ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే బీమా ప్రీమియం పెరిగిన‌ట్లే

దీనిపై రెండు నెలల్లో ఐఆర్‌డీఏఐ క‌మిటీ తన నివేదికను అందజేస్తుంది.

ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే బీమా ప్రీమియం పెరిగిన‌ట్లే

కొత్త వాహ‌న చ‌ట్టం ప్ర‌కారం నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే భారీగా జ‌ర‌మానాలు చెల్లించుకోవ‌ల్సిందే అన్న సంగ‌తి తెలిసిందే. అయితే దీని కార‌ణంగా వాహ‌న బీమా ప్రీమియంల‌కు కూడా ఎక్కువ‌గా చెల్లించాలి. దానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా ట్రాఫిక్‌ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసేందుకు గాను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఈ ఆలోచన చేస్తోంది. ప్ర‌భుత్వం కొత్త ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తెచ్చిన వారం రోజుల్లోనే బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏఐ 9 మంది సభ్యుల‌తో కూడిన ఒక క‌మిటీని ఏర్పాటు చేసింది. దీనిపై పూర్తి విచార‌ణ జ‌రిపేందుకు క‌మిటీకి రెండు నెల‌ల స‌మ‌యం ఇచ్చింది. ఆ త‌ర్వాత దిల్లీలో తొలుత ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది.

ఒక‌సారి ఈ విధానం అమ‌ల్లోకి వ‌స్తే చిన్న త‌ప్పు చేసినా ప్రీమియం పెరిగిపోతుంది. వాహ‌నం నడిపే విధానం, జరిగిన ప్రమాదాలు, జారీ అయిన ట్రాఫిక్‌ చలానాలు వంటి అంశాల ఆధారంగా బీమా ప్రీమియంను నిర్ధారించ‌నున్నారు. అందుకే వాహ‌న‌దారులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. అయితే నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా వాహ‌నం న‌డిపిన‌వారికి ప్రీమియంలో డిస్కౌంట్ ల‌భించే అవ‌కాశ‌ముంది.

ఐఆర్‌డీఏఐ క‌మిటీ ప‌రిశీలించాల్సిన అంశాలు… ప్రస్తుతం అమలవుతున్న ఉల్లంఘనల‌కు జరిమానాలు, అంతర్జాతీయంగా అమలవుతున్న పద్ధతులు, మోటార్‌ ఇన్సూరెన్స్‌కు ఉన్న రేటింగ్‌ వ్యవస్థ ఏ తీరున ఉంది. ఒక వాహనం తాలూకు ఉల్లంఘనల చరిత్రను తయారుచేసి దానిని పోలీసు వర్గాలకు, ఇన్సూరెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఐబీఐ) డేటాకు పంపాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly