ఛార్జీల‌ను పెంచిన మొబైల్ కంపెనీలు..

రిల‌య‌న్స్ జియోతో సహా, వోడాఫోన్ ఐడియా, భార‌తీఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్‌ ఛార్జీలు 47 శాతం వ‌ర‌కు పెర‌గ‌నున్నాయి

ఛార్జీల‌ను పెంచిన మొబైల్ కంపెనీలు..

దేశంలోనే ప్ర‌సిద్ధి చెందిన ప్రైవేట్ టెలికాం ఆప‌రేట‌ర్లు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌, భార‌తీ ఎయిర్‌టెల్ లిమిటెడ్‌, రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సంస్థ‌లు త‌మ ప్రీపెయిడ్ వాయిస్‌, డేటా స‌ర్వీసు ఛార్జీల‌ను పెంచ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ కంపెనీలు ప్ర‌పంచంలోనే అతి త‌క్కువ స్థాయి రేట్ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తూ వ‌చ్చాయి. అయితే ఇందుకు స్వ‌స్థి ప‌లుకుతూ ధ‌ర‌ల‌ను పెంచాల‌ని సంస్థ‌లు తాజాగా నిర్ణ‌యించాయి.

ఛార్జీల‌ను పెంచుతున్న‌ట్లు ముందుగా వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే భార‌తీ ఎయిర్‌టెల్‌, రిల‌య‌న్స్ జియో సైతం ఛార్జీల‌ను పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం విశేషం. టెలికాం సంస్థ‌లు ఆదివారం ప్ర‌క‌టించిన టారీఫ్‌ల ప్ర‌కారం అధిక శాతం ప్లాన్ల‌లో ఛార్జీలు 15 శాతం నుంచి 47 శాతం వ‌ర‌కు పెర‌గ‌నున్నాయి. వొడాఫోన్ ఐడియా, భార‌తీ ఎయిర్‌టెల్‌ కొత్త ఛార్జీలు మంగ‌ళ‌వారం నుంచి అమ‌లు కానుండ‌గా, రిల‌య‌న్స్ జియో కొత్త టారీఫ్‌లు డిసెంబ‌రు 6వ తేది నుంచి అమ‌లులోకి రానున్న‌ట్లు సంస్థ‌లు తెలిపాయి.

సెప్టెంబ‌రు 2016లో రిల‌య‌న్స్ జియో ప్ర‌వేశం త‌రువాత ఈ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర పోటీ నెల‌కుంది. రిల‌య‌న్స్ జియో దాటికి వొడాఫోన్ ఐడియా, భార‌తీ ఎయిర్‌టెల్ మాత్ర‌మే నిల‌బ‌డ‌గ‌ల‌గాయి. ఈ రెండు కంపెనీలు కూడా రికార్డు స్థాయిలో న‌ష్టాల‌ను చ‌విచూశాయి.

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ల‌లో రోజుకు 50 పైస‌లు నుంచి రూ.2.85 వ‌ర‌కు పెర‌గునున్నాయి. ఆక‌ర్ష‌నీయ‌మైన డేటా, కాలింగ్ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్న‌ట్లు కంపెనీ ఆదివారం ప్ర‌క‌టించింది.

ఎయిర్‌టెల్ త‌న ప్ర‌సిద్ధ రూ.169, రూ.199 ప్లాన్ల‌ను విలీనం చేసి ఒకే ప్యాక్ రూ.248ను అందించ‌నుంది. ఇంత‌కు ముందు ఉన్న‌ట్లుగానే దీనికి 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.169 ప్లానును ఎంచుకుంటున్న వినియోగ‌దారులు ఇక‌పై 47 శాతం ఎక్కువ ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అయితే రోజుకు 1.5జీబీని ల‌భిస్తుంది. వినియోగ‌దారులు ఇంత‌కు ముందు కంటే 50 శాతం అధిక ప్ర‌యోజ‌నాన్ని పొంద‌చ్చు. రూ.199 ప్లానును ఎంచుకుంటున్న వినియోగ‌దార‌ల కూడా కొంత అధిక మొత్తం చెల్లించాల్సి వ‌చ్చిన‌ప్ప‌టికీ అధిక ప్ర‌యోజ‌నాల‌ను ఆనందించ‌వ‌చ్చు.

వొడాఫోన్ ఐడియా కూడా ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు 2 రోజులు, 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ల‌ను ప్ర‌క‌టించింది. మునుపటి ప్రణాళికలతో పోలిస్తే కొత్త ప్రణాళికలలో దాదాపు 42 శాతం వరకు రేట్లు పెర‌గ‌నున్నాయి. 49 కోంబో ప్లాన్‌ రూ.38 టాక్‌టైమ్, 100ఎమ్‌బీ డేటా, 2.5/ సెకెన్ టారీఫ్‌, 28 వ్యాలిడిటితో వ‌స్తుంది. రూ.79, రూ.64 టాక్‌టైమ్‌, 200 ఎమ్‌బీ డేటా 1పైసా/ సెకెన్ టారీఫ్‌, 28 వ్యాలిడిటీతో వ‌స్తుంది.

28 రోజుల వ్యాలిడిటీతో వ‌చ్చే అన్‌లిమిటెడ్ ప్లాన్లు-
రూ.149 ప్లాన్‌లో అప‌రిమిత వాయిస్‌( ఆఫ్ నెట్ కాల్స్ కోసం 1000 నిమిషాల‌ ఎఫ్‌మూపీ), 2జీబీ డేటా, 300 ఎస్ఎమ్ఎస్‌లు, 28 వ్యాలిడిటీతో వ‌స్తాయి.
రూ.249 ప్లాన్‌లో-అప‌రిమిత వాయిస్‌( ఆఫ్ నెట్ కాల్స్ కోసం 1000 నిమిషాల‌ ఎఫ్‌మూపీ), రోజుకి 1.5జీబీ డేటా, రోజుకి 100 ఎస్ఎమ్ఎస్‌లు, 28 వ్యాలిడిటీతో వ‌స్తాయి.
రూ.299 ప్లాన్‌లో అప‌రిమిత వాయిస్‌( ఆఫ్ నెట్ కాల్స్ కోసం 1000 నిమిషాల‌ ఎఫ్‌మూపీ), రోజుకి 2జీబీ డేటా, రోజుకి 100 ఎస్ఎమ్ఎస్‌లు, 28 వ్యాలిడిటీతో వ‌స్తాయి.
రూ. 399 ప్లాన్‌లో - అప‌రిమిత వాయిస్‌( ఆఫ్ నెట్ కాల్స్ కోసం 1000 నిమిషాల‌ ఎఫ్‌మూపీ), రోజుకి 3జీబీ డేటా, రోజుకి 100 ఎస్ఎమ్ఎస్‌లు, 28 వ్యాలిడిటీతో వ‌స్తాయి.

రిల‌య‌న్స్ జియో సైతం ఇప్ప‌టి ధ‌ర‌ల కంటే 40 శాతం అధిక ధ‌ర‌తో 300 శాతం అద‌న‌పు ప్ర‌యోజ‌నంతో “ఆన్ ఇన్ ఒన్” ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly