ముహురత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ఏడాది ఎప్పుడు?

ఆ రోజూ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే ఏడాదంతా శుభప్రదంగా ఉంటుందని పెట్టుబ‌డుదారుల నమ్మకం

ముహురత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ఏడాది ఎప్పుడు?

దీపావ‌ళి రోజున స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు ప్ర‌త్యేకంగా ఒక గంట పాటు ట్రేడింగ్ నిర్వ‌హిస్తాయి. దీనినే మూర‌త్ ట్రేడింగ్ అంటారు. హిందూ పంచాంగం ప్రకారం దీపావళి నుంచి వ్యాపారులు, బ్రోకర్లకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. 'ముహూరత్ ట్రేడింగ్’కి ముందు స్టాక్ బ్రోకర్లు ‘చోప్రా పూజ’ అంటే స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఖాతా పుస్తకాలను ఆరాధించడం ఆచారంగా వ‌స్తోంది.

ఆ రోజూ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే ఏడాదంతా శుభప్రదంగా ఉంటుందని నమ్మకం. ఈ నమ్మకంతోనే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లోనూ ఏటా దీపావళి రోజు సాయంత్రం ఒక గంట సేపు ‘మూరత్‌’ ట్రేడింగ్‌ పేరుతో లావాదేవీలు నిర్వహిస్తారు. దీపావళి మరుసటి రోజు దీపావళి బలిప్రతిపాద పండగను పురస్కరించుకుని స్టాక్‌ ఎక్జ్చేంజ్‌లకు సెల‌వు ఉంటుంది.

ఎప్పుడు ఉంటుంది?
దీపావ‌ళి రోజున ఒక శుభ‌ ముహుర్తంలో ట్రేడింగ్‌ నిర్వ‌హిస్తారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 27, 2019 ఆదివారం సాయంత్రం 6.15 గంట‌ల నుంచి 7.15 వ‌ర‌కు ఈ ట్రేడింగ్ జ‌ర‌గ‌నుంది.

మూరత్ ట్రేడింగ్ చ‌రిత్ర ఏం చెప్తోంది?
బీఎస్ఈ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ 1957 నుంచి, ఎన్ఎస్ఈ 1992 నుంచి మూర‌త్ ట్రేడింగ్ నిర్వ‌హిస్తున్నాయి. ఈ రోజున ట్రేడింగ్ అనేది ఒక‌ ఆచారంగా వ‌స్తోంది. దీనిని వాణిజ్య సమాజం అర్ధ శతాబ్దానికి పైగా అనుసరిస్తోంది. మూర‌త్ ట్రేడింగ్‌లో కొన్ని షేర్లు కొనుగోలు చేసినా సంవ‌త్ ఏడాది మొత్తం లాభం వ‌స్తుంద‌ని, శుభం చేకూరుతుందని, ల‌క్ష్మీ దేవి క‌టాక్షం ఉంటుంద‌ని విశ్వ‌సిస్తారు. కొంత‌మంతి పెట్టుబ‌డుదారులు ఆ రోజు కొనుగోలు చేసిన షేర్లు ఎప్పుడూ విక్ర‌యించ‌కుండా త‌ర్వాత త‌రాల‌కు ఇస్తారు.

మూర‌త్ ట్రేడింగ్ రోజు సూచీలు ఎలా స్పందిస్తాయి?
గ‌త‌ 14 మూర‌త్ ట్రేడింగ్ సెష‌న్లలో 11 సార్లు బీఎస్ఈ సెన్సెక్స్ లాభ‌ప‌డింది. గ‌తేడాది మూర‌త్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 0.7 శాతం లాభ‌ప‌డి 35,237 వ‌ద్ద‌, నిఫ్టీ 0.65 శాతం 10,598 వ‌ద్ద ముగిశాయి. అక్టోబ‌ర్ 28 , 2008 దీపావ‌ళి రోజున సెన్సెక్స్ భారీగా 5.86 శాతం లాభ‌ప‌డింది. నిఫ్టీ 9,008 వ‌ద్దకి చేరింది. త‌ర్వాత సంవ‌త్స‌రాల‌లో సూచీలు ప‌రిమితంగా న‌మోద‌య్యాయి.

ఈ ఏడాది ఎలా ఉండ‌బోతుంది?
విశ్లేష‌కులు సంవ‌త్ 2076 కూడా సానుకూలంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ ఏడాది నిఫ్టీ 14,000 పైకి చేరుతుంద‌ని, నిఫ్టీ 46,000 పైకి చేరుతుంద‌ని చెప్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly