొత్తం యూనిట్ల సంఖ్యతో భాగించాలి.

ఉదాహరణకు :

ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పధకంలో ఆస్తులు రూ.50కోట్లు, అప్పులు రూ.25కోట్లు ఉంటే ఆ ఫండ్‌ ఎన్‌ఏవీ విలువ ఇలా ఉంటుంది.
అసెట్స్‌ − లయబిలిటీస్‌ = ఎన్‌ఏవీ
రూ.50కోట్లు − రూ.25కోట్లు = 25కోట్లు = ఎన్‌ఏవీ
మ్యూచువల్‌ ఫండ్స్‌లో 1 కోటి యూనిట్లు ఉంటే, ఒక్కో యూనిట్‌ ఎన్‌ఏవీ విలువ
మొత్తం ఎన్‌ఏవీ రూ.25,00,00,000 / మొత్తం యూనిట్లు 1,00,00,000

ప్రతి యూనిట్‌ ఎన్‌ఏవీ = రూ.25 గా ఉంటుంది

ఎన్‌ఏవీలో మార్పులు:

పెట్టుబడి సాధనాల ధరల్లో మార్పులేమైనా చోటుచేసుకుంటే మ్యూచువల్‌ ఫండ్‌ ఎన్‌ఏవీలలోనూ మార్పులు ఉండొచ్చు.

ఎన్‌ఏవీని ప్రభావితం చేసే అంశాలు

  • ఫండ్ లోని పెట్టుబడుల లో మార్పులు చేర్పులు.
  • ఫండ్ ఆస్తుల విలువలో మార్పులు
  • ఫండ్ నిర్వహణ ఖర్చులు, చెల్లింపులు.
  • యూనిట్ల కొనుగోలు, అమ్మకాలు.

మ్యూచువల్‌ ఫండ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు తమ నికర ఆదాయ విలువ నెట్‌ అసెట్‌ వాల్యూ, ఎన్‌ఏవీలను రోజువారీగా తప్పకుండా ప్రచురించాలి. ఏమ్‌ఎఫ్‌ఐ వెబ్‌సైట్‌లో రాత్రి 9గంటల లోగా ఫండ్‌ యూనిట్ల ఎన్‌ఏవీ, అమ్మకం/కొనుగోలు ధరలను అప్‌డేట్‌ చేస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly