బీమాలో థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్స్ పాత్ర ఏంటి?

బీమా సంస్థ‌ల‌కు, బీమా చేసిన వ్య‌క్తికి మ‌ధ్య వారదిలా థ‌ర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్లు(టీపీఏ) ప‌నిచేస్తాయి.

బీమాలో థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్స్ పాత్ర ఏంటి?

సాధార‌ణంగా ఆరోగ్య బీమా పాల‌సీల క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి, ఆసుపత్రుల నెట్వర్కింగ్, నగదు రహిత వైద్య సేవల ఏర్పాటు, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌, స‌కాలంలో సెటిల్ చేయటం వంటి పలు రకాల సేవలను బీమా సంస్థ నుంచి పాల‌సీదారునికి అంద‌డంలో థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్లు స‌హాయ‌ప‌డ‌తారు. న‌గ‌దు ర‌హిత క్లెయిమ్‌ల ఫైల్ చేసే సమ‌యంలో టీపీఏలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

టీపీఏ పాల‌సీదారుల‌కు అందించే సేవ‌లు:

  • టీపీఏ, పాల‌సీదారుల‌కు ఐడీ కార్డుల‌ను జారీ చేస్తుంది. న‌గ‌దు ర‌హిత ఆసుప‌త్రి సేవ‌ల‌ను పొందేందుకు ఆసుప‌త్రి అధికారుల‌కు ఈ కార్డుల‌ను చూపించాల్సి ఉంటుంది.
  • బీమా కంపెనీ స్వ‌యంగా కానీ, బీమా సంస్థ ఆమోదం పొందిన థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్ల ద్వారా కానీ క్లెయిమ్‌ను సెటిల్ చేయ‌వ‌చ్చు.
  • ముందుగా మీరు పాల‌సీ చేసిన బీమా సంస్థ‌తో ఒప్పందం ఉన్న టీపీఏకి స‌మాచారం ఇవ్వాలి.
  • స‌మాచారం అందించిన తర్వాత, ఆసుపత్రికి టీపీఏ నుంచి అధికార లేఖ వస్తుంది.
  • లేఖ అందిన అనంత‌రం ఆసుప‌త్రి వర్గాలు, మీ బిల్లులన్నింటిని టీపీఏకు పంపిస్తారు.
  • క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రొసీజ‌ర్‌ను ప్రారంభించేందుకు గానూ, ఈ బిల్లుల‌ను, ఇత‌ర ప‌త్రాల‌ను టీపీఏ బీమా సంస్థ‌కు అంద‌జేస్తుంది.
  • మీరు ఒక‌వేళ టీపీఏ నెట్‌వ‌ర్క్‌లోని ఆసుప‌త్రిని ఎంచుకుంటే, న‌గ‌దు ర‌హిత క్లెయిమ్ చేసేందుకు వీలుండ‌దు. కానీ ఇందుకు గానూ మీకు అయిన ఖ‌ర్చుల‌ను బీమా సంస్థ చెల్లిస్తుంది.

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly