ఏ పెట్టుబ‌డి ఎంత వ‌ర‌కు అనుకూలం? పార్ట్‌-1

మీ ల‌క్ష్యం, దాన్ని చేరుకునేందుకు ఉన్న స‌మ‌యం, వ‌చ్చే రాబ‌డి వంటి అంశాల ఆధారంగా పెట్టుబ‌డులను ఎంచుకోవాలి

ఏ పెట్టుబ‌డి ఎంత వ‌ర‌కు అనుకూలం? పార్ట్‌-1

ప్ర‌తీ ఒక్క‌రూ ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ ప‌థకాల‌లో పెట్టుబ‌డులు పెడుతూనే ఉంటారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు చాలా మార్గాలు అందు బాటులో ఉన్నాయి. కొన్ని స్వ‌ల్ప‌కాలానికి, మ‌రికొన్ని దీర్ఘ‌కాలానికి మంచి రాబ‌డినిస్తాయి. పెట్టుబ‌డి చేసే ప‌థ‌కం ఏదైనా…దానికి కొన్ని అనుకూల‌త‌లు, ప్ర‌తికూల‌త‌లు, రిస్క్‌, రాబ‌డి, ప‌న్ను వ‌ర్తింపులు, భ‌ద్ర‌త‌, లిక్వీడిటీ, సుల‌భంగా ల‌భ్యం కావ‌డం వంటి ఫీచ‌ర్లు ఉంటాయి.

ఉదాహ‌ర‌ణ‌కి:
ఫైనాన్షియ‌ల్ ఎసెట్స్‌:
బ్యాంకు రిక‌రింగ్ డిపాజిట్‌, ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతాలు, పీపీఎఫ్‌/ ఈపీఎఫ్‌, ఎస్ఎస్‌వై, ఎన్ఎస్‌సీ, ఎన్‌పీఎస్‌, ఎండోమెంట్ పాల‌సీలు, మ‌నీబ్యాక్ పాల‌సీలు, యులిప్స్‌, గోల్డ్ ఈటీఎఫ్‌లు, సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు, యాన్యూటీ ప్లాన్లు, స్టాక్స్‌, మ్యూచువ‌ల్ ఫండ్లు మొద‌లైన ఫైనాన్షియ‌ల్ ఎసెట్స్ అందుబాటులో ఉన్నాయి.

ఫిజిక‌ల్ ఎసెట్స్‌:
గోల్డ్ బారులు/ నాణేలు, న‌గ‌లు, పేయింటింగులు, వైన్‌, రియ‌ల్ ఎస్టేట్‌(వ్య‌వ‌సాయ భూములు, ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్ళు, అపార్టుమెంట్లు మొద‌లైన‌వి ఫిజిక‌ల్ ఎసెట్లు.

ఫైనాన్షియ‌ల్ ఎసెట్స్‌:
1.రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) ఖాతా:
అనుకూల‌త‌లు:

 • ఇది పెట్టుబ‌డులు చేయ‌డం అల‌వాటుగా మారుస్తుంది.
 • స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యాల‌కు మంచిది.
 • వ‌డ్డీ రేటు ముందుగానే తెలుస్తుంది కాబ‌ట్టి నెల‌వారీ చెల్లింపులు, కాల‌ప‌రిమితి ఎంచుకుంటే మెచ్యూరిటీ స‌మ‌యంలో ఎంత మొత్తం వ‌స్తుంద‌ని ముందుగానే తెలుసుకోవ‌చ్చు. మెచ్యూరిటీ మొత్తాన్ని స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు.
 • పొదుపు ఖాతానుంచి ఆర్‌డీ ఖాతాకు స‌రైన స‌మ‌యంలో న‌గ‌దు బ‌దిలీ చేయ‌వ‌ల‌సిందిగా బ్యాంకుల‌కు సూచ‌న‌లు ఇవ్వ‌వ‌చ్చు.

ప్ర‌తికూల‌త‌లు:

 • వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

2.ఫిక్స్‌డ్ డిపాజిట్లు:
అనుకూల‌త‌లు:

 • మిగులు మొత్తాన్ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌కు విన‌యోగించుకోవ‌చ్చు.
 • ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీ మొత్తాన్ని నెల‌వారీ ఖ‌ర్చుల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు.
 • ఇత‌ర పెట్టుబ‌డుల‌తో పోలిస్తే యాక్సిస్ చేయ‌డం సుల‌భం, పైగా భ‌ద్ర‌త కూడా ఉంటుంది.
 • 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తంపై సెక్ష‌న్ 80సీ కింద 1.50 లక్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ప్ర‌తికూల‌త‌లు:

 • వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

3.ఎన్ఎస్‌సీ:
అనుకూల‌త‌లు:

 • 5 సంవ‌త్స‌రాల లాక్ఇన్ పిరియ‌డ్‌తో వ‌చ్చే ఎన్ఎస్‌సీ పెట్టుబ‌డుల‌పై రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

ప్రతికూల‌త‌లు:

 • వడ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

4.ట‌ర్మ్ జీవిత బీమా ప్రీమియం:
అనుకూల‌త‌లు:

 • త‌క్కువ ప్రీమియం ఎక్కువ హామీ ల‌భిస్తుంది.
 • సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం, ప్రీమియంపై రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.
 • వ‌య‌సు/ ఆదాయం, ఆధారంగా హామీ మొత్తాన్ని పెంచుకోవ‌చ్చు లేదా త‌గ్గించుకోవ‌చ్చు.
 • అద‌న‌పు పాల‌సీల‌ను తీసుకోవ‌చ్చు.
 • క్లెయిమ్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు హామీ మొత్తాన్ని, ఒకేసారి గానీ, కొంత భాగాన్ని ఏక‌మొత్తంగా తీసుకుని మిగిలిన భాగాన్ని 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు నెల‌వారీ ఆదాయంగా తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

ప్ర‌తికూల‌త‌లు:

 • ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీలో, కాల‌ప‌రిమితి పూర్తయ్యే వ‌ర‌కు పాల‌సీదారుడు జీవించి వుంటే ఎటువంటి చెల్లింపులు చెయ్య‌రు.
 • ఎండోమెంట్‌/ హోల్‌లైఫ్, మ‌నీబ్యాక్, యులిప్‌ వంటి పాల‌సీల‌లో ప్రీమియం అధికంగా ఉంటుంది. హామీ మొత్తం, రాబ‌డి రెండూ త‌క్కువ‌గానే ఉంటాయి. బీమా, పెట్టుబ‌డుల క‌ల‌యిక‌తో పెట్టుబ‌డులు చెయ్య‌కూడ‌దు.
 • బీమా, పెట్టుబ‌డులు రెండూ విభిన్న ప్రొడ‌క్టులు, నిర్థిష్ట ప్ర‌యోజ‌నం కోసం రూపొందించ‌బ‌డ్డాయి.

5.ఈపీఎఫ్‌/ వీపీఎఫ్‌:
అనుకూల‌త‌లు:

 • ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాతి జీవితం కోసం నిధిని స‌మ‌కూర్చుకోవ‌చ్చు.
 • ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్‌80సీ ప్ర‌కారం రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.
 • వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తించ‌దు.
 • బేసిక్‌+డీఏ నుంచి 100 శాతం మొత్తాన్ని వీపీఎఫ్‌కి కాంట్రీబ్యూట్ చేయోచ్చు.
 • ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. (5 సంవ‌త్స‌రాలు కంటే త‌క్కువ నిరంత‌రం కాలం ప‌నిచేసిన వారికి వ‌ర్తించ‌దు)
 • దీర్ఘ‌కాలంలో కాంపౌండింగ్‌ వ‌డ్డీ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.
 • ఉన్న‌త విద్య‌, వైద్య ఖ‌ర్చులు, కుమార్తె వివాహం, ఇంటి నిర్మాణం వంటి వాటికి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు.

ప్ర‌తికూల‌త‌లు:
వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుందువ‌ల్ల, దీర్ఘ‌కాలంలో మ‌దుపు చేస్తున్న‌ప్ప‌టికీ ఈక్వీటీల మాదిరిగా అధిక రాబ‌డి ఉండ‌దు.

6.పీపీఎఫ్‌: ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌:
అనుకూల‌తలు:

 • ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్‌80సీ ప్ర‌కారం రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.
 • వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.
 • పాక్షిక‌, చివ‌రి విత్‌డ్రాల‌పై ప‌న్న మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.
 • స్వ‌ల్ప‌, మ‌ధ్యకాలిక ల‌క్ష్యాల‌కు పాక్షిక విత్‌డ్రాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ప్ర‌తికూల‌త‌లు:

 • డిపాజిట్లు, విత్‌డ్రాపై కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి.

7.ఎస్ఎస్‌వై - సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌:
అనుకూల‌త‌లు:

 • ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్‌80సీ ప్ర‌కారం రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.
 • ఆడ‌పిల్ల‌ల‌ పేరుపై తీసుకునే ఈ ఖాతాలో పాప‌కు 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు నిండిన త‌రువాత ఉన్న‌త చ‌దువులు, వివాహం కోసం పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు.

ప్ర‌తికూల‌త‌లు:

 • డిపాజిట్లు, విత్‌డ్రాల‌పై కొన్ని ప‌రిమితులు వ‌ర్తిస్తాయి.

8.యాన్యూటీ ప‌థ‌కాలు:
అనుకూల‌త‌లు:

 • ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్‌80సీ ప్ర‌కారం రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.
 • ఖ‌చ్చిత‌మైన‌ నెల‌వారీ ఆదాయం
 • జాయింట్ లైఫ్‌, పాల‌సీ చేసిన వ్య‌క్తి జీవించి ఉన్నంత‌వ‌రకు, పాల‌సీ చేసిన వ్య‌క్తి, వారి భాగ‌స్వామి జీవించి ఉన్నంత‌వ‌ర‌కు, కొనుగోలు విలువ‌పై (పెట్టుబ‌డి చేసిన మొత్తంపై) రాబ‌డి మొద‌లైన వివిధ ఆప్ష‌న్లు ఉంటాయి.

ప్ర‌తికూల‌త‌లు:

 • ఒక‌సారి పాల‌సీ తీసుకుంటే, తిరిగి ఇచ్చేందుకు అనుమ‌తించ‌రు.
 • పెన్ష‌న్ ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

9.యులిప్స్‌:
అనుకూల‌త‌లు:

 • ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్‌80సీ ప్ర‌కారం రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.
 • బీమా కింద ప‌రిగిణించ‌డం వ‌ల్ల విత్‌డ్రా స‌మ‌యంలో ప‌న్ను ప్ర‌యోజ‌నం వ‌ర్తిస్తుంది.
 • ఈక్వీటీ, డెట్‌ల‌లో పెట్టుబ‌డి చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

ప్ర‌తికూల‌త‌లు:

 • ఇది బీమా, పెట్టుబ‌డుల క‌ల‌యిక‌తో వ‌స్తుంది. అందువ‌ల్ల స‌రిప‌డినంత బీమా క‌వ‌రేజ్ ఉండ‌దు.
 • ప్రారంభ సంవ‌త్స‌రాల‌లో ప్రీమియం, మోర్టాలిటీ, అడ్మిన్‌, ఫండ్ మేనేజ‌ర్ ఛార్జీలు అధికంగా ఉండ‌డం వ‌ల్ల అధిక మొత్తంలో నిధిని స‌మ‌కూర్చుకోవ‌డం సాధ్యంకాదు.

10.చిట్ ఫండ్లు:
అనుకూల‌త‌లు:

 • నెల‌వారీ చెల్లింపులు, కాల‌ప‌రిమితి ఎంపిక చేసుకునే అవ‌కాశం స‌భ్యుల‌కు ఉంటుంది.
 • అత్య‌వ‌స‌ర స్థితిలో ఏక‌మొత్తంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ప్ర‌తికూల‌త‌లు:

 • ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉండ‌వు
 • రిజిస్ట్రేష‌న్ లేని సంస్థ‌లు/వ‌్య‌క్తులు నిర్వ‌హించే స్కీమ్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్ర‌మాద‌క‌రం
 • రిక‌రింగ్ డిపాజిట్‌లో వ‌చ్చే వ‌డ్డీ రేట్ల కంటే రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది.
 • కాల‌వ్య‌వ‌ధి ముగిసిన త‌రువాత స‌భ్యులు, లాభ‌నష్టాల‌ను అంచ‌నా వేసి, ఒక‌వేళ లాభం వ‌స్తే…వ‌చ్చిన ఆదాయాన్ని (ఇత‌ర మార్గాల ద్వారా వ‌చ్చిన ఆదాయంగా ప‌రిగ‌ణించి) మీ మొత్తం ఆదాయానికి చేర్చి వ‌ర్తించే స్లాబు ప్ర‌కారం ప‌న్ను చెల్లించాలి.

11.గోల్డ్ ఈటీఎఫ్‌:
అనుకూల‌త‌లు:

 • ఈ విధానం ద్వారా బంగారంలో ప‌రోక్షంగా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.
 • సిప్ విధానం ద్వారా గానీ ఏక‌మొత్తంగా గానీ మ‌దుపు చేయ‌వ‌చ్చు.

ప్ర‌తికూల‌త‌లు:

 • ద్ర‌వ్యోల్భ‌నానికి కొంచెంపైన మాత్ర‌మే రాబ‌డి ఉంటుంది.
 • దీర్ఘ‌కాలంలో అధిక సంప‌ద‌ను వృద్ధి చేసుకోవ‌లేక‌పోవ‌చ్చు.

12.సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు:
అనుకూల‌త‌లు:

 • వ‌డ్డీ రేటు వార్షికంగా 2.50 శాతం ఉంటుంది.
 • మెచ్యూరిటీ స‌మ‌యంలో మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తించ‌దు.
 • మెచ్యూరిటీ స‌మ‌యంలో భౌతిక బంగారాన్ని తీసుకునే స‌దుపాయం ఉంది.

ప్ర‌తికూల‌త‌లు:

 • దీర్ఘ‌కాలంలో ద్ర‌వ్యోల్భ‌ణానికి కొంచెం అధ‌కంగా మాత్ర‌మే రాబ‌డి ఉంటుంది.
 • దీర్ఘ‌కాలంలో మంచి సంప‌ద‌ను సృష్టించుకోవ‌డం సాధ్యంకాదు.
 • వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్లల‌తో పాటు పెట్టుబ‌డులు గురించి తెలుసుకునేందుకు ఈ కింది క‌థ‌నాలు చ‌ద‌వండి
ఏ పెట్టుబడి ఎంత వరకు అనుకూలం? పార్ట్‌-2

ఏ పెట్టుబడి ఎంత వరకు అనుకూలం? పార్ట్‌-3

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly