పీపీఎఫ్ vs వీపీఎఫ్ - ఏది మేలు?

వీపీఎఫ్ వ‌డ్డీ రేట్లు ఈపీఎఫ్‌కి స‌మానంగా ఉంటాయి. ఈపీఎఫ్ ప్ర‌తి నెల మీ వేత‌నం నుంచి ఈపీఎఫ్ఓతో జ‌మ చేయాల్సి ఉంటుంది.

పీపీఎఫ్ vs వీపీఎఫ్ - ఏది మేలు?

పీపీఎఫ్‌లో పెట్టుబ‌డుల‌తో సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. ఇదే మాదిరిగా వీపీఎఫ్ కూడా ప‌న్ను ఆదాతో పాటు మంచి రాబ‌డిని అందిస్తుంది. ఈపీఎఫ్ఓ 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి వ‌డ్డీ రేటును 8.65 శాతంగా ప్ర‌క‌టించింది. వీపీఎఫ్ వ‌డ్డీ రేటు కూడా అంతే స‌మానంగా ఉంటుంది.

వీపీఎఫ్‌ను పీపీఎఫ్‌తో పోలిస్తే, వ‌డ్డీ రేటు పీపీఎఫ్‌కు 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏప్రిల్ 1, 2019 నుంచి జూన్ 30 2019 వ‌ర‌కు వ‌డ్డీ రేట్లు 8 శాతంగా నిర్ణ‌యించారు. ఈపీఎఫ్ఓ ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి వ‌డ్డీరేట్ల‌ను 8.65 శాతంగా నిర్ణ‌యించింది. అంటే వీపీఎఫ్‌ అద‌నంగా 65 బేసిస్ పాయింట్లు అధిక రాబ‌డిని ఇస్తుంది. పీపీఎఫ్ రేట్లు త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తారు కానీ వీపీఎఫ్‌, ఈపీఎఫ్ వ‌డ్డీ రేట్లు వార్షికంగా ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌ర్లో స‌వ‌రిస్తారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాల‌నుంచి వీపీఎఫ్ వ‌డ్డీ రేట్ల‌ను పీపీఎఫ్‌తో పోలిస్తే ఎక్కువ రాబ‌డిని ఇస్తున్నాయి. అవి ఒక‌సారి ప‌రిశీలిస్తే…

  • 2017-18 సంవ‌త్స‌రంలో వీపీఎఫ్ఈ/పీఎఫ్ వ‌డ్డీరేట్లు 8.55 శాతం కాగా, పీపీఎఫ్ రేటు 7.6 శాతం నుంచి 7.9 శాతం
  • 2016-17 సంవ‌త్స‌రంలో వీపీఎఫ్ /పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 8.65 శాతం కాగా, పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 8-8.1 శాతంగా ఉంది.
  • 2015-16 సంవ‌త్స‌రంలో వీపీఎఫ్/ పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 8.8 శాతం కాగా పీపీఎఫ్ రేటు 8.7 శాతంగా ఉంది.
  • 2014-15 లో వీపీఎఫ్ఈ/పీఎఫ్ వ‌డ్డీ రేటు 8.75 శాతం కాగా, పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 8.7 శాతం
  • 2013-14 లో వీపీఎఫ్ పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 8.75 శాతం కాగా, పీపీఎఫ్ రేటు 8.7 శాతం

ఈ రెండింటినీ పోల్చి చూస్తే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పీపీఎఫ్ కంటే వీపీఎఫ్ అద‌న‌పు రాబ‌డిని ఇస్తుంది. దీంతో వీపీఎఫ్ మంచి పెట్టుబ‌డి ఆప్షన్‌గా చెప్పుకోవ‌చ్చు.

(Source: Livemint)

ఈ కింది కథనాలు చదివి ఈ రెండు పథకాల్లో ఏది మేలో మరింత వివరంగా తెలుసుకోండి:

http://eenadusiri.net/What-makes-VPF-a-better-investment-choice-than-PPF-rAOATeW
http://eenadusiri.net/VPF-a-better-investment-choice-than-PPF-O2vX1v3
http://eenadusiri.net/Benefits-of-investing-in-Voluntary-Provident-Fund-7LVHx9r
http://eenadusiri.net/vpf-or-ppf-which-one-is-good-for-investment-xdnJPgn

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly