ఫిబ్రవరిలో 2.93 శాతానికి పెరిగిన టోకు ద్ర‌వ్యోల్బ‌ణం

జ‌న‌వ‌రిలో 10 నెల‌ల క‌నిష్ఠంగా 2.76 శాతంగా న‌మోదైన టోకు ద్ర‌వ్యోల్బ‌ణం ఫిబ్ర‌వ‌రిలో 2.93 శాతానికి పెరిగింది

ఫిబ్రవరిలో 2.93 శాతానికి పెరిగిన టోకు ద్ర‌వ్యోల్బ‌ణం

టోకు ధ‌ర‌ల సూచీ ద్ర‌వ్య‌ల్బ‌ణం ఫిబ్ర‌వ‌రి నెల‌లో 2.93 శాతానికి పెరిగింది. గ‌తేడాది ఇదే స‌మ‌యానికి ఇది 2.74 శాతంగా ఉంది. ప్రాథ‌మిక వ‌స్తువులు, ఇంధ‌నం, విద్యుత్ వంటి ధ‌ర‌లు పెర‌గ‌డంతో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగింది. జ‌న‌వ‌రి 2019 లో ఇది 2.76 శాతంగా న‌మోదైంది. ఆహార ప‌దార్థాలు , కూర‌గాయ‌లు, పాల ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం జ‌న‌వ‌రిలో 1.85 శాతం ఉండ‌గా, ఫిబ్ర‌వ‌రిలో 4.84 శాతంగా ఉంది. ఇంధ‌నం, విద్యుత్ ద్ర‌వ్యోల్బ‌ణం 1.85 శాతం నుంచి 2.23 శాతానికి పెరిగింది.

సాధారణంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకునేప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. జనవరిలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్‌బీఐ, కీల‌క రేట్ల‌ను 0.25 శాతం త‌గ్గించింది. మ‌రి ఈ సారి ఏప్రిల్‌లో జ‌ర‌గ‌బోయే ప‌ర‌ప‌తి స‌మావేశంలోఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి. జనవరిలో 19 నెలల కనిష్ఠమైన 1.97 శాతంగా ఉన్న వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 2.57 శాతంగా నమోదైంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly