డెబిట్ కార్డు ఉపయోగించడం ఎలా అంటే..

సులభంగా బ్యాంకు లావాదేవీలను చేసుకునేందుకు వీలుగా బ్యాంక్ ఇచ్చే డెబిట్ కార్డును ఉపయోగించే విధానం తెలుసుకుందాం.

డెబిట్ కార్డు ఉపయోగించడం ఎలా అంటే..

ఏటీమ్‌ల ద్వారా లావాదేవీలు జరపడం సురక్షితం, భద్రతతో కూడుకున్నది. అవసరమైనప్పుడు ఖాతా నుంచి నగదును విత్‌డ్రా చేసుకోగల వీలు కల్పించేదే డెబిట్ కార్డు. దీని సాయంతో సులువుగా ఖాతా నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏ బ్యాంకు డెబిట్ కార్డు అయినా మరో బ్యాంకు ఏటీఎమ్ యంత్రంలో సైతం వాడుకోవచ్చు. నగదు విత్‌డ్రా మాత్రమే కాకుండా ఇతర సేవలు సైతం సులభంగా ఏటీమ్‌ ద్వారా పొందవచ్చు.

ఖాతాదారుడు ఏటీఎమ్‌ని పొందే విధానం:

 • పొదుపు, కరెంటు ఖాతా ఉన్న ఎవరైనా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
 • బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడే పత్రాలు నింపేటప్పుడు ఎటీఎమ్‌ కోసం అభ్యర్థించవచ్చు. లేదా ఇప్పటికే ఖాతా ఉంటే ఏటీఎమ్‌ కార్డు కోసం మీ ఖాతా కలిగిన బ్యాంకును సంప్రదించి ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
 • కార్డు విరిగిపోయినా, పాడైనా, పోగొట్టుకున్నా కొత్త కార్డు కోసం బ్యాంకు నిర్దేశించిన రుసుం చెల్లించి కొత్త కార్డు పొందాలి.

ఉపయోగించడం:

 • ఏటీఎమ్‌ కార్డు పొందిన తర్వాత వెనుకవైపు సంతకం చేయాలి.
  ATM.jpg

సాధారణ చెల్లింపుల కోసం ఏటీఎమ్‌ కమ్‌ డెబిట్‌ కార్డును ఈ కింది విధంగా ఉపయోగించుకోవచ్చు

 • పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీఓఎస్‌) వద్ద మొదట కార్డును స్వైప్‌ చేస్తారు.
 • విత్‌డ్రా చేసుకోవాల్సిన సొమ్ము మొత్తాన్ని నమోదు చేస్తారు.
 • పీఓఎస్‌ యంత్రం ఏటీఎమ్‌ పిన్‌ కోసం అడుగుతుంది. పిన్‌ను ఎవరికీ చెప్పకండి. మీరే యంత్రంలో పిన్‌ నెంబరును ఎంటర్‌ చేయాలి.
 • సరైన పిన్‌ను నమోదు చేసి ఛార్జ్‌ స్లిప్‌ మీద సంతకం చేయాలి. వెంటనే మీ ఖాతా నుంచి బిల్లుకు అయిన మొత్తం మినహాయిస్తారు.

పరిమితులు

 • రోజులో ఒక ఏటీఎమ్‌ నుంచి విత్‌ డ్రా చేసుకోగల కనీస మొత్తం రూ.100.
 • గరిష్ట పరిమితి బ్యాంకును, ఖాతాను బట్టి మారుతూ ఉంటుంది. సంబంధిత బ్యాంకును సంప్రదించి పరిమితులను తెలుసుకోవచ్చు.
 • దుర్వినియోగం నివారించేందుకు పరిమితిని ఖాతాదారు సైతం ఒక రోజులో గరిష్టంగా యెంత మొత్తం విత్ డ్రా చెయ్యవచ్చో నిర్ణయించుకోవచ్చు.
 • బ్యాంకులు, ప్రభుత్వం నిర్ణయించిన రోజూ వారీ పరిమితులను ఏటీఎమ్‌ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు.

జాగ్రత్తలు

 • ఏటీఎమ్‌ పిన్‌ను కార్డుపై కానీ వేరే ఎక్కడా రాసి ఉంచుకోకూడదు. ఒకవేళ ఎప్పుడైనా ఏటీఎమ్‌ కార్డు పోగొట్టుకుంటే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. పిన్‌ నాలుగు అంకెలు ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవడం మంచిది.
 • ఇతరులు సులభంగా ఊహించగల పిన్‌ నెంబరు ఉండకుండా చూసుకోవాలి. ఉదాహరణకు పుట్టినరోజు లాంటివి.
 • అపరిచితుల ద్వారా ఏటీఎమ్‌ల్లో సహాయం పొందడం మంచిది కాదు. ఏటీఎమ్‌ ఉపయోగించడం తెలిసే వరకూ మనకు తెలిసిన వారి సాయం పొందవచ్చు.
 • ఏటీమ్‌ యంత్రంలో ఏదైనా సమస్య తలెత్తితే సంబంధిత బ్యాంకు శాఖకు తెలియజేసి సమస్యను పరిష్కరించుకోవాలి.
 • వరుసగా మూడుసార్లు పిన్‌ నెంబరును తప్పుగా ఎంటర్‌ చేస్తే, తర్వాతి 24 గంటల వరకూ ఎటీఎమ్‌ కార్డు పనిచేయదు.
 • కార్డును లోపలికి తీసుకునే ఏటీఎమ్‌ యంత్రాల కంటే, స్వాప్‌ చేయగలిగే ఏటీఎమ్‌లను వాడడం శ్రేయస్కరం. ఎందుకంటే మొదట తెలిపిన వాటిలో ఎటీఎమ్‌ పిన్‌ను తప్పుగా నమోదు చేసినా, ఖాతాలో ఉన్నదాని కంటే ఎక్కువ మొత్తం కోసం ప్రయత్నించినా కార్డు యంత్రం లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది.
 • ఏటీఎమ్‌ పొగొట్టుకుంటే వెంటనే వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించి కార్డును బ్లాక్‌ చేయించాలి. తర్వాత కొత్త కార్డు కోసం బ్యాంకు శాఖను సంప్రదించాలి.

ఏటీఎమ్ కార్డుతో ఏ లావాదేవీ జరిపినా కార్డును వెనక్కి తీసుకోవడం మరిచిపోకూడదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly