ఎస్‌బీఐ డెబిట్ కార్డుల లావాదేవీల ప‌రిమితులు

త‌మ పొదుపు ఖాతాదారుల‌కు ఒక నెల‌లో 8 ఉచిత లావాదేవీలను చేయడానికి అనుమతిస్తుంది

ఎస్‌బీఐ డెబిట్ కార్డుల లావాదేవీల ప‌రిమితులు

దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ‌ వినియోగదారులకు ఏడు రకాల ఏటీఎం-కమ్-డెబిట్ కార్డులను అందిస్తుంది. కార్డు వేరియంట్‌పై ఆధారపడి, రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి రూ. 20,000 నుంచి ల‌క్ష రూపాయ‌ల‌ వరకు ఉంటుంది. జూలై 1 నుంచి, ఎస్‌బీఐ తన ఏటీఎం ఉపసంహరణ నిబంధనలను సవరించింది. అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in) లో లభించిన సమాచారం ప్రకారం, ఎస్‌బీఐ తన రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు ఒక నెల‌లో 8 ఉచిత లావాదేవీలను చేయడానికి అనుమతిస్తుంది. దీనికి మించి, ప్రతి లావాదేవీపై వినియోగదారులకు వసూలు చేస్తారు.

ఎస్‌బీఐ డెబిట్ కార్డుల లావాదేవీల ప‌రిమితుల గురించి తెలుసుకుందాం…

  1. ఎస్‌బీఐ క్లాసిక్ అండ్ మ్యాస్ర్టో డెబిట్ కార్డుల ఏటీఎం లావాదేవీల ప‌రిమితి రూ.20,000
    2.ఎస్‌బీఐ గ్లోబ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ డెబిట్ కార్డు ప‌రిమితి రూ.40,000

  2. ఎస్‌బీఐ గోల్డ్ ఇంట‌ర్నేష‌న‌ల్ డెబిట్ కార్డ్‌- రూ.50,000

  3. ఎస్‌బీఐ ప్లాటినం ఇంట‌ర్నేష‌న‌ల్ డెబిట్ కార్డ్‌- రూ.1,00,000

  4. ఎస్‌బీఐఎన్‌ట‌చ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డ్‌- రూ.40,000

  5. ఎస్‌బీఐ ముంబ‌యి మెట్రో కాంబో కార్డ్ లావాదేవీల ప‌రిమితి రూ.40,000

  6. ఎస్‌బీఐ మై కార్డ్ ఇంట‌ర్నేష‌న‌ల్ డెబిట్ కార్డ్- రూ.40,000

    ఎస్‌బీఐ ఇటీవ‌ల ఓటీపీ ఆధారిత లావాదేవీల‌ను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. రూ.10,000 మించిన లావాదేవీల కోసం ఓటీపీ అవ‌స‌రం. దేశంలోని అన్ని ఎస్‌బీఐ ఏటీఎంల‌లో ఈ స‌దుపాయం సెప్టెంబ‌ర్ 18 నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో లావాదేవీల స‌మ‌యంలో మ‌రింత భ‌ద్ర‌త ఏర్ప‌డింది. ఈ సేవ‌లు 24 గంట‌లు అందుబాటులో ఉంటాయి. మీ ఫోన్‌కు వ‌చ్చే లావాదేవీల స‌మాచారాన్ని ప‌ట్టించుకోకుండా వ‌దిలేయ‌కుండా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు సూచించింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly