టోకు ద్ర‌వ్యోల్బ‌ణం 2.45 శాతానికి ప‌రిమితం

టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం ఏప్రిల్‌లో 3.07 శాతం కాగా మే నెల‌లో 2.45 శాతానికి త‌గ్గింది.

టోకు ద్ర‌వ్యోల్బ‌ణం 2.45 శాతానికి ప‌రిమితం

ఆహార పదార్థాలు, ఇంధన, విద్యుత్‌ ధరలు తగ్గడంతో టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం దిగొస్తోంది. మే నెలలో 22 నెలల కనిష్ఠానికి తగ్గి 2.45శాతానికి పరిమితమైంది. ఏప్రిల్‌లో ఇది 3.07శాతం కాగా… 2018 మే నెలలో 4.78శాతంగా నమోదైందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2017 జులై తర్వాత టోకు ద్రవ్యోల్బణం ఇంత కనిష్ఠంగా ఉండటం మళ్లీ ఇప్పుడే. 2017 జులైలో ఇది 1.88శాతంగా నమోదైంది.

ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.37శాతంగా ఉండగా… మే నెలలో 6.99శాతానికి తగ్గింది. కూరగాయల విభాగ ద్రవ్యోల్బణం 40.65శాతం నుంచి 33.15శాతానికి పరిమితమైంది. ఇదే సమయంలో ఉల్లి ధరలు మాత్రం పెరిగాయి. ఇంధనం-విద్యుత్‌ విభాగ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.84శాతంగా నమోదవగా… మే నెలలో ఇది 0.98శాతానికి పడిపోయింది. తయారీ ధరలు కూడా తగ్గాయి.

మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల గరిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం మే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.05శాతంగా ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష లో ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. జూన్‌లో జరిగిన సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావుశాతం తగ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా 2019-20 సంవ‌త్స‌రంలో మొద‌టి అర్థ‌భాగంలో ద్ర‌వ్యోల్బ‌ణం అంచ‌నాను 3-3.1 శాతానికి పెంచింది. అసాధార‌ణ వ‌ర్ష‌పాతం , కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెర‌గ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు, ఇత ఆర్థిక అంశాలు ప్ర‌భావం చూప‌వ‌చ్చ‌ని తెలిపింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly