ఆధార్ కార్డ్‌లో చిరునామా అప్‌డేట్‌..స్టేట‌స్‌

మీ ఆధార్ స్టేట‌స్‌ను చెక్ చేయడానికి, నమోదు ఐడీ (ఈఐడీఐ) అవసరం

ఆధార్ కార్డ్‌లో చిరునామా అప్‌డేట్‌..స్టేట‌స్‌

ఆధార్ కార్డులో చిరునామా మార్పుల కోసం గంట‌ల త‌ర‌బ‌డి వ‌రుస‌లో నిల‌బ‌డన‌వ‌స‌రం లేదు. ఆన్‌లైన్‌లో ఈ మార్పుల‌ను చేసుకునేందుకు యూఐడీఏఐ సదుపాయం క‌ల్పించింది. అయితే యూఐడీఏఐతో మొబైల్ నంబ‌ర్ న‌మోదు అయిన‌వారే ఈ విధంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే వీలుంది. ఆన్‌లైన్ ద్వారా చేస్తే మొబైల్‌కి ఓటీపీ వ‌స్తుంది. అందుకే న‌మోదు చేసిన మొబైల్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా?

  1. UIDAI వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
  2. 'Proceed to update Addressస పై క్లిక్ చేయాలి
  3. వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి, త‌గిన డాక్యుమెంట్ల‌ను అప్‌డేట్ చేయాలి

ఇక ఆఫ్‌లైన్‌లో చేయాల‌నుకుంటే ద‌గ్గ‌ర‌లోని ఆధార్ కేద్రాల‌కు వెళ్లి ఆధార్‌లో చిరునామాను మార్పుకోవ‌చ్చు. దీనికి అవ‌స‌ర‌మైన దృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను తీసుకెళ్లాలి. ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌ను స్కాన్ చేసి ఇస్తారు.

మీ ఆధార్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌డానికి, మీకు మీ నమోదు ID (EID) అవసరం. మీరు నమోదు స్లిప్ పైన ఈ సంఖ్యను కనుగొనవచ్చు.

  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో
  • ఈఐడి, న‌మోదు సమ‌యం ఎంట‌ర్ చేసి
  • అక్క‌డ ఉన్న కోడ్‌ను దృవీక‌రించి
  • ‘Check Status’ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly