ఆర్‌బీఐ కమాల్, క్రిప్టో క‌రెన్సీ ఢమాల్!

క్రిప్టో క‌రెన్సీల‌పై ఆర్‌బీఐ క‌ఠిన నిర్ణయాలు తీసుకోవ‌డంతో వాటి విలువ భారీగా పతనమయ్యాయి

ఆర్‌బీఐ కమాల్, క్రిప్టో క‌రెన్సీ ఢమాల్!

బిట్‌కాయిన్ వంటి ఊహాజనిత క‌రెన్సీల పై క‌ఠిన నిబంధ‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు నిన్న జరిగిన ఎమ్‌పీసీ స‌మావేశాల్లో ఆర్‌బీఐ నిర్ణ‌యం తీసుకుంది.ఈ త‌ర‌హా వ‌ర్చువ‌ల్ క‌రెన్సీల ట్రేడింగ్ చేప‌ట్టే ఎక్స్ఛేంజీల‌కు మూడు నెల‌ల్లోపు సేవ‌ల‌ను నిలిపివేయాల‌ని బ్యాంకుల‌ను ఆర్‌బీఐ ఆదేశించించిన విష‌యం విదిత‌మే. దీంతో బిట్‌కాయిన్ స‌హా రిపిల్‌, లైట్‌కాయిన్ వంటి ఇత‌ర వ‌ర్చువ‌ల్ క‌రెన్సీల విలువ భారీగా ప‌డిపోయింది.

నిన్న‌టి ఆర్‌బీఐ నిర్ణ‌యానికి ముందు అంత‌ర్జాతీయ మార్కెట్లో బిట్‌కాయిన్ 6950 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ‌వుతుండ‌గా, మ‌న దేశంలో జెబ్‌పే వంటి ఎక్స్ఛేంజీల్లో ఇది 8 శాతం ప్రీమియంతో రూ.5 ల‌క్ష‌ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిన్న‌ 11.30 గంట‌ల స‌మ‌యంలో అంత‌ర్జాతీయంగా బిట్‌కాయిన్ 6701 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ‌వుతుండ‌గా, దాని విలువ‌కు స‌మానంగా మ‌న వ‌ద్ద రూ.4.35 ల‌క్ష‌ల వ‌ద్ద ఉండాల్సిన బిట్‌కాయిన్ విలువ క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే రూ.3.40 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది.

బిట్‌కాయిన్ల త‌ర‌హాలోనే 10 ఇత‌ర‌ వ‌ర్చువ‌ల్ క‌రెన్సీల విలువ కూడా భారీగా ప‌త‌న‌మ‌యింది. ఆర్‌బీఐ నిర్ణ‌యంతో వీటిలో మ‌దుపు చేసిన వారు అమ్మ‌కాల‌కు తెగ‌బ‌డుతున్నారు. బిట్‌కాయిన్ త‌ర‌హాలోనే ఈథ‌ర్‌, రిపిల్, లైట్‌కాయిన్ వంటి క‌రెన్సీల విలువ త‌గ్గిపోయింది.

కేంద్ర బ్యాంక్ తీసుకున్న నిర్ణ‌యం పూర్తి స్థాయిలో అమ‌ల్లోకి వ‌స్తే ఈ క‌రెన్సీల క్ర‌య విక్ర‌యాల‌కు నెఫ్ట్ లేదా యూపీఐ ప‌ద్ధ‌తిలో న‌గ‌దు పంపించ‌డం, తీసుకోవ‌డం సాధ్య‌ప‌డ‌దు. బ్యాంకుల‌తో స‌హా అన్ని నియంత్ర‌ణ సంస్థ‌లు మూడు నెల‌ల్లోపు ఆయా ఎక్స్ఛేజీల‌కు ఈ సేవ‌ల‌ను నిలిపి వేయాలి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly