దిగొచ్చిన‌ ద్ర‌వ్యోల్భ‌ణం

ఏప్రిల్ నెల‌లో టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం 3.07 శాతంగా న‌మోదైంది

దిగొచ్చిన‌ ద్ర‌వ్యోల్భ‌ణం

రెండు నెల‌లుగా పెరుగుతున్న టోకు ద్ర‌వ్యోల్బ‌ణ రేటు ఈ ఏడాది ఏప్రిల్‌లో దిగివ‌చ్చింది. ఆహార ధరలు పెరిగిన‌ప్ప‌టికీ, ఇంధనం-తయారీ వస్తువుల ధరలు త‌గ్గ‌డంతో టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెల‌లో 3.07 శాతానికి పరిమితమైంది. మార్చిలో ఇది 3.18 శాతం ఉండ‌గా, ఫిబ్రవరిలో 2.93 శాతం మాత్రమే. గ‌త ఏడాది(2018) ఏప్రిల్‌లో మాత్రం డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3.62 శాతంగా నమోదైంది. అంటే గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి 0.86 శాతం ద్ర‌వ్యోల్బ‌ణ రేటు పెరుగుగా ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు 0.75 శాతం పెరుగుద‌ల న‌మోదైంది. కూరగాయల ధరల వల్ల ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.37 శాతానికి పెరిగింది. మార్చిలో ఇది 5.68 శాతమే. ఇదే సమయంలో కూరగాయల విభాగ ద్రవ్యోల్బణం 28.13 శాతం నుంచి 40.65 శాతానికి పెరిగింది. అయితే బంగాళాదుంపల్లో 17.15 శాతం, ఉల్లిలో 3.43 శాతం, పండ్లలో 6.88 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. 2018 డిసెంబరు మినహా గత 5 నెలల్లో ఆహార ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంధనం-విద్యుత్తు విభాగాల్లో ద్రవ్యోల్బణం 5.41 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గింది. డీజిల్‌లో 7.33 శాతం నుంచి 3.24 శాతానికి, పెట్రోల్‌లో 1.78 శాతం నుంచి 1.74 శాతానికి దిగి వచ్చింది. అయితే వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ)లో 0.94 శాతం నుంచి 11.48 శాతానికి పెరిగింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly