పోస్టాఫీస్ ఖాతాదారులు.. ఏటీఎం కార్డులు మార్చుకున్నారా?

పోస్టాఫీస్ ఖాతాదారులు ఈఎమ్‌వీ చిప్ కార్డుల‌ను తీసుకునేందుకు జ‌న‌వ‌రి 31, 2020 చివరి తేది

పోస్టాఫీస్ ఖాతాదారులు.. ఏటీఎం కార్డులు మార్చుకున్నారా?

పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (పీఓఎస్‌బీ) ఖాతాదారులు మ్యాగ్నెటిక్స్ ఏటీఎం కార్డుల‌కు బ‌దులుగా ఈఎమ్‌వీ చిప్ కార్డుల‌ను తీసుకునేందుకు జ‌న‌వ‌రి 31, 2020 చివరి తేది. వినియోగ‌దారులు తమ మొబైల్ నంబర్లను ఈ నెలాఖరులోగా అప్‌డేట్ చేయాలని కోరింది. ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ ప్రకారం, జనవరి 31 లోగా ఈ డెబిట్ కార్డును మార్చుకోక‌పోతే తమ కార్డును ఉపయోగించలేరు, ఎందుకంటే అది బ్లాక్ అవుతుంది. మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి, ఇప్పటికే ఉన్న ఎటిఎం కార్డును భర్తీ చేయడానికి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుడు పోస్టాఫీస్‌ శాఖను సందర్శించాలి.

ఈఎమ్‌వీ చిప్ కార్డులు ఏమిటి?

మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులతో పోలిస్తే చిప్-ఆధారిత కార్డులు డేటా ఎన్క్రిప్షన్, స్టోరేజ్ సాంకేతికత, అధిక ప్రమాణాలను క‌లిగి ఉంటాయి. లావాదేవీని పూర్తి చేయడానికి పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్‌) పరికరంలో స్వైప్ అవసరమయ్యే మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డుల మాదిరిగా కాకుండా, లావాదేవీని పూర్తి చేయడానికి చిప్ పిన్ కార్డులకు పిన్ అవసరం.

పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా :

ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ indiapost.gov.in ప్ర‌కారం, పొదుపు ఖాతాలో డిపాజిట్ చేసిన సంవత్సరానికి 4% చొప్పున వడ్డీని చెల్లిస్తుంది. పొదుపు ఖాతాతో పాటు, పోస్ట్ ఆఫీస్ కొన్ని ఉపసంహరణ పరిమితి, లావాదేవీ ఛార్జీలతో ఎటిఎం కార్డులను అందిస్తుంది. పోస్టాఫీస్ ఎటిఎం కార్డు ద్వారా రోజుకు రూ. 25,000 నగదు ఉపసంహరించుకునే అవ‌కాశం ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly