ఇక ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు..

బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌ (ఎన్‌బీఎఫ్‌సీ)పై ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఆర్‌బీఐ ఒక అప్లికేషన్ ఆవిష్కరించింది

ఇక ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు..

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల‌పై ఫిర్యాదులు చేసే విధానాన్ని సులభతరం చేస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త “ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ (సీఎంఎస్)” వెబ్‌సైట్‌ను ప్రారంభించింది, ఈ వెబ్‌సైట్ ద్వారా ఆర్‌బీఐ నియంత్ర‌ణలో ఉన్న ఏ సంస్థలపైనైనా, ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

సీఎంఎస్‌ను ప్రారంభించ‌డంతో ఆర్‌బీఐకి చెందిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌(బీఓ), కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్స్ (సీఈపీసీ) కార్యాలయాల‌కు వచ్చిన ఫిర్యాదుల ప్రాసెసింగ్‌ను డిజిటలైజ్ చేసిన‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్‌ దాస్ మాట్లాడుతూ ఫిర్యాదుల సకాలంలో పరిష్క‌రించ‌డం ద్వారా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో వినియోగ‌దారునికి మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు, సెంట్రల్ బ్యాంక్ నిబద్ధతతో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని తెలిపేందుకు కొత్త ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ ప్రతీకగా చెప్పుకోవ‌చ్చ‌ని అన్నారు.

ఈ వెబ్‌సైట్ ద్వారా, వాణిజ్య‌ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు(అర్బ‌న్ కో-ఆప‌రేటీవ్ బ్యాంక్స్‌), బ్యాంకింగేత‌ర ఆర్ధిక సంస్థ‌లు(ఎన్‌బీఎఫ్‌సీ) మొదలైన ఆర్‌బీఐ నియంత్ర‌ణ‌లో ఉన్నపబ్లిక్ ఇంటర్‌ఫేస్‌ సంస్థలపై ఫిర్యాదులు చేయవచ్చు.

ఆర్‌బీఐ నియంత్ర‌ణ‌లో ఉన్న ఏదైనా సంస్థ‌పై ఫిర్యాధు చేసేందుకు సీఎమ్ఎస్ ఇప్పుడు సింగిల్‌విండోగా ప‌నిచేస్తుంది. సీఎమ్ఎస్ ద్వారా బ్యాంకుల‌పై న‌మోదైన ఫిర్యాధులు అన్ని త‌గిన ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్/ ప్రాంతీయ కార్యాల‌యానికి పంపుతారు.

ఈ విధానం ద్వారా ర‌శీదుల‌ను ఆటోమేటిక్‌గా జ‌న‌రేట్ చేయ‌డం మాత్ర‌మే కాకుండా ఫిర్యాదుల స్థితిని(స్టేట‌స్‌)ను ఎప్ప‌టిక‌ప్ప‌డు తెలుసుకోవ‌చ్చు. అంతేకాకుండా అంబుడ్స్‌మెన్ తీర్పుపై కూడా ఆన్‌లైన్ ద్వారానే అప్పీల్ చేసుకునే అవ‌కాశం ఉండ‌డంతో అప్లికేష‌న్ మెరుగైన పార‌ద‌ర్మ‌క‌త‌ను క‌న‌బ‌రుస్తుంద‌ని ఆర్‌బీఐ తెలిపింది.

వినియోగ‌దారుని సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను దాఖలు చేసేందుకు సీఎమ్ఎస్‌ను రూపొందించారు. ఇది ఎస్ఎమ్ఎస్‌/ ఈమెయిల్ నోటిఫికేషన్లు వంటి స‌దుపాయాల‌ను అందిస్తుంది. ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్, క్లోజ‌ర్ అడ్వైజ‌ర్స్ రిసిప్ట్‌ ద్వారా స్టేట‌స్‌ను ట్రాక్ చేసుకోవ‌చ్చు. అదేవిధంగా అప్పీళ్ల‌ను దాఖ‌లు చేయోచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా వినియోగ‌దారులు త‌మ అభిప్రాయాన్ని స్వ‌చ్ఛందంగా తెలియ‌జేయ‌వ‌చ్చు.

వినియోగ‌దారులు వెబ్‌సైట్‌లో ఫిర్యాధులు ద‌ర‌ఖాస్తు చేసుకునే ప్ర‌క్రియ‌ను తెలియ‌జేస్తూ వీడియో రూపొందించింది. అదేవిధంగా సుర‌క్షిత బ్యాంకింగ్ ప‌ద్ధ‌తులు, ఆర్‌బీఐ నియంత్ర‌ణ కార్య‌క్ర‌మాల‌పై కూడా విడియోల‌ను పొందుప‌రిచింది.

సీఎమ్ఎస్ ద్వారా స్వీక‌రించిన‌ వినియోగ‌దారుల ఫిర్యాదుల‌ను వారి ప్రిన్సిప‌ల్ నోడ‌ల్ ఆఫీస‌ర్స్‌/ నోడ‌ల ఆఫీస‌ర్తు యాక్సిస్ చేసి ప‌రిష్క‌రించేందుకు నియంత్రిత‌ సంస్థ‌ల‌కు సుల‌భంగా ఉంటుంది.

ప‌రిష్కారాల పురోగ‌తిని తెలుసుకునేందుకు, ఆర్‌బీఐ అధికారులు ఫిర్యాదుల‌ను నిర్వ‌హించేందుకు సీఎమ్ఎస్‌లో సౌక‌ర్యాలు ఉన్నాయి. అవ‌స‌ర‌మైతే నియంత్ర‌ణ‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌కు సీఎమ్ఎస్‌లో ల‌భించే స‌మాచారాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.

మీరు కూడా బ్యాంకులు లేదా బ్యాంకిగేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌పై ఏమైనా ఫిర్యాదులు ఫైల్ చేయాలంటే ఈ కింది లింక్‌ను క్లిక్ చేసే కంప్లైట్ ఫైల్ చేయోచ్చు.
https://cms.rbi.org.in/cms/IndexPage.aspx?aspxerrorpath=/cms/cms/indexpage.aspx

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly