యూఏఎన్ ఖాతా గురించి అయిదు ముఖ్యమైన విషయాలు!

యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌రును(యూఏఎన్‌) యాక్టివేట్ చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం.

యూఏఎన్ ఖాతా గురించి అయిదు ముఖ్యమైన విషయాలు!

ప్ర‌జా భ‌విష్య నిధి సంస్థ యూనివ‌ర్స‌ల్ ఖాతా సంఖ్య‌ను ఉద్యోగుల ప్ర‌యోజ‌నార్థం ప్ర‌వేశ‌పెట్టింది. ఉద్యోగి ఒక సంస్థ నుంచి మ‌రోదానికి మారిన‌ప్పుడల్లా కొత్త పీఎఫ్ ఖాతా ఇస్తారు. ఈ ర‌కంగా చాలా పీఎఫ్ ఖాతాలు ఉద్యోగి పేరిట ఉంటాయి. పీఎఫ్ డ‌బ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అంత‌వ‌ర‌కు ప‌నిచేసిన అన్ని కంపెనీల చుట్టూ తిర‌గాలి. ఒక‌ప్పుడు పీఎఫ్ మ‌నీ విత్ డ్రా చేసుకోవాలంటే ఖాతాదారే స్వ‌యంగా వెళ్లాల్సి వ‌చ్చేది. అదీ కాకుండా పేప‌ర్ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉండేది. ఈపీఎఫ్ సొమ్మ‌ను బ‌దిలీ, విత్ డ్రా చేయ‌డం పెద్ద త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా ఉండేది. అందుకే ప్ర‌భుత్వం యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌ర్‌ను సృష్టించింది. జీవితాంతం ఇది శాశ్వ‌తంగా ఉండే సంఖ్య.

యూఏఎన్ అంటే…

ఉద్యోగంలో చేరిన‌ప్పుడు 12 అంకెల విశిష్ట పీఎఫ్ ఖాతా సంఖ్య‌ను కేటాయిస్తారు. ఏ సంస్థ‌కు ఆ సంస్థ విడివిడిగా పీఎఫ్ సంఖ్యను కేటాయిస్తుంది. ప్ర‌తి సంస్థకు చెందిన‌ పీఎఫ్ ఖాతా నుంచి సొమ్ము విత్‌డ్రా చేయాల‌న్నా, బ‌దిలీ చేయాల‌న్నా ఖాతాదారుకు క‌ష్టం. ఇటు ఈపీఎఫ్ సంస్థ‌కు ప‌ని భారం. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌రు(యూఏఎన్‌)ను భ‌విష్య నిధి సంస్థ‌ అందుబాటులోకి తెచ్చింది. యూఏఎన్ శాశ్వ‌త సంఖ్య‌. ఉద్యోగం మారిన‌ప్పుడు కొత్త యాజ‌మానికి యూఏఎన్ తెలపాలి.

యూఏఎన్ ఎలా పొందాలి…

సంస్థ యాజ‌మాని వ‌ద్ద యూఏఎన్ సంఖ్యను పొందాలి. ప్ర‌తి ఈపీఎఫ్ ఖాతాదారు యూఏఎన్ పొందేందుకు అర్హుడు. యూఏఎన్ సంఖ్య కేటాయింపు జ‌రిగాక యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మొబైల్ నెంబ‌రు, యూఏఎన్, పీఎఫ్ ఖాతా సంఖ్య అవ‌స‌ర‌మ‌వుతుంది. చేసుకునేందుకు
ఆ త‌ర్వాత ఆథ‌రైజేష‌న్ పిన్ మొబైల్ నంబ‌రుకు వ‌స్తుంది. ఈ పిన్ నెంబ‌రును ఎంట‌ర్ చెయ్యాలి. లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ను జ‌న‌రేట్ చేసుకుని రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ పూర్తి చేయాలి.

Screen Shot 2017-06-13 at 08.48.29.png

పీఎఫ్ ఖాతాను యూఏఎన్‌తో లింక్ చేసుకునేందుకు

  • ఏదైనా కేవైసీ ప‌త్రం
  • బ్యాంకు ఖాతా సంఖ్య‌, ఐఎఎఫ్ ఎసీ కోడ్‌, వివ‌రాలు
  • పాత సంస్థ ఇచ్చిన యూఏఎన్
  • పాత సంస్థ‌లో ప‌నిచేసిన చివ‌రి తేదీ

కేవైసీ ప‌త్రాలు

కేవైసీ పూర్తి చేసేందుకు ఈ డాక్యుమెంట్ల‌లో ఏదైనా ఒక‌టి ఉప‌యోగ‌ప‌డుతుంది… డ్రైవింగ్ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఓట‌రు కార్డు, రేష‌న్ కార్డు

యూఏఎన్ ఖాతాతో ప్ర‌యోజ‌నాలు

  • ఉద్యోగులు త‌మ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు, విత్ డ్రా చేసేందుకు, లేదా వేరే పీఎఫ్ ఖాతాకు బ‌దిలీ చేసేందుకు యూఏఎన్ ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • చిరునామా, పేర్ల‌లో మార్పులుంటే కేవైసీ డాక్యుమెంట్ల‌ను యూఏఎన్ ద్వారా అప్‌లోడ్ చేసుకునేందుకు వీల‌వుతుంది.
  • పీఎఫ్ ఖాతాలోని సొమ్మును తీసుకునేందుకు సంస్థ యాజ‌మాన్యంపై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.
  • పీఎఫ్ ఖాతాలో జ‌రిగే లావాదేవీల వివ‌రాలు ఎస్.ఎం.ఎస్‌.గా అందుతాయి. కాబ‌ట్టి ప్ర‌తి నెలా జ‌మ అయ్యే పీఎఫ్ డ‌బ్బును ట్రాక్ చేయ‌వ‌చ్చు.
  • త‌క్కువ స‌మ‌యంలోనే పీఎఫ్ ఖాతా సొమ్ము విత్‌డ్రా, బ‌దిలీ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly